పొలం నీటి విషయంలో ఘర్షణ ..కేసు నమోదు


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా,గడివేముల మండల పరిధిలోని ఒండుట్ల  గ్రామానికి చెందిన కర్రెల దేవరాజు   (42), భార్య లక్ష్మీదేవి తో పాటు తన పొలం నందు నీళ్లు పెట్టుకుంటుండగా అదే గ్రామానికి చెందిన సుధాకర్ ,ఆదిలక్ష్మమ్మ, రామన్న  అను వారు వచ్చి నా కొడకా మమ్మల్ని అడగకుండా నీళ్లు ఎట్లా పెట్టుకుంటారు రా అని  కర్రేల సుధాకర్ ను, భార్య ఆదిలక్ష్మమ్మ ను కింద పడేసి  కాళ్ళ తో చేతులతో కొట్టి,  భార్య ఆదిలక్ష్మమ్మ ను ఇష్టం వచ్చినట్లు  తిట్టి, ఇంకొకసారి  నీళ్లు పెట్టుకుంటే నీ అంతు చూస్తాము  అని బెదిరించి వెళ్ళిపోయారని సుధాకర్ ఫిర్యాదు చేయగా దీనిపై గడివేముల ఎస్పై బీ.టీ. వెంకటసుబ్బయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: