తనిఖీలు చేస్తుండగా ఎదురుపడ్డారు..కాల్సుల్లో ఉగ్రవాది హతం


ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా తనిఖీలు చేపట్టిన భద్రతా  సిబ్బందికి కొందరు ఎదురుపడ్డారు. ఎదురుకాల్పలు జరిపారు. ప్రతీకగా భద్రతా దళాలు  జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించాడు. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ద్రబ్గామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. టెర్రరిస్టులకు సంబంధించిన సమాచారం అందడంతో భద్రతా బలగాలు అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులు కనబడడంతో కాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది చనిపోయాడని కశ్మీర్ జోన్ పోలీసులు విజయ్ కుమార్ ఐజీపీ వెల్లడించారు.

ఇదిలావుంటే ఇంతకు ముందు కుల్గామ్ జిల్లాలో ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్‌ఎం) ఉగ్రవాది షౌచ్ కుల్గామ్ నివాసి రసిక్ అహ్మద్ గనీ హతమయ్యాడని పోలీసు ప్రతినిధి తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని ఖండిపోరా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారం ఆధారంగా భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.

ఆ సమయంలో దాగి ఉన్న ఉగ్రవాదులు బలగాలపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని పోలీసులు చెప్పారు. అయితే ఎన్‌కౌంటర్ జరిగే స్థలంలో చిక్కుకున్న పౌరులను బలగాలు సురక్షిత ప్రదేశాలకు తరలించారని తెలిపారు. అలాగే శ్రీనగర్ బారాముల్లా హైవే రహదారిపై ఉగ్రవాదులు భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. బారాముల్లా-శ్రీనగర్ జాతీయ రహదారిపై అమర్చిన ఐఈడీని బలగాలను నిర్వీర్యం చేశాయి. బలగాలే లక్ష్యంగా ఐఈడీని అమర్చినట్లు తెలుస్తుంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: