హిందూ, ముస్లిం అనేది పెద్ద విషయమే కాదు

ఓ అథ్లెట్ గా తాను భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తానని, తన వరకు హిందూ, ముస్లిం అనేది పెద్ద విషయమే కాదని అభిప్రాయపడింది. "నా దేశానికి ఓ పతకం సాధించడం పట్ల ఎంతో సంతోషిస్తాను" అని ప్రపంచ మహిళా బాక్సింగ్ విజేత నిఖత్ జరీన్ వెల్లడించింది.  ఫ్లయ్ వెయిట్ విభాగంలో ప్రపంచ విజేతగా నిలిచిన  నిఖత్ జరీన్ (25) తాను కేవలం ఓ వర్గానికి ప్రాతినిధ్యం వహించడంలేదని, తాను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని స్పష్టం చేసింది. తాను బాక్సింగ్ లో సాధించిన ఘనతల కంటే, తన మత నేపథ్యం గురించే ప్రజలు ఎక్కువగా చర్చించుకుంటున్నారన్న ప్రశ్నకు ఆమె పైవిధంగా జవాబిచ్చింది. 

ఇదిలావుంటే  నిఖత్ వచ్చే నెలలో బ్రిటన్ లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ కు సన్నద్ధమవుతోంది. ఢిల్లీలో నిర్వహించిన ట్రయల్స్ లో నిఖత్ విజయం సాధించి కామన్వెల్త్ క్రీడలకు అర్హత పొందింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: