తహసిల్దారు పై తప్పుడు ఆరోపణలు సమంజసమా
గడివేముల మండల ఉపాధ్యక్షులు కాల్ నాయక్
(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
తహసిల్దార్ అవినీతి అక్రమాలకు పాల్పడిందని తప్పుడు ప్రచారం సమంజసం కాదని గడివేముల మండలం ఎల్ కే తాండ గ్రామనికి చెందిన గడివేముల మండల ఉపాధ్యక్షులు కాలు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా తమ్ముడు లింబే నాయక్ కు ఏడుర్ల గవి వద్ద సర్వేనెంబర్ 461 రిజిష్టర్ భూమి కలదు. లింబె నాయక్ కుమార్తె వివాహానికై సదరు భూమిని అమ్మేందుకు తిరుపాడు గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తి కి విక్రయించేందుకు అంగీకరించి, సదరు భూమి పట్టా ఉన్నదా లేదా రిజిస్టర్ భూమా కాదా అని తాసిల్దారును విచారించి భూమిని కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగిందన్నారు.
తహసిల్దార్ నాగమణి మా దగ్గరి బంధువు కావడంతో తహసిల్దార్ నాగమణి దృష్టికి తీసుకెళ్లామనీ ఈ విషయాన్ని వక్రీకరించి ఒక ప్రభుత్వ అధికారి పై ఒక పత్రిక ప్రతినిధి అనుచిత ప్రచురణ చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడివేముల మండలం తాసిల్దార్ నాగమణి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కాలు నాయక్ తెలిపారు.
Home
Unlabelled
తహసిల్దారు పై తప్పుడు ఆరోపణలు సమంజసమా-- గడివేముల మండల ఉపాధ్యక్షులు కాల్ నాయక్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: