చదివే ప్రతి విద్యార్ధికి పాఠ్యపుస్తకాలు చేరాలి
ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి...
రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులు
నంద్యాల జిల్లా ఇంఛార్జ్ డీఈఓ అనురాధకు సమష్యలపై వినతిపత్రం అందజేత
(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్ధినీ , విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు అందజేసి , మధ్యాహ్న భోజన పధకాన్ని సక్రమంగా అమలు చేసి విద్యార్ధులకు నాణ్యమైన , రుచికరమైన పౌష్టికాహారాన్ని అందజేయాలని రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ నేతలు కోరారు. నంద్యాల జిల్లా విద్యాధికారి (డీఈఓ) కార్యాలయంలో ఇంఛార్జ్ డీఈఓ అనురాధ గారికి సమష్యలు వివరించి , వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ చైర్మన్ రామినేని రాజునాయుడు , కన్వీనర్ ఓబులేసు , జేఏసీ నేతలు పూల వెంకట్ , వేణు మాధవరెడ్డి , నాగన్నలు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల ఫీజులను ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారని ప్రైవేటు పాఠశాలలపై ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో ఇంకా పాఠ్యపుస్తకాల కొరత ఉందనీ , దానిని అధిగమించాలనీ , మధ్యాహ్న భోజన పధకంలోని ఏజెన్సీలు విద్యార్ధులకు న్యాణ్యమైన , రుచి కరమైన ఆహారాన్ని అందించాలని వారు కోరారు. విద్యార్ధులకు పంపిణీ చేసే గుడ్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే పాఠశాలల విలీనాన్ని ఆపాలన్నారు.
ప్రస్తుతం జిల్లాలో అధికంగా వర్షాలు కురుస్తున్నాయి కావున ప్రతి పాఠశాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేసి , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చేసి శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఇన్చార్జి డీఈవో అనురాధ గారికి వినతి పత్రాన్ని అందజేశారు.
Home
Unlabelled
చదివే ప్రతి విద్యార్ధికి పాఠ్యపుస్తకాలు చేరాలి...రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకుల డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: