పట్టుదల ఉంటే సాధించలలేనిది ఏదీ లేదు

నిరూపించిన స్మరన్ రాజ్


(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది ఉండదని సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 676వ ర్యాంకు సాధించిన బచ్చు స్మరణ్ రాజ్ నిరూపించారని దక్షిణమధ్యరైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఆనంద్, సిఎస్ ఐఏఎస్ అకాడమి అధిక్షేత్ర బాలంత పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాలరావు అధ్వర్యంలో గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సెర్విన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి అతిధులుగా ఆతం బాలంత హాంపై సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 676వ ర్యాంకు సాధించిన బచ్చు స్మరన్బీను ఘనంగా సత్కరించి అభినందించారు.


ఇదే కార్యక్రమంలో సెట్విన్ శిక్షణ పొందాలనే నిరుపేదలకు సహాయం అందిస్తున్న స్వచ్ఛకర్మ ఫౌండేషన్ ప్రతినిధి కార్తీక్ సూర్య, విజయ ఫౌండేషన్ ప్రతినిధి కమల్ కుమార్లను కూడా సత్కరించారు. తనకు వచ్చిన సమస్యను కూడా అధిగమించి 'సివిల్స్ సర్వీసెస్ లో అత్తుత్తమ ర్యాంకును స్మరన్ రాజ్ సాధించి అందరికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రతి ఒక్కరు స్వర న్ రాజ్ స్పూర్తితో యువతీయువకులు ముందుకు సాగాలని అన్నారు. స్మరన్ రాజ్ మాట్లాడుతూ సిఎస్ అకాడమి అధినేత్రి బాలంత తనకు మెంటరీగా రాష్ట్రంట్ రావడానికి ఎంతో తోడ్పాటును అందించారన్నారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం తనకు ఎంతో లభించిందని అన్నారు. స్మరన్ రాజ్ తల్లితండ్రులు రమేశ్, నాగరాణి, 'సిట్వీన్ ఎకౌంట్స్ ఆఫీసర్ సురేశిబాబు, సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: