ఆగస్టు 15 వేడుకలకు నోచుకోని...
పశువైద్యద్య శాలలు
(జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)
భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మన దేశవ్యాప్తంగా ఊరువాడ ప్రతిచోట జాతీయ జెండా అందుకు భిన్నమైన వాతావరణం నంద్యాల జిల్లా, గడివేముల మండల పరిధిలోని పశు వైద్యశాలలో కనిపించింది. ఈ పశు వైద్యశాలలో కనీసం జాతీయ జెండాను ఎగరవేసే నాధుడే కల్పించలేదు. ఫలితంగా ఆగస్టు 15వ తేదీన ఇక్కడ జాతీయ జెండా ఎగరలేదు. పశు వైద్యశాల సిబ్బంది తీరుపై గ్రామ ప్రజలు బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అజాదీ కా అమృత్ వజ్రోత్సవ కార్యక్రమాలలో భాగంగా దేశ వ్యాప్తంగా ఆగస్టు 15 వజ్రోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హర్ ఘర్ తిరంగా నినాదంతో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అయితే గడివేముల మండలంలోని పశు వైద్యశాల అధికారులు అందుకు పూర్తి భిన్నంగా కనీసం జాతీయ జెండా కూడ ఎగరవేయలేదు.
వివరాల్లోకి వెళితే గడివేముల, పెసర వాయి,గడిగరేవుల, కొరటమద్ది గ్రామాల్లో పశువైద్య కేంద్రాలు ఉన్నాయి. గడివేముల, పెసరవాయి గ్రామాలలో తప్ప గడిగరేవుల, కోరట మద్ది గ్రామాలకు చెందిన పశువైద్యశాల కేంద్రాల వద్ద జాతీయ జెండా ఎగరకపోవడం చాలా దురదృష్టకరం . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉన్నతాధికారులు జెండా పండుగ చేయాలని ఆదేశాలు జారీ చేసినా వారి ఆదేశాలను లెక్కచేయకుండా పశువైద్యశాల సిబ్బంది గాలికి వదిలివేయడం చాలా దురదృష్టకరం. దేశమంతా అన్ని గ్రామాలలో అజాదిక్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమం లో భాగంలో 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఇంటి ముందు జాతీయ జెండా పండుగను ఘనంగా నిర్వహించి జాతీయ జెండాను ఎగురవేశారు. గడిగరేవుల, కొరటమద్ది పశు వైద్యశాల సిబ్బంది పశు వైద్యశాలలో మాత్రం త్రివర్ణ పతాకాన్ని ఎగర వెయ్యకుండా అధికారుల ఉత్తర్వులను బేఖాతరు చేశారు. ఉన్నత చదువులు చదివిన పశువైద్యాధికారులు జాతీయ జెండాను ఆవిష్కరణ చేయకపోవడం చాలా దురదృష్టకరం . జాతీయ జెండాను ఆవిష్కరించలేనంతగా గడిగరేవుల, కొరటమద్ది పశువైద్యాధికారులు, సిబ్బంది తీరిక లేకుండా ఉన్నారని, జాతీయ జెండాను ఆవిష్కరించని పశు వైద్యశాల సిబ్బంది పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలుకోరుతున్నారు.
Post A Comment:
0 comments: