ఘనంగా కేశినేని శ్వేత నిశ్చతార్థం

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె, విజయవాడ కార్పొరేటర్ శ్వేత వివాహ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రామానికి రాజకీయ, వ్యాపార ప్రముఖులు హారయ్యారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ కాజా రామనాథం మనవడు రఘుతో హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ఈ వేడుక జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటూ పలువురు రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

కృష్ణా జిల్లా ముదినేప‌ల్లికి చెందిన కాజా ర‌ఘుతో శ్వేత పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. రఘు కుటుంబానికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది. ముదినేపల్లి నియోజకవర్గం నుంచి ఓసారి స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటి స్పీకర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించిన శ్రీ కాజా రామనాథం మనువడు రఘు.

ఎంపీ కేశినేని నాని శ్వేత విజయవాడ టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. అమెరికాలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని స్వదేశానికి వచ్చారు.. 2019 ఎన్నికల్లో తండ్రి నాని గెలుపు కోసం ఆమె పనిచేశారు. విజయవాడలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కార్పొరేటర్‌గా పోటీ చేయగా.. టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆమె కార్పొరేటర్‌గా విజయం సాధించారు.. కానీ టీడీపీ అక్కడ పాగా వేయలేకపోయింది. దీంతో కార్పొరేటర్‌ పదవికి పరిమితం అయ్యారు. ఆ తర్వాత విజయవాడ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. తండ్రికి రాజకీయ వారసురాలిగా కొనసాగుతున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: