పాఠశాల భవన నిర్మాణానికి.. శంకుస్థాపన
(జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)
పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, ఓర్వకల్ మండలం కనమడకల గ్రామంలో రెడ్డికొండ రాజేంద్రనాథ్ రెడ్డి ఉచితంగా ఇచ్చిన ఒక ఎకరా స్థలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పది తరగతి గదులు నిర్మాణమునకు నాడు నేడు ఫేస్-2 నిధులు రూ.1,19,00,995 రూపాయల వ్యయంతో భూమి పూజ కార్యక్రమం చేసారు.
శంకుస్థాపన కార్యక్రమానికి పాణ్యం ఎమ్యెల్యే మరియు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.శంకుస్థాపన అనంతరం ఎమ్యెల్యే గ్రామంలోని విద్యార్థులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి ఇస్తున్న పథకాలను విద్యార్థినీ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు తెలిపి అందరూ బాగా చదివి మన రాష్ట్రానికి మన జిల్లాకు ,గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని,అలాగే తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకొని, తల్లిదండ్రులకు గౌరవాన్ని తీసుకోరావాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలోఓర్వకల్ మండల జడ్పీటీసీ రంగనాథ్ గౌడ్,ఎంపీపీ తిప్పన్న, గ్రామ సర్పంచ్ ఖాసీం,ఎంపీటీసీ సోమశేకర్ రెడ్డి ,కర్నూలు మార్కెట్ యార్డ్ చైర్మన్ మీదివేముల ప్రభాకర్ రెడ్డి,రాజేంద్రనాథ్ రెడ్డి,అనిల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
Home
Unlabelled
పాఠశాల భవన నిర్మాణానికి.. శంకుస్థాపన
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: