నాటుసారా తయారీ కేంద్రాలు ధ్వంసం

నాటు సారా పై గడివేముల ఎస్సై హుస్సేన్ బాషా ఉక్కుపాదం


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని ఎల్కె తాండ గ్రామ  శివార్లలో నాటుసారా తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం  తెలుసుకున్న గడివేముల ఎస్ఐ హుస్సేన్ బాషా తన సహచర  పోలీసు సిబ్బంది  చిన్న మధు, సురేంద్ర లతో ఆకస్మిక దాడులు జరిపి రాజు నాయక్ అనే వ్యక్తి వద్ద నుండి  40 లీటర్ల నాటుసారాను, నాటు సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 2000 లీటర్ల బెల్లం ఊట ను నేలమట్టం చేసి నాటు సారా తయారు చేసేందుకు ప్రయత్నించిన రాజు నాయక్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎసై హుస్సేన్ భాష గారు మాట్లాడుతూ గడివేముల మండల పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక  కార్యకలాపాలకు  పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: