జూ వెలుపల...టెక్సాస్ లో కలకలం


అమెరికాలోని టెక్సాస్ లో ఓ జూలో గత నెల 21న కెమెరాలో రికార్డయిన ఈ వింత జీవిని చూసి జూ సిబ్బంది ఆశ్చర్యపోయారు.  ఓ జూ వెలుపల వింత ఆకారం కలకలం రేపింది. ఇక్కడి అమారిల్లో జంతు ప్రదర్శనశాల వద్ద ఏర్పాటు చేసిన ఓ సీసీటీవీ కెమెరాలో ఈ వింత ఆకారం దృశ్యాలు రికార్డయ్యాయి. దీనిపై జూ అధికారులు దర్యాప్తు కూడా చేపట్టారు. రెండు కాళ్లతో ఉన్న ఈ ఆకారం తల జంతువును పోలి ఉంది. 

దీని ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, భిన్న స్పందనలు వచ్చాయి. మనిషే జంతువు వేషం వేసుకుని వచ్చి ఉంటాడని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు ఇది వింత జీవి అయ్యుంటుందేమోనని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే ఈ విచిత్ర జీవిని గుర్తించడంలో సాయపడాలంటూ అధికారులు స్థానిక ప్రజలను కోరుతున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: