భర్త మరణాన్ని తట్టుకోలేక 24 గంటల్లో భార్య మరణం
చిన్న పొరపొచ్చలకే కాపురాలు పటాపంచలవుతున్న తరుణంలో ఒకరంటే ఒకరు అంటే ప్రాణంగా భావించే జంటలు కూడా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన జరిగింది. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య 24 గంటలు గడవకముందే కన్నుమూసింది. సిరిమామిడి పంచాయితీ తోటూరుకు చెందిన భర్తు సుందరరావు భార్యతో కలసి ఉపాధి రీత్యా బిలాయ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం అనారోగ్యంతో సుందరరావు కన్నుమూశారు. భర్త చనిపోయిన బాధలో భార్య పుణ్యవతి కూడా సోమవారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచారు. భార్యాభర్తల మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.
సుందరరావు పెద్ద కుమారుడికి వివాహం కాగా.. చిన్న కుమారుడికి ఈ నెల 20న పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ అనివార్య కారణాలతో పెళ్లి వాయిదా పడింది. ఇంతలో సుందరరావు మరణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సుందరరావు వాడబలిజ సంక్షేమసంఘం జాతీయ సంఘ వ్యవస్థాపక సభ్యునిగా.. తోటూరు అరుణోదయ సంఘం అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నారు. బిలాయ్ కుర్సీపార్ ఇందిరాగాంధీ విద్యాలయం ఉపాధ్యాయునిగా తెలుగు చదువులకు సేవలందిస్తున్నారు.
Home
Unlabelled
భర్త మరణాన్ని తట్టుకోలేక 24 గంటల్లో భార్య మరణం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: