ఎట్టకేలకు ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి బెయిల్


గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి 2017 నాటి ఓ కేసులో బెయిల్ లభించింది. అయితే, కోర్టు అనుమతి లేనిదే గుజరాత్ ను వీడరాదని న్యాయస్థానం షరతు విధించింది. మేవానీతో పాటు మరో 10 మందికి కూడా ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మేవానీ సహా వారందరూ తమ పాస్ పోర్టులను కోర్టులో అప్పగించాల్సిందిగా ఆదేశించింది. 

2017లో పోలీసుల అనుమతి లేకుండా ఓ ర్యాలీ నిర్వహించారన్న ఆరోపణలతో మేవానీ తదితరులపై కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్ పిటిషన్లపై కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఇదిలావుంటే కోర్టు తమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం పట్ల జిగ్నేష్ మేవానీ స్పందించారు. కోర్టు నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. అయితే కేంద్రం తనను ఇబ్బంది పెట్టేందుకు ఏ అవకాశాన్నీ వదలడంలేదన్న విషయం మరోసారి స్పష్టమైందని వ్యాఖ్యానించారు. 

తాను ఓ నాయకుడ్నని, దేశవ్యాప్తంగా ప్రజలు తనను స్వాగతిస్తున్నారని తెలిపారు. ఇటీవలే కేరళలో ఓ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం చేశానని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తనకు ఆదరణ పెరుగుతుండడం పట్ల బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. అందుకే తనను వేధించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోందని అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: