దక్షిణ మరియు ఆగ్నేయాసియాలోనే...

అతిపెద్ద డాటా సైన్స్‌ ఫ్యాకల్టీగా నిలిచిన అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌


(జానో జాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

“ భారతదేశంలో అగ్రగామి డాటా సైన్స్‌ ఇనిస్టిట్యూట్‌ కావడంతో పాటుగా ఎడ్‌టెక్‌ అగ్రగామి అప్‌గ్రాడ్‌కు 100% అనుబంధ సంస్ధ అయిన అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌ (ఠఞఎట్చఛీ ఐూఖిౖఊఉ) ఇప్పుడు ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఎడ్‌టెక్‌ సంస్ధగా డాటా సైన్స్‌ మరియు ఏఐ డిపార్ట్‌మెంట్‌లలో పూర్తిగా అంకితం చేయబడిన ఫ్యాకల్టీతో నిలిచింది.

పూర్తిగా అంకితం చేయబడిన 40కు పైగా మెషీన్‌ లెర్నింగ్‌ సైంటిస్ట్‌లతో పాటుగా 80కు పైగా ఫ్యాకల్టీ సభ్యులను సంస్థ కలిగి ఉంది. డాటా సైన్స్‌, ఆర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌ మరియు మెషీన్‌ లెర్నింగ్‌ విభాగాలలో అపారమైన అనుభవం వీరికి ఉంది.

‘‘ఈ అత్యాధునిక సాంకేతికతలలో శిక్షణను అందించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థాయి విశ్వవిద్యాలయాల నుంచి పీహెచ్‌డీలతో పాటుగా దశాబ్దాల  అంతర్జాతీయ పరిశ్రమ, ఆర్‌ అండ్‌ డీ అనుభవం, అంకిత భావం కలిగిన అధ్యాపకులను పెద్ద సంఖ్యలో కలిగి ఉండటం అవసరం. శక్తివంతమైన అంతర్గత నైపుణ్యంతో పాటుగా, పరిశ్రమ, అకాడెమియా, ఆర్‌ అండ్‌  డీ, వ్యవస్ధాపకత మరియు ఉత్పత్తి పరిజ్ఞానాన్ని మా కరిక్యులమ్‌, బోధనా  విధానంలో జోడించడానికి, అభ్యాసకులకు పూర్తి అంకితభావంతో మద్దతునందించడానికి ఇది మాకు సహాయపడుతుంది’’ అని అప్‌గ్రాడ్‌ ఇన్సోఫీ అధ్యక్షుడు డాక్టర్‌ వెంకటష్‌ సుంకడ్‌ అన్నారు.

‘‘నేడు అందుబాటులో ఉన్న చాలా సాంకేతికతలు సంప్రదాయ పాఠ్యపుస్తకాలలో  భాగం కాదు. అందువల్ల, బల్క్‌ డాటాను విశ్లేషించడానికి మరియు వ్యాపార నిర్ణయాలను ప్రభావితం చేయడానికి అప్లయ్డ్‌ సైన్స్‌ను ఉపయోగించడానికి శిక్షణ పొందిన నిపుణుల అంతరం వేగంగా పెరుగుతుంది. అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌ స్థిరంగా తమ ఫ్యాకల్టీని  డాటా సైన్స్‌, ఏఐ, ఎంఎల్‌ విభాగాలలో విస్తరిస్తోంది. వీరు అభ్యాసకులకు అత్యంత క్లిష్టమైన కోడింగ్‌, డాటా ఛాలెంజస్‌లో ప్రాక్టికల్‌ అప్లికేషన్‌ల ద్వారా సహాయపడుతున్నారు’’ అని డాక్టర్‌ దక్షిణామూర్తి వి కొల్లూరు, కో–ఫౌండర్‌ అండ్‌ సీఈవో– అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌ అన్నారు.

‘‘అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌ ద్వారా మేము విస్తృత స్ధాయిలో మా అభ్యాసకులకు స్పెషలైజేషన్స్‌ను తీసుకురావడంతో పాటుగా వారి డొమైన్‌ ఫౌండేషన్‌ బలోపేతం చేసుకోవడంలో సహాయపడుతున్నాము. ఏఐ, ఎంఎల్‌, డాటా సైన్స్‌లో ఇంజినీరింగ్‌ నైపుణ్యాలకు సంబంధించిన నేపథ్యాలను నేవిగేట్‌ చేయడంలో  నిపుణులకు సహాయం చేయడానికి నాణ్యమైన ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ బోధనా విధానాన్ని మెరుగుపరిచే విద్యావేత్తలతో  త్వరలోనే మేము అంతర్జాతీయంగా అగ్రగామి కాగలము’’అని  అప్‌గ్రాడ్‌ కో–ఫౌండర్‌ అండ్‌ ఎండీ మయాంక్‌ కుమార్‌ అన్నారు.

రోడ్డు మీద  తుపాకీతో  ఓ పోలీస్ వీరంగం చేస్తే అది ఏదో తమాషా పని అనుకొన్నారు అక్కడి జనాలు. కానీ ఆ తుపాకి నుంచి వచ్చి తూట ప్రాణాలు తీయగా భయందోళనకు గురయ్యారు. కోల్ కతాలో ఓ పోలీసు విచ్చలవిడిగా కాల్పులు జరిపి, ఆపై తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయానికి సమీపంలోని పార్క్ సర్కస్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆర్మ్ డ్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చోదప్ లేప్చా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 

మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తుపాకీతో విచక్షణరహితంగా 10 నుంచి 15 రౌండ్లు కాల్పులు జరిపాడు. వీటిలో ఓ బుల్లెట్ దారినపోతున్న మహిళ వెన్నెముకను ఛిద్రం చేస్తూ దూసుకెళ్లింది. ఆ మహిళ బుల్లెట్ గాయంతో ప్రాణం విడిచింది. అనంతరం గడ్డం కింద తుపాకీ పెట్టుకుని ఆ కానిస్టేబుల్ తనను తాను కాల్చుకున్నాడని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. 

చోదప్ లేప్చా ఇటీవల సెలవుపై వెళ్లి శుక్రవారమే తిరిగి విధుల్లో చేరాడు. తుపాకీ చేతబట్టి ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చిన అతను పెద్దగా కేకలు వేస్తూ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడిన ఓ వ్యక్తికి ఇక్కడి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ కానిస్టేబుల్ తుపాకీతో రోడ్డు మీదికి రాగా, అతడేదో బొమ్మ తుపాకీతో తమాషా చేస్తున్నాడని స్థానికులు భావించారు. 

అయితే ఆ తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్లు ఓ కారును తాకగా, ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నాడు. నిజమైన కాల్పులే అని అర్థంకాగా, అక్కడి వాళ్లు హడలిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. చోదప్ లేప్చా ఫస్ట్ బెటాలియన్ కు చెందిన ఆర్మ్ డ్ కానిస్టేబుల్ అని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: