చైనా, భారత్‌ పైనే శ్రీలంక ఆశలు... రుణం పొందే దిశగా  యోచన

తన దేశంలోని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంకలోని కొత్త ప్రభుత్వం చైనా, భారత్‌ నుంచి రుణాలు పొందాలని భావిస్తోంది. కానీ శ్రీలంక లో కొత్తగా ప్రధాని వచ్చిన పూర్తిస్థాయి క్యాబినెట్ ఇంకా రాలేదు. పూర్తి కేబినెట్ లేకుండా రుణం పొందే ప్రక్రియను ఎలా చేపడతారనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది.

గతవారం రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు చేపట్టగా.. ప్రభుత్వ మద్దతుదారులు వారిపై దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల అనంతరం మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. ఐఎంఎఫ్‌తో బెయిలవుట్ చర్చల కోసం కొత్త ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిని ఇంకా నియమించలేదు.

ఇదిలా ఉంటే వచ్చే కొద్ది నెలల సమయం మన జీవితంలో అత్యంత కఠినమైందని శ్రీలంక ప్ధాని విక్రమసింఘే తెలిపారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం నూతన జాతీయ అసెంబ్లీ లేదా అన్ని రాజకీయ పక్షాల భాగస్వామ్యంతో పొలిటికల్ బాడీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

అధ్యక్షుడు గొటబయ రాజపక్ష ప్రవేశపెట్టిన డెవలప్‌మెంట్ బడ్జెట్ స్థానంలో రిలీఫ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ప్రీమియర్ హామీ ఇచ్చారు. గొటబయ బడ్జెట్ కారణంగానే శ్రీలంక ద్రవ్యోల్బణ రేటు వేగంగా పెరిగింది. ఈ ఏడాది చివరి నాటికి బడ్జెట్‌ లోటు జీడీపీలో 13 శాతం ఉండొచ్చని విక్రమసింఘే అంచనా వేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: