14వ ఎడిషన్‌ హైదరాబాద్‌ జ్యువెలరీ పెరల్‌ అండ్‌ జెమ్‌ ఫెయిర్‌ (హెచ్‌జెఎఫ్‌)లో...

 ప్రదర్శించనున్న 50వేలకు పైగా వినూత్న డిజైన్స్‌, కలెక్షన్స్‌

(జానో జాగో వెబ్ న్యూస్ -బిజినెస్ బ్యూరో)

ఆభరణాలపై దృష్టి కేంద్రీకరించిన అతిపెద్ద కార్యక్రమం హైదరాబాద్‌ జ్యువెలరీ, పెరల్‌ అండ్‌ జెమ్‌ ఫెయిర్‌ (హెచ్‌జెఎఫ్‌ 2022) మరోమారు ముత్యాల నగరికి తిరిగిరావడమే కాదు ఈ క్యాలెండర్‌ సంవత్సరంలో మహోన్నత కార్యక్రమాలలో ఒకటిగా నిలుస్తుందనే భరోసానూ అందిస్తుంది. హైటెక్‌ సిటీ వద్ద నున్న హెచ్‌ఐసీసీలో జూన్‌ 10–12, 2022 వరకూ జరిగే హెచ్‌జీఎఫ్‌ 2022లో 250 మందికి పైగా ఎగ్జిబిటర్లు 650కు పైగా ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్లను, 50వేలకు పైగా నూతన డిజైన్లను ప్రదర్శించనున్నారు. తమ వీక్షకుల హృదయాలను కొల్లగొట్టేరీతిలో హెచ్‌జీఎఫ్‌ 2022 ఇప్పుడు అత్యున్నత ఆభరణాలు మరియు ప్రీమియర్‌ కళాకారుల కలెక్షన్‌ను ఒకే దరికి తీసుకురావడంతో పాటుగా ఎగుమతి–దిగుమతి వ్యాపారులు, అగ్రశ్రేణి ఆభరణాల వర్తకులనూ తీసుకురానుంది. ఈ ప్రతిష్టాత్మక షోను  భారతదేశంలో సుప్రసిద్ధ బీ2బీ ఎగ్జిబిషన్‌ల నిర్వాహక సంస్థ ఇన్‌ఫార్మా మార్కెట్స్‌  నిర్వహిస్తోంది. దీనికి హైటెక్‌ సిటీ జ్యువెలరీ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌జెఎంఏ), తెలంగాణా బులియన్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ ఫౌండేషన్‌ (టీబీజీజెఎఫ్‌), ఆల్‌ ఇండియా జ్యువెలర్స్‌ అండ్‌ గోల్డ్‌స్మిల్‌ ఫెడరేషన్‌ (ఏఐజెజీఎఫ్‌), ద బులియన్‌ అండ్‌ జ్యువెలరీ అసోసియేషన్‌ (టీబీజెఏ), జెమ్‌ అండ్‌ జ్యువెలరీ ట్రేడ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (జీజెటీసీఐ) మద్దతునందిస్తున్నాయి.

అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న హైదరాబాద్‌ జ్యువెలరీ, పెరల్‌ అండ్‌ జెమ్‌ ఫెయిర్‌ 2022 గురించి ఇన్‌ఫార్మా మార్కెట్స్‌ ఇన్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ యోగేష్‌ ముద్రాస్‌ మాట్లాడుతూ ‘‘ముడి వజ్రాలకు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద కటింగ్‌, పాలిషింగ్‌ కేంద్రం ఇండియా. ప్రపంచంలో 15 వజ్రాలు ప్రాసెస్‌ చేస్తే వాటిలో 14 ఇండియాలోనే చేస్తుంటారు. భారతీయ జెమ్స్‌, జ్యువెలరీ మార్కెట్‌ వృద్ధి చెందేందుకు అపారఅవకాశాలు ఉన్నాయి. ఈ ప్రదర్శన ద్వారా స్థానిక వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలను సంప్రదాయేతర రంగాలైన జెమ్‌స్టోన్స్‌ , టెంపుల్‌, విక్టోరియన్‌ జ్యువెలరీ వైపు చూడాల్సిందిగా ప్రోత్సహిస్తున్నాము. భారతీయ జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ మార్కెట్‌ 2027 ఆర్ధిక సంవత్సరానికి 9 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా’’ అని అన్నారు.

హైటెక్‌ సిటీ జ్యువెలరీ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌జెఎంఏ) అధ్యక్షుడు, అన్‌మోల్‌ జ్యువెలర్స్‌ ప్రొప్రైయిటర్‌ మహేందర్‌ కుమార్‌ తయాల్‌  మాట్లాడుతూ ‘‘దక్షిణ భారత ఆభరణాల వర్తకుల నడుమ హెచ్‌జెఎఫ్‌ అత్యంత ప్రాచుర్యం పొందింది. హెచ్‌జెఎఫ్‌ 2022కు మేము పూర్తిగా మద్దతునందిస్తున్నాము. ఈ ప్రదర్శనలో  అగ్రశ్రేణి ఆభరణాల వర్తకులు పాల్గొంటున్నారు’’ అని అన్నారు.

ఈ ఎగ్జిబిషన్‌లో ఆభరణాల ప్రదర్శనలతో పాటుగా పలు అంశాలపై సదస్సులు, అవగాహన కార్యక్రమాలు కూడా జరుగనున్నాయి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: