నిత్యవసర సరుకులపై రెప్రజెంటేషన్ ఇచ్చిన..

పాణ్యం టిడిపి మండల కన్వీనర్ జయరామి రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, పాణ్యం నియోజకవర్గ టిడిపి మండల కన్వీనర్ జయరాం రెడ్డి, లాయర్ బాబు ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు ఎమ్మార్వో నాగమణి గారికి రిప్రజెంటేషన్ అందించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ జయరామి రెడ్డి, లాయర్ బాబు లు మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యవసర వస్తువులు ఆకాశాన్ని అంటాయని, సామాన్య ప్రజలు నిత్య అవసరాల వస్తువులను కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ముస్లింలకు రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి చంద్రన్న కానుక వంటి కానుకలు అందజేశామని డీలర్ల వద్ద నుండి రేషన్ దుకాణాల ద్వారా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరలకే బియ్యం, కందిపప్పు, చింతపండు, చక్కెర, మొదలగు వస్తువులు అందించామని,


వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొబైల్ వాహనాల ద్వారా 15 రోజుల పాటు పంపిణీ మాత్రమే చేస్తున్నారని ,టిడిపి ప్రభుత్వంలో రేషన్ దుకాణాల లో డీలర్లు 30 రోజులపాటు సామాన్య ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి అందించేవారని, వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు పనికిరాని బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని, కరోనాకాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక మనిషికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని  పంపిణీ చెయ్యమని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వైయస్సార్ ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని కూడా పంపిణీ చేయలేదని, డీలర్ల ద్వారానే రేషన్ బియ్యాన్ని ప్రజలకు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాణ్యం టిడిపి మండల కన్వీనర్ జయరాం రెడ్డి, లాయర్ బాబు, టిడిపి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: