జులై 2022

 కర్నూలుకు హైకోర్టు , కేంద్ర విశ్వవిద్యాలయం

విద్యార్ధి నేతలకు బుగ్గన హామీ

మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసిన జేఏసీ నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్ గడివేముల ప్రతినిధి)

 నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చిన  బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని  ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి ఆధ్వర్యంలో  రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ నేతలు కలిశారు. కర్నూలుకు హైకోర్ట్ , కేంద్ర విశ్వ విద్యాలయం , నంద్యాలలో రాష్ట్ర  న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రికి జేఏసీ నేతలు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ నేతల తో బుగ్గన రాజేంద్రనాధ్  మాట్లాడుతూ  ప్రజల హృదయాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాలను  అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారని, కర్నూలు జిల్లాకు  హైకోర్ట్ , న్యాయ విశ్వవిద్యాలయం రావడానికి ప్రభుత్వం నుండి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ చైర్మన్లు బి. శ్రీరాములు , రామినేని రాజునాయుడు , బందెల ఓబులేసు , రవీంద్రనాధ్ , వెంకట్ , వేణు మాధవ రెడ్డి , ఆర్వీఎఫ్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.


బాలకృష్ణను కలిసిన గౌరు వెంకట్ రెడ్డి దంపతులు
(జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)
బాలకృష్ణను కలసిన మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాణ్యo నియోజకవర్గం ఓర్వకల్లు మండలం పూడి చేర్ల గ్రామం లో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 107 వ సినిమా  షూటింగ్ సందర్భంగా,షూటింగ్ స్పాట్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. మర్యాదపూర్వకంగా సాగిన ఈ భేటీలోమాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జీ గౌరు చరిత రెడ్డి, టీడీపీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఈ కార్యక్రమం లో డోన్ టీడీపీ ఇంచార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కడుపు నొప్పి తట్టుకోలేక...మహిళ ఆత్మహత్య

(జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)

గడివేముల మండల పరిధిలోని దుర్వేసి గ్రామానికి చెందిన ఉప్పరి భారతి వయసు 33 సం,లు కడుపు నొప్పి తో భాద పడుతూ ,భాద తట్టుకో లేక  జీవితం పై విరక్తి చెంది చనిపోవాలనే ఉద్దేశ్యం తో ఇంట్లో వున్న శ్రీ భాగ్య పేడ రంగు త్రాగి 22.07.22 రాత్రి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు నంద్యాల హాస్పిటల్ కు తరలించగా  చికిత్స  పొందుతూ కోలుకొన లేక  చనిపోయిందని విషయం తెలుసుకున్న గడివేముల ఏ ఎస్సై వెంకటేశ్వర్లు  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పాఠశాల భవన నిర్మాణానికి.. శంకుస్థాపన

(జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)

పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, ఓర్వకల్ మండలం కనమడకల గ్రామంలో రెడ్డికొండ రాజేంద్రనాథ్ రెడ్డి  ఉచితంగా ఇచ్చిన ఒక ఎకరా స్థలంలో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పది తరగతి గదులు నిర్మాణమునకు నాడు నేడు ఫేస్-2 నిధులు రూ.1,19,00,995  రూపాయల వ్యయంతో భూమి పూజ కార్యక్రమం చేసారు.


శంకుస్థాపన కార్యక్రమానికి పాణ్యం ఎమ్యెల్యే మరియు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.శంకుస్థాపన అనంతరం ఎమ్యెల్యే  గ్రామంలోని  విద్యార్థులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  విద్యకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి  ఇస్తున్న పథకాలను విద్యార్థినీ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు తెలిపి అందరూ బాగా చదివి మన రాష్ట్రానికి మన జిల్లాకు ,గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని,అలాగే తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించి  కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకొని, తల్లిదండ్రులకు గౌరవాన్ని తీసుకోరావాలని విద్యార్థులకు సూచించారు.


ఈ కార్యక్రమంలోఓర్వకల్ మండల జడ్పీటీసీ రంగనాథ్ గౌడ్,ఎంపీపీ తిప్పన్న, గ్రామ సర్పంచ్ ఖాసీం,ఎంపీటీసీ సోమశేకర్ రెడ్డి ,కర్నూలు మార్కెట్ యార్డ్ చైర్మన్ మీదివేముల ప్రభాకర్ రెడ్డి,రాజేంద్రనాథ్ రెడ్డి,అనిల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అధికారులు  పాల్గొన్నారు.



 పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఎంపిడిఓ విజయసింహారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయం నందు జరిగిన ప్రధానోపాధ్యాయులు ఇంజనీరింగ్ సహాయకులు, విద్యా సంక్షేమ సహాయకులు, ఏఎన్ఎం,లకు ఏర్పాటుచేసిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఎంపిడిఓ విజయసింహారెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు విద్యార్థులకు అందజేయాలని సూచించారు, ప్రతిరోజూ సచివాలయ సిబ్బంది పాఠశాలను తప్పనిసరిగా సందర్శించి  రిథమ్ యాప్ ను పూరించాలని  సూచించారు,


ప్రధానోపాధ్యాయులు నాడు నేడు పనులు వేగవంతం చేయాలని జీవీకే కిట్లను పంపిణీ చేసి బయోమెట్రిక్ తీసుకోవాలని సూచించారు అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకం మరియు విద్యార్థుల హాజరు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో  విజయసింహారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం, ఈవో ఆర్ డి ఖాలీక్ బాషా, ప్రధానోపాధ్యాయులు, అసిస్టెంట్లు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

  క్రికెట్ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం కోల్పోయిన శ్రీలంక


ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంక ఓ ప్రధాన క్రికెట్ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోయింది. శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సిన ఆసియా కప్‌  టోర్నమెంట్‌ను యూఏఈకి తరలించినట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు జరగాల్సిన ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు శ్రీలంక క్రికెట్‌ సొంతం చేసుకుంది.

ఇక ఈసారి ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్ లో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ) నిర్ణయించింది. అయితే, తమ దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ, ఆర్థిక సంక్షోభం దృష్ట్యా టోర్నీని నిర్వహించలేమని లంక బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టోర్నీ యూఏఈలో జరుగుతుందని, ఈ సమయంలో అక్కడ అయితేనే వర్షాలు పడవని గురువారం ముంబైలో జరిగిన బీసీసీఐ అపెక్స్‌ సమావేశానికి హాజరైన గంగూలీ చెప్పారు. మరోవైపు 2022–23లో పూర్తిస్థాయి దేశవాళీ సీజన్‌ జరుగుతుందని స్పష్టం చేశారు. కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఆగిపోయిన దులీప్‌ ట్రోఫీ, ఇరానీ కప్‌ టోర్నీలను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది.

 కేంద్ర మంత్రి తీరుపై నేటిజన్ల విమర్శలు


ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే. అయితేనేమి తాను కూడా సామాన్యుడినే అని నిరూపించారు. తన చర్యతో విమర్శల పాలయ్యారు. కారులో వెళుతూ రోడ్డు పక్కన విక్రయిస్తున్న మొక్కజొన్న పొత్తులను షాపింగ్ చేశారు. కారు దిగి దుకాణాదారు వద్దకు వెళ్లిన మంత్రి..   మూడు పొత్తులను కాల్పించుకుని, ఉప్పు రాయించుకున్నారు.   

ఒక్కోటీ ఎంత? అని అడిగారు. దానికి రూ.15 అంటూ విక్రయదారు నుంచి సమాధానం వచ్చింది. ‘‘మూడు కంకులకు రూ.45 రూపాయలు.. ఇంత అధిక ధరకు విక్రయిస్తావా?’’ అని ప్రశ్నించారు. దానికి దుకాణాదారు స్పందిస్తూ.. ‘‘రూ.15 అన్నది స్టాండర్డ్ ధర. కస్టమర్ కు (కులస్తేకు) కారు ఉందని చెప్పి ధరను పెంచలేదు’’ అని బదులిచ్చాడు. 

మొక్కజొన్న ఇక్కడ ఉచితంగా లభిస్తుందని తెలుసా? అని మంత్రి కులస్తే ప్రశ్నించారు. ఎన్నో ప్రశ్నల తర్వాత ఆ మొత్తం చెల్లించి వచ్చేశారు. ‘‘సియోని నుంచి మండ్లకు వెళుతున్నాను. స్థానిక మొక్కజొన్నను రుచి చూశాను. స్థానిక రైతుల నుంచి, స్థానిక వ్యాపారుల నుంచే అన్ని ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ఇది వారికి ఉపాధి కల్పిస్తుంది’’ అని మంత్రి ట్వీట్ చేశారు. కానీ మొక్క జొన్న కోసం మంత్రి బేరాలాడిన తీరును నెటిజన్లు విమర్శిస్తున్నారు. మంత్రికి పెరిగిన ధరల మంట తెలిసొచ్చిందన్న కామెంట్లు కూడా కనిపించాయి.


 పంచాయితీ కార్యదర్శుల బదిలీలు

ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని పెసర వాయి పంచాయతీ కార్యదర్శి నూరుల్లా నందికొట్కూరు మండలం పరిధిలోని 10 బొల్లవరం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా, గోపాల్ గడివేముల పంచాయతీ కార్యదర్శి నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదెల గ్రామానికి గ్రామ పంచాయతీ కి బదిలీ అయిన సందర్భంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీడీవో విజయసింహారెడ్డి అధ్యక్షతన ఈ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ వీడ్కోలు సమావేశం లో ఈఓఆర్ డీ ఖాలిక్ భాషా, ఏఈ, పీఆర్, ఏదీ, ఆర్డడబ్ల్యూఎస్, అగ్రికల్చర్ అధికారి చిందుకూరు గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణరెడ్డి, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది మండల పరిషత్ సిబ్బంది, చిందుకూరు గ్రామం వాలంటీర్లు పాల్గొన్నారు.




 'ఆకాశ ఎయిర్' లో బుకింగ్స్ ప్రారంభం


స్టాక్ మార్కెట్ దిగ్గజ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా విమానయానం రంగంలోకి అడుగు పెట్టిన సంగతి విదితమే. 'ఆకాశ ఎయిర్' సంస్థలో ఆయన పెట్టుబడులు పెట్టారు. ఆగస్ట్ 7 నుంచి ఆకాశ ఎయిర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ముంబై-అహ్మదాబాద్ రూట్లో తొలి సర్వీస్ ప్రారంభం కానుంది. బోయింగ్ 737 మ్యాక్స్ ప్లేన్ తో తొలి సర్వీసును ఆకాశ ఎయిర్ ప్రారంభించనుంది.    

ఆగస్ట్ 7 నుంచి ప్రారంభమయ్యే ముంబై-అహ్మదాబాద్ రూట్ కి, ఆగస్ట్ 13 నుంచి ప్రారంభమయ్యే బెంగళూరు-కొచ్చి రూట్ కు బుకింగ్స్ ప్రారంభమయ్యాయని ఆకాశ ఎయిర్ ఈరోజు ప్రకటించింది. రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ద్వారా ఆకాశ తన సర్వీసులను ప్రారంభించబోతోంది. ఒక విమానాన్ని బోయింగ్ సంస్థ ఇప్పటికే డెలివరీ చేసింది. మరో విమానాన్ని ఈ నెలాఖరులోగా డెలివరీ చేయనుంది.

ముంబై-అహ్మదాబాద్ సర్వీసుతో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నామని ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ తెలిపారు. బ్రాండ్ న్యూ బోయింగ్ విమానాలతో సర్వీసులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. దశల వారీగా తమ నెట్ వర్క్ ను ఇతర నగరాలకు విస్తరింపజేస్తామని తెలిపారు. తొలి ఏడాదిలో ప్రతి నెల రెండు విమానాల చొప్పున తమ ఫ్లీట్ లో చేర్చుకుంటామని చెప్పారు.

 అమర్ నాథ్ యాత్రలో రికార్డ్ నమోదు


ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రలో మొదటి 22 రోజులకే రికార్డ్ నమోదైంది. 2,94,040 మంది హిమ శివలింగాన్ని దర్శించుకున్నారు. గతేడాది 60 రోజుల యాత్ర పొడవునా దర్శించుకున్న వారి సంఖ్య 2.85 లక్షల కంటే ఇది ఎక్కువ. అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది 46 రోజుల పాటు సాగనుంది. ఈ ఏడాది మొత్తం మీద దర్శించుకునేవారి సంఖ్య, ఇటీవలి సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుందని అమర్ నాథ్ ష్రైన్ బోర్డ్ ప్రకటించింది. 

ఈ ఏడాది 26 రోజుల పాటు సాగే యాత్ర ఆగస్ట్ 15తో ముగియనుంది. 2015లో 3,52,771 మంది, 2016లో 3,20,490 మంది అమర్ నాథ్ గుహను దర్శించుకున్నారు. 2017లో అమర్ నాథ్ గుహను సందర్శించిన వారి సంఖ్య 2,60,003గా ఉంది. ఈ ఏడాది యాత్ర ముగిసే నాటికి సందర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా ఉండనుందని తెలుస్తోంది. 4,700 మందితో కూడిన తాజా బృందం భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి అమర్ నాథ్ గుహ దిశగా ప్రయాణమై వెళ్లింది.

 సర్పంచ్ ఫిర్యాదుతో...ఫోర్జరీ సంతకంపై విచారణ 

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నా సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ  స్పందన కార్యక్రమంలో గడివేముల సర్పంచ్ రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదుపైఅధికారులు అధికార్లు స్పందించారు. చెక్ ఫోర్జరీ సంతకాలు గురించి నంద్యాల జిల్లా డిఎల్ పీఓ రాంబాబు స్థానిక గడివేముల గ్రామ పంచాయతీ భవనంలో విచారణ చేపట్టారు. సర్పంచ్ రమణమ్మ, పంచాయతీ కార్యదర్శి తారకేస్వరిని విచారణ జరిపి వారి వద్ద నుండి తీసుకున్న సమాచారాన్ని జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేస్తానని డిఎల్ పీఓ రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయసింహారెడ్డి, ఈవోఆర్ డీ ఖాలిక్ భాషా పాల్గొన్నారు.




 

 శాస్త్రి మరణం విషయంలో సంచలన విషయాలు బహిర్గతం


భారత మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణం విషయంలో సంచలన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆయనది సహజ మరణం కాదని, అగ్రరాజ్యం అమెరికానే పథకం ప్రకారం చేసిన హత్య అని వెల్లడైంది. శాస్త్రితో పాటు భారత అణుశాస్త్ర పితామహుడు హోమి జహంగీర్ భాభాను కూడా అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ హత్య చేసింది. ఈ విషయాలను సీఐఏ  మాజీ అధికారి రాబర్ట్ క్రౌలీ తన పుస్తకంలో వెల్లడించారు. శాస్త్రి, భాభా మరణించినప్పుడు క్రౌలీ సీఐఏ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వర్తించారు.

శాస్త్రి, భాభా నేతృత్వంలో అణ్వాయుధ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్న భారత్‌.. తమ శత్రు దేశం రష్యాతో అంటకాగడం అమెరికాకు ఎప్పటికైనా ముప్పేనని గ్రహించి.. వారి హత్యకు సీఐఏ కుట్ర పన్నిందని తన పుస్తకంలో వివరించారు. భారతీయులు ఎంతో తెలివైనవారని, వాళ్లు  ప్రపంచంలో గొప్ప శక్తిగా ఎదగడాన్ని తాము కోరుకోలేదని చెప్పారు. 

1966 జనవరి 11న పాకిస్థాన్ అధ్యక్షుడు మహమ్మద్‌ అయూబ్‌ ఖాన్‌తో కలిసి ఉజ్బెకిస్థాన్‌ రాజధానిలో తాష్కెంట్‌ ఒప్పందంపై శాస్త్రి సంతకం చేశారు. అదే రోజు అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో మరణించడం వెనక సీఐఏ హస్తం ఉందని క్రౌలీ పేర్కొన్నారు. 

ఇక హోమీ భాభా ఎయిర్ ఇండియా విమానంలో వియన్నా వెళ్తుండగా హతమార్చినట్టు క్రౌలీ తెలిపారు. చాలా కష్టపడి ఆ విమానంలోకి పేలుడు పదార్థాలు పంపామన్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని తొలుత వియన్నా గగనతలంలో పేల్చేద్దామనుకున్నామని చెప్పారు. అయితే, అలా జరిగితే, ప్రాణనష్టం ఎక్కువ అవుతుందని భావించి పర్వత ప్రాంతాన్ని ఎంచుకున్నామని తెలిపారు. విస్పోటనం తర్వాత విమానం ముక్కలుముక్కలు కావడానికి కూడా అనుకూలంగా వుండేలా ఎత్తయిన పర్వత ప్రాంతాన్ని ఎంచుకుని, అక్కడే కూలిపోయేలా చేశామని తెలిపారు.

ఇంట్లో లేకపోయినా.. పెట్స్ కు ఆహారం


పెంపుడు జంతువులు ఏం చేస్తున్నాయో రోజంతా ట్రాక్ చేసేందుకు వీలుగా స్మార్ట్ వాచ్ ను బెంగళూరు పీఈఎస్ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు రూపొందించారు. ఈ వాచ్ ను పెట్స్ మెడలో బెల్ట్ కు పెడితే చాలని, వాటి నిర్వహణ ఎంతో సులువు అవుతుందని ఆవిష్కర్తలు చెబుతున్నారు. 

పల్లవి, ప్రార్థన, విస్మయ తాము రూపొందించిన ఈ వాచ్ కు ‘ఫాండ్’ అని పేరు పెట్టారు. త్వరలోనే ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, వెబ్ సైట్ ద్వారా కొనుగోలుకు అవకాశం కల్పించాలన్నది వీరి ప్రణాళిక. ఈ ఫాండ్ వాచ్ తో పెట్స్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఉండొచ్చని, దీనివల్ల వాటి జీవితకాలం పెరుగుతుందని.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న ఈ ముగ్గురు చెబుతున్నారు. 

అంతేకాదు, వీరు పెట్స్ కోసం మరో ఉత్పత్తిని కూడా త్వరలోనే తీసుకురాబోతున్నారు. ఆటోమేటిక్ డ్రై ఫుడ్ డిస్పెన్సర్ ను అభివృద్ధి చేస్తున్నారు. దీని సాయంతో యజమానులు ఇంట్లో లేకపోయినా, ఉన్న చోట నుంచే ఇంట్లోని పెట్స్ కు ఆహారాన్ని అందించడం సాధ్యపడుతుందని చెప్పారు. 


మాత్రలు మింగి...అశ్వస్తతకు గురైన మహిళ

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

బట్టలు ఉతికే విషయంలో మొదలైన వివాదం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. తనపై జరిగిన దాడిని అవమానంగా భావించిన ఓ మహిళ తన ఇంట్లో ఉన్న వివిధ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అస్వస్థతకు గురైన మహిళను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాలలోకి వెళ్లితే...నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల గ్రామంలో చాకలి శివలక్ష్మి  (27 సం,,లు) ఈ నెల 19వ తేదీ ఉదయం 10.00 గంటల సమయంలో తన భర్తతో పాటు గడిగరేవుల గ్రామంలోని గంగమ్మ గుడి వెనక కొత్త కాలువ వద్ద బట్టలు ఉతికి ఆరేస్తూ వుండగా అదే గ్రామానికి చెందిన చాకలి సుంకన్న,చాకలి శీను ,చాకలి సుదీల్,చాకలి సుబ్బలచ్చమ్మ అని నలుగురు వ్యక్తులు వచ్చి మేము బట్టలు ఆరేసే స్థలంలో నువ్వు బట్టలు ఆరేస్తావా అని శివలక్ష్మిని నానా దుర్భాషలాడుతూ కింద పడేసి కాలుతో చేతులతో కొట్టి మీ అంత చూస్తామని బెదిరించగ శివలక్ష్మి బాధతో ఇంట్లో ఉన్న నిద్ర మాత్రలు మింగి  అస్వస్థతకు గురికారంతో నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు, విషయం తెలుసుకున్న గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 గజ్జల పాపమ్మ ఆలయ అధ్యక్షులుగా బాక్సర్ రాజు

(జానో జాగో వెబ్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి)

 ఆషాఢ మాసం  శ్రీ మహంకాళి బోనాల పండగను పురస్కరించుకొని కబూతర్ ఖాన, చిన్నబజారు శ్రీ గజ్జల పానమ్మ దేవాలయం నూతన అధ్యక్షులుగా మాచెర్ల రాజా: (బాక్సర్) నియమితులైయ్యారు. పురానాపూల్ డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజ్ మోహన్ అధ్యక్షతన జరిగిన ఆలయ కమిటీ సమావేశంలో బాక్సర్ రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కబూతర్ ఖానాలో శనివారం జరిగే ఉత్సవాలకు కార్పొరేటర్ నున్నం రాజ్ మోహన్, బసతి ప్రజల సహకారంతో బోనాల పండగను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు మహంకాళి కృష్ణా యాదవ్, పుప్పాల నర్సింగ్హా రావు, మాజీ చైర్మన్ అభిషేక్ రాజ్ సక్సేనా, విశాల్, శ్రీనివాస్ గౌడ్, నునిల్ కాళీ దాసు బాబి తదితరులు పాల్గొన్నారు.

 ఆ కారణం చేత...నేపియ‌ర్ బ్రిడ్జి అలా మారిపోయింది


కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు మన ఊరూ, వీధుల  రూపురేఖలనే మార్చేస్తుంది. తాజాగా చైన్నై పట్టణంలో అలాంటిదే మనకు దర్శనమిస్తోంది. త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో నేపియ‌ర్ బ్రిడ్జి ఓ ల్యాండ్ మార్క్ కిందే లెక్క‌. మొన్న‌టిదాకా మామూలు బ్రిడ్జిగానే ఉన్న ఇది శ‌నివారం నాటికి చెస్ బోర్డుగా మారిపోయింది. బ్రిడ్జి ఉప‌రిత‌లంతో పాటు బ్రిడ్జికి ఉన్న రెయిలింగ్ గోడ‌లు కూడా చెస్ బోర్డు మాదిరిగా మారిపోయాయి. బ్రిడ్జి మొత్తం చెస్ బోర్డులోని తెలుపు, న‌లుపు గ‌ళ్ల‌తో నిండిపోయింది. రాత్రికి రాత్రే ఇలా మారిపోయిన ఈ బ్రిడ్జి ఇప్పుడు చెన్నైవాసుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అయినా ఈ బ్రిడ్జి ఇలా చెస్ గ‌ళ్లతో నిండిపోవ‌డానికి ఓ కార‌ణం ఉంది. త‌మిళ‌నాడులోని మామ‌ళ్లాపురంలో ఈ నెల 28 నుంచి 44వ ఫైడ్ చెస్ ఒలింపియాడ్ మొద‌లు కానుంది. అంత‌ర్జాతీయ చెస్ స‌మాఖ్య (ఫైడ్‌) ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నున్న ఈ చెస్ ఒలింపియాడ్‌కు గుర్తింపుగా నేపియ‌ర్ బ్రిడ్జి ఇలా చెస్ గ‌ళ్ల‌తో నిండిపోయింది.

 వచ్చే ఐపిఎల్ ప్రసారం...ఎఫ్ టీపీలో చూడొచ్చు


వచ్చే ఐపీఎల్ మ్యాచ్ కు రెండు ప్రాధాన్యతలు ఉండబోతున్నాయి. ఒకటి ప్రసారంలో మరోటి ఆట కాల పరిమితి విషయంలో ఈ ప్రాధాన్యతలు చోటుచేసుకోనున్నాయి. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ ను సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు జరపడం ద్వారా టోర్నీని మరింత జనరంజకం చేసేందుకు బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా సానుకూలంగా స్పందించింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రతిపాదించిన మేరకు వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ ను రెండున్నర నెలల పాటు నిర్వహించేందుకు ప్రాథమికంగా అంగీకారం తెలిపింది. ఈ మేరకు రెండున్నర నెలల ఐపీఎల్ కు తన ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్ టీపీ)లో స్థానం కల్పించింది. 

2023 నుంచి 2027 వరకు వివిధ దేశాల క్రికెట్ జట్ల పర్యటనలు, ఆయా లీగ్ ల నిర్వహణను నిర్ధారించి తాజా ఎఫ్ టీపీ రూపొందించారు. దీని ప్రకారం మార్చి చివరి వారం నుంచి జూన్ మొదటివారం వరకు ఐపీఎల్ కోసం కేటాయించారు. అటు, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాలు నిర్వహించే టీ20 లీగ్ ల కోసం కూడా నూతన ఎఫ్ టీపీలో స్థానం కల్పించారు. జులై-ఆగస్టు నెలల్లో ఇంగ్లండ్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్ లేవీ ఆడడంలేదు. ఆ సమయంలో ఇంగ్లండ్ లో హండ్రెడ్ పేరిట టీ20 లీగ్ నిర్వహించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ బిగ్ బాష్ లీగ్ కోసం జనవరిలో విండో కేటాయించాలని ఐసీసీని కోరింది. దీనిపైనా ఐసీసీ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

 సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల  ప్రతినిధి)

నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్  కార్యాలయంలో  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సీఎం సహాయనిధి పథకంలో భాగంగా  నియోజకవర్గంలోని 14 మంది లబ్ధిదారులకు రూ. 7,5 7,000 లు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు లబ్ధిదారులు తదితరులుఎమ్మెల్యే పాల్గొన్నారు.

 ఉచిత విద్య..వైద్యం అందించడం నేరమా: మోడీపై భగ్గుమన్న కేజ్రీవాల్


ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడం కూడా నేరమా అని ప్రధాని నరేంద్ర మోడీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఓట్ల కోసం ఉచిత హామీలు ఇస్తున్నారని, ప్రజలను తాయిలాలతో మభ్యపెడుతున్నారని, ఇది ప్రమాదకరమైన సంస్కృతి అంటూ ఇతర పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేయడం తెలిసిందే. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. విద్యార్థులకు ఉచిత విద్య, ప్రజలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించడం తాయిలాలు ఇవ్వడం కాదని స్పష్టం చేశారు. 

"నన్ను ఉద్దేశించి ఈ ఆరోపణలు చేశారని నాకు తెలుసు. కానీ నేను చేసిన తప్పేంటి అని అడుగుతున్నాను. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి మేం నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నాం. విద్యార్థులకు ఎలాంటి ఖర్చులేని, మంచి విద్యను అందించడం నేరమా?" అని ప్రశ్నించారు. "ఇదంతా 1947, 1950లోనే చేయాల్సింది. మేం ఇప్పుడు దేశ భవిష్యత్తుకు పునాది వేస్తున్నాం. ఇది ఉచితంగా తాయిలాలు ఇస్తున్నట్టుకాదు" అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో...జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌ విజయం ఖాయం


ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌ విజయం ఖాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్ చేశారు. ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ అభ్య‌ర్థిగా ఎంపికైన ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌కు అమిత్ షా ముందస్తు అభినంద‌న‌లు తెలిపారు. శ‌ని‌వారం సాయంత్రం సుదీర్ఘంగా జ‌రిగిన బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీలో ప‌లువురు నేత‌ల పేర్ల‌ను ప‌రిశీలించిన మీద‌ట జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌ను ఎన్డీఏ ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా బీజేపీ ఎంపిక చేసిన విషయం విదితమే. 

ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డినంత‌నే అమిత్ షా ఇంటికి జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ వెళ్లారు. ధ‌న్‌క‌ర్‌ను సాద‌రంగా ఆహ్వానించిన అమిత్ షా... ఆయ‌న‌తో భేటీ అయ్యారు. అనంత‌రం ధ‌న్‌క‌ర్ విజయం ఖాయ‌మేనంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా అమిత్ షా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఉప‌రాష్ట్రప‌తిగా ధ‌న్‌క‌ర్ ఎన్నిక‌తో పార్ల‌మెంటులో ఎగువ స‌భ ఔన్న‌త్యం మ‌రింత పెరుగుతుంద‌ని తెలిపారు. ఫ‌లితంగా దేశానికి మేలు జ‌రుగుతుంద‌ని కూడా అమిత్ షా పేర్కొన్నారు.

 గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ


రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల గవర్నర్లతో భేటీ అయ్యారు. శ‌నివారం ఒక్క‌రోజే ఏకంగా న‌లుగురు గ‌వ‌ర్నర్లు ప్ర‌ధాని మోదీతో భేటీ అయ్యారు. వీరిలో ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ ధ‌న్ క‌ర్‌, మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్ గ‌ణేశ‌న్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ మంగూభాయి ప‌టేల్‌, హిమాచల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర విశ్వ‌నాథ్ ఆర్లేక‌ర్‌లు ఉన్నారు. 

శ‌నివారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జలాన్‌కు వెళ్లిన మోదీ... అక్క‌డ కొత్తగా నిర్మించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ముగించుకుని ఢిల్లీ వ‌చ్చిన మోదీ...వ‌రుస‌బెట్టి గ‌వ‌ర్న‌ర్ల‌తో భేటీ అయ్యారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌కు రంగం సిద్ధమైన వేళ ఇలా గ‌వ‌ర్న‌ర్లు మోదీతో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

 సరైన సమయానికి విధులకు హాజరు

ఎంపీడీవో విజయసింహారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కొర్రపోలురు గ్రామం నందు సచివాలయం సందర్శించి  సిబ్బంది మరియు వాలంటీర్ ల తో సమావేసం నిర్వహించడం జరిగింది. సిబ్బంది అందరు సమయానికి విధులకు హాజరు కావాలని, ఓటీఎస్ రిజిస్ట్రేషన్ లు స్కానింగ్, ఈ సైన్ లు ఎప్పటికి అప్పుడు క్లియర్ చెయ్యాలనీ, వర్షాలు అధికంగా ఉన్నవి కాబట్టి ఎక్కడ నీళ్లు నిలువ లేకుండా చూడాలి అని కోరడమైనది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఈవోఆర్డీ పంచాయతి సెక్రటరీ, సిబ్బంది పాల్గొన్నారు. మరియు గ్రామ సచివాలయం భవన నిర్మాణానికి మార్కింగ్ వేయడమైనది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాలిక్ బాషా, ఏఈ పీఆర్కే.భాస్కర్, ఇంజినీర్ అసిస్టెంట్ పాల్గొన్నారు.



 

అలా చేయడం అంబేద్కర్ ను అవమానించడమే


అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం  పేరు మార్చడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విదేశీ విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారమే అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ తన పేరు చేర్చడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరును తొలగించడం ఆయనను అవమానించడమే అన్నారు. ఇది జగన్ అహంకారమే అంటూ ధ్వజమెత్తారు. అంతేకాదు అంబేద్కర్ ను దైవంగా భావించే వారందరినీ కూడా అవమానించినట్టేనని.. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేద్కర్ పేరును చేర్చమని ప్రభుత్వాన్ని టీడీపీ డిమాండ్ చేస్తోంది అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో "అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం" కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించామని గుర్తు చేశారు.

అలాగే "ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ" పథకం కింద బీసీ, మైనారిటీ విధ్యార్థులకైతే రూ.15 లక్షలు.. ఈబీసీ, కాపు విద్యార్థులైతే రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారన్నారు. ఈ రకంగా ఐదేళ్ల తెలుగుదేశం హయాంలో మొత్తం 4528 మంది విద్యార్థుల విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించామన్నారు. మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. ఇప్పుడు "అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం"  పేరు నుంచి అంబేద్కర్ పేరును తొలగించింది అన్నారు.

గతంలో ఉన్న ఏపీ అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకాన్ని.. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంగా ఏపీ ప్రభుత్వం మార్చింది. గత ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో చదువుకునే ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఇప్పుడు ఆ పథకానికి కొన్ని మార్పులు చేసింది.. ఇటీవలే మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే.

క్యూఎస్‌ ర్యాంకు 200లోపున్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన పేద విద్యార్థులకే ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పథకానికి రూ.6 లక్షల వరకు ఆదాయ పరిమితి ఉండగా.. దీన్ని రూ.8 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. గత ప్రభుత్వంలో ఈ పథకానికి ఉన్న అంబేద్కర్ పేరు తొలగించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా చంద్రబాబు కూడా పథకం పేరు మార్పు వ్యవహారంపై స్పందించారు.

 ఒక్కరు ఓడినా రాజకీయాల నుంచి తప్పుకొంటా


మా ఎమ్మెల్యేలు ఒక్కరు ఓడిపోయినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సవాల్ విసిరారు. ఇదిలావుంటే రెబెల్ శివసేన ఎమ్మెల్యేలకు దమ్ముంటే ఎన్నికలకు సిద్ధపడాలని, వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే సవాల్ విసిరారు. దీనిపై సీఎం ఏక్ నాథ్ షిండే బదులిచ్చారు. ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేలు ఒక్కరు ఓడిపోయినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని దీటుగా బదులిచ్చారు. "రెబెల్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా గెలవరని అంటున్నారు... కానీ వారిలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఓడిపోరని నేనంటున్నాను... ఒకవేళ ఓడిపోతే అందుకు నేనే బాధ్యత తీసుకుంటాను. అయినా, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో చెప్పడానికి మీరెవరు? గెలుపోటముల నిర్ణేతలు ప్రజలే. ఎవరు గెలవాలో, ఎవరు ఓడిపోవాలో వారు నిర్దేశిస్తారు" అని బదులిచ్చారు.

 తెలంగాణ శాసనసభలో...ఏపీ ఎమ్మెల్యే ఓటు


వైసీపీ నేత‌, ప్ర‌కాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి పొరుగు రాష్ట్ర శాస‌న స‌భ‌లో ఓటు వేయ‌నున్నారు. సోమ‌వారం తాను తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఉండాల్సి ఉంద‌ని, ఈ క్ర‌మంలో తెలంగాణ అసెంబ్లీలోనే ఓటు వేస్తాన‌ని ఈసీని కోరారు. ఇందుకు ఆయ‌న చెప్పిన కార‌ణం స‌హేతుక‌మైన‌దేన‌ని భావించిన ఈసీ... తెలంగాణ అసెంబ్లీలో ఓటు వేసేందుకు మ‌హీధ‌ర్ రెడ్డిని అనుమ‌తించింది.

ఇదిలావుంటే భార‌త రాష్ట్రప‌తి ఎన్నికల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్‌కు శ‌నివారం నాటికే ఏర్పాట్ల‌న్నీ పూర్తయ్యాయి. ఈ నెల 18న‌ (సోమ‌వారం) పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఢిల్లీలోని పార్ల‌మెంటుతో పాటు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ప్రాంగ‌ణాల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఎంపీలు ఢిల్లీలో ఓటు వేయాల్సి ఉండ‌గా ఆయా రాష్ట్రాల‌కు చెందిన ఎమ్మెల్యేలు త‌మ రాష్ట్రాల అసెంబ్లీల్లోనే ఓటు వేయాల్సి ఉంది.

అయితే ఏదేనీ ప్ర‌త్యేక కార‌ణాల వ‌ల్ల ఒక రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే అటు ఢిల్లీలో గానీ, లేదంటే త‌న‌కు అందుబాటులో ఉండే రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో గానీ ఓటు వేసేందుకు కూడా అనుమ‌తి ఉంది. అయితే ఈ మేర‌కు ఆయా స‌భ్యులు ముందుగానే కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నుంచి అనుమ‌తి పొందాల్సి ఉంటుంది. లేదంటే ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ వేరే చోట ఓటు వేసేందుకు అనుమ‌తి లేదు.

 తప్పు చేశాం అని నిరూపిస్తే ...

గడివేముల జడ్.పి.టి.సి. పదవికి రాజీనామా

 ఆర్.బి.చంద్ర శేఖర్ రెడ్డి సవాల్

 (జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)

మండల కేంద్రమైన గడివేములలో  నిర్వహించిన విలేకరుల సమావేశంలో జడ్పిటిసి ఆర్. బి  చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల క్రితం సోమవారం నాడు స్పందన కార్యక్రమం లో కలెక్టర్ గారికి గడివేముల గ్రామ సర్పంచ్ రవణమ్మ ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా ఖండించమన్నారు. ఈ ఫిర్యాదు పూర్తి తప్పుడు ఫిర్యాదు అని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా జడ్పిటిసి ఆర్.బి. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పూర్తి అసత్య ఆరోపణలు తప్ప వారు ఇచ్చిన ఫిర్యాదులో ఎటువంటి నిజం లేదని,గ్రామ సర్పంచ్ సంతకం చేసి నేను చేయలేదని కలెక్టర్ దగ్గరికి వెళ్లి చెప్పడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని , ఈ ఫిర్యాదు నిజం అని తేలితే నా జడ్పటిసి పదవికి రాజీనామా చేస్తానని, తప్పుడు ఫిర్యాదు అని తేలితే మీరు మీ సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.


ఈ ఫిర్యాదులో పూర్తిస్థాయి విచారణ జరిగాలని ,చెక్కును ఫోరెన్సిక్ లాబ్లో టెస్ట్ చేయించి నిజాలు నెగ్గు తేల్చాలని, గ్రామ సర్పంచ్ సంతకం పెట్టకపోతే మరికొన్ని రోజులు వేచి చూసి అధికారులకు ఫిర్యాదు చేసి  బిల్లులు పాస్ చేయించుకునేవారము అని దొంగ సంతకాలు చేసి ఫోర్జరీ చేయాల్సినంత కర్మ మాకు లేదు. నంద్యాల జిల్లా ఉన్నతాధికారులు ఈ ఫిర్యాదు పై పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అవసరమైతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఇటువంటి తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన గ్రామ సర్పంచ్ రమణమ్మ పై విచారణ జరిపి ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్.బి. చంద్ర శేఖర్ రెడ్డి కోరారు. భవిష్యత్తులో ఇలాంటివి ప్రణావృతం కాకుండా నంద్యాలజిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

గతంలో కూడా రైతు భరోసా కేంద్రానికి సంబంధించి బిల్లులకు సంబంధించి సర్పంచ్ రవణమ్మ సంతకం పెట్టకుండా నెల రోజులపాటు ఇబ్బందికి గురి చేసిన సంగతి అందరికీ తెలుసు అన్నారు. ఇప్పుడు ఈ 32 లక్షల 52వేల 770 రూపాయలు బిల్లు చెక్కుపై సర్పంచ్ స్వహస్తాలతో సంతకం చేసి అది నా  సంతకం కాదు అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కావున వీరిపై సంతకం చేసి ఫోర్జరీ అని తప్పుడు ఫిర్యాదు చేసినందున జిల్లా కలెక్టర్ ని కలిసి కఠిన చర్యలు తీసుకోవాలని మండల నాయకులంతా కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు ఆర్బి మల్లారెడ్డి మాట్లాడుతూ ఖర్చు పెట్టిన మూడు సంవత్సరాల తర్వాత మా బిల్లులు మేము తీసుకుంటే ఏదో వారి సొమ్మును ఫోర్జరీ చేసి తీసుకుంటున్నట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మూడు సంవత్సరాల నుండి ఖర్చు పెట్టిన వాటికి బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఇప్పుడు బిల్లులు చేతికి వస్తే ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనంతరం సింగిల్ విండో చైర్మన్ బిలకల గూడూరు వైసీపీ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సంతకం పెట్టి పెట్టలేదు అని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు తీవ్రంగా పరిగణించాలని పరీక్షించి నిజా నిజాలను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.  అనంతరం గడివేముల గ్రామ ఉపసర్పంచ్ బాల చెన్ని మాట్లాడుతూ ఈ ఫిర్యాదు నిజమని తేలితే నా ఉపసర్పంచ్ పదవికి మరియు నా భార్య ఎంపీటీసీ పదవులకు రాజీనామా చేస్తామని ఫిర్యాదు తప్పు అని తేలితే మీరు సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు.  ఈ కార్యక్రమంలో ఎం.పి.టి.సి. వంగాల మహేస్వేస్వర రెడ్డి, మంచాలకట్ట అనీల్ కుమార్ రెడ్డి, గని ప్రతాప్ రెడ్డి, తండా కాలు నాయక్, ఒందుట్ల రవి రెడ్డి, పెసరవాయి ఎల్లా రెడ్డి, గడిగరేవుల సర్పంచ్, ఎం.పి.టి.సి, దుర్వేసి బి.రమేష్ మరియు వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు

 గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ఎంపీడీవో విజయసింహారెడ్డి

 (జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామున్  గ్రామాలలో వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో గ్రామాలలో ఆరోగ్యం మరియు పరిశుభ్రత పై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని, స్పందనలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పూర్తి చేయాలని, గ్రామాలలోని సచివాలయాల భవనాలుత్వరగా పూర్తి చేయాలని ఆదేశించిన కారణంగా ,గడివేముల మండల పరిషత్ కార్యలయంలో ఎంపీడీవో విజయసింహారెడ్డి పంచాయతి కార్యదర్శులతో సమావేశము నిర్వహించడమైనది. ఈ సమావేశంలో ఎంపిడిఓ విజయసింహ రెడ్డి మాట్లాడుతూ


ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తుండడంతో గ్రామాలలో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని, మీ గ్రామ సర్పంచ్ ల సహకాంతో గ్రామము లో ఎక్కాడ నీరు నిల్వ లేకుండా చూడాలనీ, రోడ్లు అన్నీ శుభ్రంగా ఉంచాలనీ, గ్రామాల లోనీ ప్రజలు అందరు తగు జాగ్రత్తలు పాటించాలనీ, ఏమైనా జ్వరాలు,విరేచనాలు మరియు వాంతులు వుంటే వెంటనే ANM ల సహకారం తో తగు వైద్యము తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలనీ, కావున ఈ కార్యక్రమం పై ప్రతి గ్రామము లో ఇళ్లలో శుభ్రత పాటించాలని దండోరా వేయించాలనీ మరియు  . స్పందన లో వచ్చిన పిర్యాదులు పెండింగ్ లో లేకుండా చూడాలి అని ఎంపిడిఓ విజయ సింహారెడ్డి గారు ఆదేశించారు .

 గని , పిన్నాపురం గ్రామాలను నంద్యాల జిల్లాలోనే కలపాలి

 విద్యార్ధి , యువజన , వామపక్ష సంఘాల నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)

గడివేముల మండలం గని , పాణ్యం మండలం పిన్నాపురం గ్రామాలను ఓర్వకల్లు మండలంలో కలపాలనే ప్రతిపాధనను విరమించుకోవాలని , ఈ  రెండు గ్రామాలు ఆయా మండలాలలోనే కొనసాగుతూ నంద్యాల జిల్లాలోనే ఉంచాలని, ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ కి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఏ.ఐ.ఎఫ్.బి) , ఎస్.ఎఫ్.ఐ ,  ఆర్.ఎస్.ఏ , ఏ.ఐ.వై.ఎల్ , డీబీఎస్ఎఫ్ , ఏపీ స్టూడెంట్స్ జేఏసీ నేతలు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఏ.ఐ.ఎఫ్.బి) రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజునాయుడు , రాయలసీమ స్టూడెంట్స్ అసోషియేషన్ (ఆర్.ఎస్.ఏ) రాష్ట్ర అధ్యక్షుడు బందెల ఓబులేసు , ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి నిరంజన్ , విద్యార్ధి , యువజన నేతలు పూల వెంకట్ , లక్ష్మణ్ , పాపసాని వేణుమాధవ రెడ్డి , డీసీ.నాగన్న లు మాట్లాడుతూ గడివేముల , పాణ్యం మండలాలు నంద్యాలతో అనేక సంవత్సరాల నుండి వ్యాపారం , ఉద్యోగాలు , వాణిజ్యం అనేక వర్తకాలతో ముడిపడి ఉందనీ , నూతన జిల్లాల ఏర్పాటులో పాణ్యం , గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలోనే కలపాలనీ కోరుతూ రెండు మండలాల ప్రజానీకం విద్యార్ధి , యువజన సంఘాల నేతలతో కలిసి సుమారు మూడు నెలల సుధీర్ఘ పోరాటం , నిరసనలు , వినతులు ఇస్తే , స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు మండలాలను నంద్యాల జిల్లాలోనే కలిపారన్నారు.


మరలా నేడు గని , పిన్నాపురం గ్రామాలను ఓర్వకల్లు మండలంలో కలపాలనే ప్రతిపాధన తెరమీదకు రావడం భాధాకరమన్నారు. ఇప్పటికైనా రెండు గ్రామాలలోని ప్రజా ప్రతినిధులు , సర్పంచులు స్పందించి ప్రజా ప్రయోజనార్ధం ఓర్వకల్లుకు వ్యతిరేఖంగా రద్దు తీర్మానాన్ని చేయాలన్నారు. లేదంటే ప్రజలతో ప్రతి రోజూ పోరుబాట సాగిస్తామన్నారు. స్పందించిన జిల్లా కలెక్టర్  మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ ఈ విషయం మా దృష్ఠికి రాలేదనీ , ఇప్పటికై పలుమార్లు ఈ రెండు గ్రామాల ప్రజలు వినతి పత్రాలు అందజేశారనీ , దీనిపై పూర్తి స్ధాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

 భారత జవాన్ కు ద‌లైలామా  సెల్యూట్...కరాచలనం


బౌద్ధ మ‌త గురువు ద‌లైలామా త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బ‌యలుదేరుతూ త‌న‌కు వీడ్కోలు ప‌లికేందుకు నిలుచున్న భార‌త సైనికుడొక‌రికి సెల్యూట్ చేశారు. అంతేకాకుండా త‌న‌కు సెల్యూట్ చేస్తూ నిలుచున్న ఆ భార‌త సైనికుడిని త‌న వ‌ద్ద‌కు ర‌మ్మ‌ని పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ద‌లైలామా పిలుపుతో ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లిన భార‌త సైనికుడు ఆయ‌న చేతిని ముద్దాడి... దలైలామాపై త‌న‌కున్న గౌర‌వాన్ని చాటుకున్నారు.

బౌద్ధ గురువు ద‌లైలామా గొప్ప‌త‌నంతో పాటు భార‌త సైన్యం విశిష్ట‌త‌ను చాటి చెప్పేలా సోమ‌వారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 18 సెక‌న్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


 తెలంగాణ‌లో ఈ సెట్ ప‌రీక్ష వాయిదా


భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో జనజీవనాన్ని స్థంభింపజేస్తోంది.  గ‌డ‌చిన రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా తెలంగాణ‌లో ఈ సెట్ ప‌రీక్ష వాయిదా ప‌డింది. ఈ నెల 13 (బుధ‌వారం)న జ‌ర‌గాల్సిన ఈ సెట్ ప‌రీక్షను వ‌ర్షాల కార‌ణంగా వాయిదా వేస్తున్న‌ట్లు రాష్ట్ర ఉన్న‌త విద్యా మండలి చైర్మ‌న్ లింబాద్రి సోమ‌వారం ప్ర‌క‌టించారు. అయితే ఈ నెల 14 నుంచి జ‌ర‌గ‌నున్న ఎంసెట్ య‌థాత‌థంగా కొన‌సాగుతుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.  రాష్ట్రంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా విద్యా సంస్థ‌ల‌కు ఈ నెల 13 వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 13న జ‌ర‌గాల్సిన ఈ సెట్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ఉన్న‌త విద్యా మండ‌లి తెలిపింది. ఈ ప‌రీక్ష‌ను తిరిగి ఎప్పుడు నిర్వ‌హిస్తామ‌న్న విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని మండ‌లి అధికారులు తెలిపారు.

 మునిసిప‌ల్ కార్మికుల‌తో ప్రభుత్వ చర్చలు విఫలం

చర్చలు విఫలం కావడంతో సమ్మెపై ముందుకే వెళ్లాలని ఏపీ మున్సిపల్ కార్మికులు నిర్ణయం తీసుకొన్నారు. సీఎం ఆదేశాల‌తో వెనువెంట‌నే రంగంలోకి దిగిన మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఆదిమూల‌పు సురేశ్‌, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, సీఎం స‌మీర్ శ‌ర్మల‌తో కూడిన హైప‌వ‌ర్ క‌మిటీ కార్మిక సంఘం నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. దాదాపుగా రెండు గంట‌ల‌కు పైగా జ‌రిగిన ఈ చ‌ర్చ‌లు ఓ కొలిక్కి రాలేదు. వెర‌సి హైప‌వ‌ర్ క‌మిటీతో చ‌ర్చ‌లు విఫ‌ల‌మైన‌ట్లుగా కార్మిక సంఘాల నేత‌లు ప్ర‌క‌టించారు. త‌మ స‌మ్మెను కొన‌సాగించ‌నున్న‌ట్లు వారు ప్ర‌క‌టించారు.

రూ.3 వేల హెల్త్ అల‌వెన్స్ ఇవ్వ‌డం స‌హా మొత్తం 9 డిమాండ్ల‌తో ఏపీలోని అన్ని మునిసిపాలిటీల్లోని 35 మందికి పైగా కార్మికులు సోమ‌వారం నుంచి స‌మ్మెకు దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌క్ష‌ణ‌మే కార్మికులు స‌మ్మె విర‌మించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేసిన సీఎం కార్మికులతో చ‌ర్చ‌ల కోసం ముగ్గురు మంత్రులు, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితో ఓ హైప‌వ‌ర్ క‌మిటీని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.

 గుజరాత్ సీఎంకు అమిత్ షా  ఫోన్...వర్షాలపై ఆరా

గుజరాత్ రాష్ట్రంలో కురిస్తున్న భారీ వర్షాల కారణంగా నెలకొన్న వరదలపై ఆ రాష్ట్రం  సీఎంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో గ‌డ‌చిన రెండు రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో వ‌ర‌ద‌లు పోటెత్తాయి. చాలా ప్రాంతాల్లో ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు కూడా జారీ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లోనూ వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. వ‌ర‌దల తాకిడికి ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలో 50 మంది దాకా గ‌ల్లంతు అయిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇలాంటి నేప‌థ్యంలో అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి భూపేంద్ర ప‌టేల్‌కు ఫోన్ చేశారు. గుజ‌రాత్‌లోని వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై ఆరా తీశారు. వ‌ర‌ద‌ల నేపథ్యంలో ప్ర‌జ‌లు ఇబ్బందులకు గురి కాకుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు. గుజ‌రాత్‌కు కేంద్ర ప్ర‌భుత్వం అండ‌గా ఉంద‌ని సీఎంకు అమిత్ షా భ‌రోసా ఇచ్చారు.

 రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్‌ మృతి


ప్ర‌పంచంలోని పులి జాతుల్లోకెల్లా రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్‌కు ఉన్న గుర్తింపు ప్ర‌త్యేక‌మైన‌ది. అలాంటి జాతిలోనే అతి పెద్ద వ‌య‌సు క‌లిగిన పులుల్లో ఒక‌టిగా గుర్తింపు ద‌క్కిన రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్ రాజా సోమ‌వారం మృతి చెందింది. ప‌శ్చిమ బెంగాల్‌లోని జ‌ల్దాపారాలోని రెస్క్యూ సెంట‌ర్‌లో రాజా మృతి చెందిన‌ట్టుగా అధికారులు ప్ర‌క‌టించారు. దేశంలో అతి పెద్ద వ‌య‌సున్న పులిగా ధ్రువీక‌రించిన అధికారులు రాజా మృత‌దేహంపై పుష్ప‌గుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 25 ఏళ్ల వ‌య‌సులో రాజా మృతి చెందింద‌ని ఈ సంద‌ర్భంగా అధికారులు వెల్ల‌డించారు.

 హైదరాబాద్ కు వస్తున్న స‌ఫ్రాన్...

వెల్ కం అంటూ స్వాగతిస్తున్న కేటీఆర్


తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దినదినం పురోగతి సాధిస్తోంది. తాజాగా ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న ఏరో ఇంజిన్ రిపేర్ సంస్థ స‌ఫ్రాన్ తెలంగాణ‌లోకి అడుగుపెట్ట‌బోతోంది. మరోవైపు హైద‌రాబాద్‌లో ఎంఆర్ఓ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసిన స‌ఫ్రాన్‌కు కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు.  తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఆ సంస్థ విమానాల మెయింటెనెన్స్ అండ్ రిపేర్ (ఎంఆర్ఓ) యూనిట్‌ను నెల‌కొల్ప‌నుంది. హైదరాబాద్‌లో నెల‌కొల్ప‌నున్న ఎంఆర్ఓ యూనిట్ ఆ సంస్థ అన్ని యూనిట్ల‌లోకి అతి పెద్ద‌దిగా నిల‌వ‌నుంది. హైద‌రాబాద్ యూనిట్ కోసం ఆ కంపెనీ తొలి విడ‌త‌గా 150 మిలియ‌న్ డాల‌ర్ల‌ను పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది.

మరోవైపు హైద‌రాబాద్‌లో ఎంఆర్ఓ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసిన స‌ఫ్రాన్‌కు కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. ఏరో ఇంజిన్ రిపేర్ రంగంలో భారత్‌లో ఇప్ప‌టిదాకా ఏ విదేశీ కంపెనీ త‌న యూనిట్‌ను ఏర్పాటు చేయ‌లేద‌న్న కేటీఆర్‌...హైద‌రాబాద్‌లో సఫ్రాన్ ఏర్పాటు చేయ‌నున్న యూనిట్ భార‌త్‌లో తొలి విదేశీ కంపెనీ యూనిట్‌గా రికార్డుల‌కు ఎక్క‌నుంద‌ని తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 800 నుంచి 1,000 మంది యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాకుండా ఈ యూనిట్ ద్వారా ఏరోస్పేస్ రంగంలో హైద‌రాబాద్‌కు మ‌రిన్ని పెట్టుబ‌డులు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని ఆయ‌న తెలిపారు.

 ఓల్డ్ సిటీ గవర్నమెంట్ ఐటిఐలో...అడ్మిషన్లు ప్రారంభం 

కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రేణుక 


(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ గవర్నమెంట్ ఐటిఐ కాలేజీలో ప్లంబర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, డ్రాఫ్ట్ మెన్ సివిల్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రిషన్, టర్నర్, మిషినిస్ట్, మోటార్ మెకానిక్ వెహికల్, కటింగ్ అండ్ సివింగ్ టెక్నాలజీలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.రేణుకా తెలిపారు. కళాశాలలో ప్రవేశాల కోరకు ఆన్లైన్ వెబ్సైట్ లో దరఖాస్తూ చేసుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. విద్యా అర్హతలు 10వ తరగతి, 8వ తరగతి పాసైన విద్యార్థులు ఐటిఐ గవర్నమెంట్ విద్యాసంస్థల్లో చేరడానికి అర్హులని తెలిపారు. ఈనెల 6వ తేదీ నుంచి 31వ తేదీలోపు దరఖాస్తులకు  అవకాశముందని ఆమె వెల్లడించారు. https://iti.telangana.govt.in ద్వారా ఆసక్తికలిగినవున్న వారు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఏదైనా సమాచారం కోసం .040-24461815 నెంబర్స్ కు సంప్రదించవచ్చని ప్రిన్సిపల్ ఎస్.రేణుక సూచించారు.