డిప్యూటీ స్పీకర్ ను నిలదీసిన వితంతు మహిళా


గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో భాగంగా బాపట్ల‌లో ప‌ర్య‌టించిన డిప్యూటీ స్పీకర్ కోన ర‌ఘుప‌తిని శివ‌లీల అనే వితంతువు నిల‌దీసింది. త‌న‌కు అందుతున్న వితంతు పింఛ‌న్ నిలిచిపోయింద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న కుమారుడికి కారు ఉందంటూ అధికారులు త‌న వితంతు పింఛ‌న్ నిలిపేశార‌ని ఆరోపించింది.

ఏపీలో అధికార పార్టీ వైసీపీ నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్యక్ర‌మంలో భాగంగా బాప‌ట్ల ఎమ్మెల్యేగా ఉన్న ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తికి శుక్ర‌వారం ఇలా వినూత్న నిర‌స‌న ఎదురైంది. 

అయితే త‌న కుమారుడికి కారు లేద‌ని స్వ‌యంగా ర‌వాణా శాఖ నుంచి స‌ర్టిఫికెట్ ఇచ్చినా త‌న పింఛ‌న్‌ను పున‌రుద్ధ‌రించ‌లేద‌ని శివ‌లీల వాపోయింది. ఈ సంద‌ర్భంగా ఆమె ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీకి ఓటేసినందుకు త‌మ‌కు శాస్తి జ‌రిగింద‌ని చెప్పిన శివ‌లీల‌... కోన ర‌ఘుప‌తి ఎదుటే లెంప‌లేసుకుని మ‌రీ నిర‌స‌న తెలిపింది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: