పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఎంపిడిఓ విజయసింహారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయం నందు జరిగిన ప్రధానోపాధ్యాయులు ఇంజనీరింగ్ సహాయకులు, విద్యా సంక్షేమ సహాయకులు, ఏఎన్ఎం,లకు ఏర్పాటుచేసిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఎంపిడిఓ విజయసింహారెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు విద్యార్థులకు అందజేయాలని సూచించారు, ప్రతిరోజూ సచివాలయ సిబ్బంది పాఠశాలను తప్పనిసరిగా సందర్శించి రిథమ్ యాప్ ను పూరించాలని సూచించారు,
ప్రధానోపాధ్యాయులు నాడు నేడు పనులు వేగవంతం చేయాలని జీవీకే కిట్లను పంపిణీ చేసి బయోమెట్రిక్ తీసుకోవాలని సూచించారు అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకం మరియు విద్యార్థుల హాజరు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయసింహారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం, ఈవో ఆర్ డి ఖాలీక్ బాషా, ప్రధానోపాధ్యాయులు, అసిస్టెంట్లు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Home
Unlabelled
పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -- ఎంపిడిఓ విజయసింహారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: