ఆకస్మిక తనిఖీ నిర్వహించిన.... 

నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య నారపురెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండల పరిధిలోని స్థానిక మండల రెవెన్య కార్యాలయం, సచివాలయ కార్యాలయాలను  నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్యనారపురెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.వివరాల్లోకి వెళితే గడివేముల మండలం మండల రెవెన్యూ కార్యాలయాన్ని తనిఖీ చేసి సిబ్బంది సరైన సమయానికి వస్తున్నారా లేదా అని ప్రజలు ఇబ్బందులతో వచ్చే వారికి  సరైన సేవలు అందిస్తున్న రా లేదా అని ఆరా తీశారు. అనంతరం స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఏరువాక పండుగ సందర్భంగా చెట్లు నాటి పర్యావరణాన్ని ని పెంపొందించుకోవడం వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆమె తెలిపారు.


అనంతరం సచివాలయ కార్యాలయాన్ని సందర్శించి సచివాలయ సిబ్బంది  రికార్డులు పరిశీలించి గ్రామ పంచాయతీ అధికారి  తారకేశ్వరి ని వాలంటీర్లు సరిగా రావడం లేదని అడుగగా గ్రామ పంచాయతీ అధికారి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో సరిగా పనిచేయని వాలంటీర్ల పై చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ అధికారి తారకేశ్వరి ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి, మండల రెవెన్యూ అధికారి నాగమణి, ఈవో ఆర్ డి ఖాలిక్ భాష, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: