సర్పంచ్ ఫిర్యాదుతో...ఫోర్జరీ సంతకంపై విచారణ
(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
నా సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ స్పందన కార్యక్రమంలో గడివేముల సర్పంచ్ రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదుపైఅధికారులు అధికార్లు స్పందించారు. చెక్ ఫోర్జరీ సంతకాలు గురించి నంద్యాల జిల్లా డిఎల్ పీఓ రాంబాబు స్థానిక గడివేముల గ్రామ పంచాయతీ భవనంలో విచారణ చేపట్టారు. సర్పంచ్ రమణమ్మ, పంచాయతీ కార్యదర్శి తారకేస్వరిని విచారణ జరిపి వారి వద్ద నుండి తీసుకున్న సమాచారాన్ని జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేస్తానని డిఎల్ పీఓ రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయసింహారెడ్డి, ఈవోఆర్ డీ ఖాలిక్ భాషా పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: