తీసుకొంది ఇస్తావా...చస్తావా...కాల్ మనీ గ్యాంగ్ వీరంగం


మొన్నటి వరకు ఆంధ్రా ప్రాంతంలోనే కాల్ మనీ గ్యాంగ్ పేరు విన్న మనం ఇపుడు మహానగరం హైదరాబాద్ పరిధిలో కూడా విన్నాల్సి వస్తోంది. హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్ మనీ గ్యాంగ్ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. మైనర్లను టార్గెట్‌గా చేసుకుని వారికి డబ్బులు ఇచ్చి అధిక వడ్డీ పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. ఓ ప్రభుత్వ అధికారి కొడుకు కార్తీక్, అతని టీం కలిసి ఒక ముఠాగా ఏర్పడి అమాయకులైన మైనర్లను టార్గెట్‌గా అవసరానికి అప్పులు ఇచ్చి ప్రాంసరీ నోటుపై మైనర్లతో సంతకం చేయించుకొని దానికి చక్రవడ్డీ వేసి డబ్బులు వసూలు చేస్తున్నాడు. డబ్బులు కట్టకపోతే ఇస్తావా చస్తావా అంటూ బెదిరింపు లకు పాల్పడుతున్నారు. ఈ కాల్ మనీ ముఠా వలలో ఓ విద్యార్థి చిక్కుకొని తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: