ఏకంగా రూ.8 కోట్లు కాజేశారు


దళారి వ్యవస్థను మనం ప్రోత్సహించినంతకాలం మోసగాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇలాంటి ఘటన తాజాగా తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. తెలంగాణ‌లో ప్ర‌భుత్వ గొర్రెల పంపిణీ ప‌థ‌కాన్ని ఆస‌రా చేసుకుని ఓ ముఠా జ‌నానికి భారీ కుచ్చుటోపీ పెట్టింది. ప్రభుత్వం గొర్రెల పంపిణీ ప‌థ‌కం కింద సబ్సిడీకే గొర్రెల‌ను ఇప్పిస్తామంటూ స‌జ్జ శ్రీనివాస‌రావు, ల‌క్ష్మీ, కొల్లి అర‌వింద్‌లు జ‌నం నుంచి ఏకంగా రూ.8 కోట్లు వ‌సూలు చేశారు. రాష్ట్రంలోని నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, యాదాద్రి జిల్లాల్లో వీరు మోసానికి పాల్ప‌డ్డారు. వీరి మోసంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వీరు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఇదిలావుంటే ప్ర‌భుత్వ గొర్రెల పంపిణీ ప‌థ‌కం కింద గొర్రెలు కొనుగోలు చేసిన వారికి ప్ర‌భుత్వం నుంచి సబ్సిడీ ల‌భిస్తున్న సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ ప్రారంభించిన ఈ ప‌థ‌కానికి బాగానే ఆద‌ర‌ణ ల‌భించింది. అదే స‌మ‌యంలో ఈ ప‌థ‌కం ఆధారంగా జ‌నాన్ని భారీ ఎత్తున మోసం చేసిన ఘ‌ట‌న‌లు కూడా న‌మోద‌య్యాయి. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: