ఆర్మీ అధికార్లదే తప్పు...నాగాలాండ్ ఫైరింగ్ పై తేల్చేసిన సిట్


గతేడాది డిసెంబర్ 4న నాగాలాండ్‌లో టెర్రరిస్టులు చొరబడినట్టు సమాచారం అందుకున్న ఆర్మీకి చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ యూనిట్, 21 పారా స్పెషల్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అదే సమయంలో మయన్మార్ సరిహద్దులో ఉన్న మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామానికి చెందిన కొందరు బొగ్గు గనుల్లో పనిచేసి పికప్ వ్యాన్‌లో ఇళ్లకు తిరిగి వస్తున్నారు. వారిని చూసిన భద్రతా బలగాలు ఉగ్రవాదులుగా భావించి వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 13 మంది చనిపోయారు. దీనిపై అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి.

గతేడాది జరిగిన ఈ  దారుణ ఘటనలో పోలీసులే తప్పు చేసినట్టు సిట్ తేల్చింది. సిట్ తాజాగా ఆ కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో ఓ ఆర్మీ అధికారి, 29 మంది సైనికుల పేర్లను చేర్చారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నవారు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసిజర్స్, ఎంగేజ్‌మెంట్ నియమాలు పాటించలేదని సిట్ ఆరోపించింది.

ఈ ఘటనపై విచారణ కోసం నాగాలాండ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. దానిపై దర్యాప్తు చేసిన సిట్ అధికారులు సైనికులు రూల్స్ పాటించలేదని చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు చార్జ్‌షీట్‌లో పేర్కొన్న సైనికులపై చర్యలు తీసుకునేందుకు నాగాలాండ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ కోరింది. ఈ మేరకు సంబంధిత సైనికులపై చర్యలు తీసుకోవడానికి అనుమతిని కోరుతూ రక్షణ మంత్రిత్వ శాఖకు రాష్ట్ర పోలీసులు లేఖ కూడా రాశారు. అయితే 13 మంది చనిపోవడంతో అప్పట్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అమల్లో ఉన్న సాయుధ దళాల (ప్రత్యేక) అధికారాల చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: