ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో...జగదీప్ ధన్కర్ విజయం ఖాయం
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగదీప్ ధన్కర్ విజయం ఖాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికైన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్కు అమిత్ షా ముందస్తు అభినందనలు తెలిపారు. శనివారం సాయంత్రం సుదీర్ఘంగా జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో పలువురు నేతల పేర్లను పరిశీలించిన మీదట జగదీప్ ధన్కర్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసిన విషయం విదితమే.
ఈ ప్రకటన వెలువడినంతనే అమిత్ షా ఇంటికి జగదీప్ ధన్కర్ వెళ్లారు. ధన్కర్ను సాదరంగా ఆహ్వానించిన అమిత్ షా... ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం ధన్కర్ విజయం ఖాయమేనంటూ ట్విట్టర్ వేదికగా అమిత్ షా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఉపరాష్ట్రపతిగా ధన్కర్ ఎన్నికతో పార్లమెంటులో ఎగువ సభ ఔన్నత్యం మరింత పెరుగుతుందని తెలిపారు. ఫలితంగా దేశానికి మేలు జరుగుతుందని కూడా అమిత్ షా పేర్కొన్నారు.
Home
Unlabelled
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో...జగదీప్ ధన్కర్ విజయం ఖాయం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: