నాకు ఆ కేసుతో సంబంధంలేదు: హోమంత్రి తనయుడి వెల్లడి


హైద‌రాబాద్‌లోని ఆమ్నేషియా ప‌బ్‌లో చోటుచేసుకున్న గ్యాంగ్ రేప్‌లో కీల‌క నిందితుడు తెలంగాణ హోం శాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీ మ‌న‌వ‌డు పుర్ఖాన్ అని వినిపిస్తున్న వార్త‌ల‌పై ఆయ‌న తాజాగా స్పందించారు. త‌న‌కు ఆ గ్యాంగ్ రేప్‌తో ఎలాంటి సంబంధం లేద‌ని శుక్ర‌వారం రాత్రి ఆయ‌న ప్ర‌క‌టించారు. 

గ్యాంగ్ రేప్ జ‌రిగిన‌ట్లుగా భావిస్తున్న రోజున తాను మినిస్ట‌ర్ క్వార్ట‌ర్స్‌లో ఉన్నాన‌ని పుర్ఖాన్ తెలిపారు. తాను ఆ రోజు ఎవ‌రికీ పార్టీ ఇవ్వ‌లేద‌ని కూడా ఆయ‌న తెలిపారు. పార్టీలో పాల్గొన్న వారు, గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డ్డ వారు ఎవ‌రో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు. త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన వారు నిజాలు తెలుసుకుని మాట్లాడాల‌ని సూచించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: