కుట్టు మిషన్లు ఇప్పించండి...

పెసర వాయి గ్రామ మహిళల విన్నపం

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా,గడివేముల మండల పరిధిలోని పెసరవాయి గ్రామంలో జె ఎస్ డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ వారి సౌజన్యంతో మహిళలు అన్ని రంగాలలో ముందుకు వచ్చి వారి కాళ్లపై వారు నిలబడాలనే ఉద్దేశంతో మహిళలకు  కుట్టు మిషన్లపై దుస్తువులు కుట్టుకునే విధంగా ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి నేర్పించారు. కుట్టు మిషన్లపై శిక్షణ పూర్తి అయిన అనంతరం వారికి కుట్టుమిషన్లు ఇస్తామని చెప్పారు. శిక్షణ కాలంలో JSW యాజమాన్యం వారికి  ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే శిక్షణాకాలం  పూర్తి చేసుకున్నారు


. అనంతరం కుట్టు మిషన్ కావాలి అనుకునే మహిళలు 1000 రూపాయలు చెల్లిస్తే కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని చెప్పి దాదాపు 200 మంది మహిళల దగ్గర నుండి 1000 రూపాయలు పెసరవాయి గ్రామ మహిళా కానిస్టేబుల్ ద్వారా తీసుకోవడం జరిగింది, డబ్బులు చెల్లించిన మహిళలకు ఆరు నెలల లోపల కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని చెప్పారు , కానీ సంవత్సర కాలం గడుస్తున్నా కుట్టు మిషన్లు పంపిణీ చేయలేదని తాము ఇచ్చిన 1000 రూపాయలకు ఎటువంటి రసీదు కూడా ఇవ్వలేదని, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలాగైనా తమకు కుట్టుమిషన్లు పంపిణీ చేయాలని తమకు కుట్టు మిషన్లో శిక్షణ ఇచ్చిన JSW యాజమాన్యం వారిని పెసర వాయి గ్రామ మహిళలు కోరుకుంటున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: