హైకోర్టు తీర్పును ఏపీ స‌ర్కారు అమలు చేయటం లేదు


ఏపీ లోని వైసీపీ సర్కార్ కు అమరావతి రైతులకు మధ్య వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ స‌ర్కారు అమలు చేయటం లేదని రైతుల తరఫున న్యాయవాది మురళీధర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయ‌గా, దానిని కోర్టు ఈ రోజు ప‌రిశీలించింది. ఉద్దేశపూర్వకంగానే కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని పిటిషన్‌లో రైతులు పేర్కొన్నారు. 

అలాగే, నిధులు లేవనే సాకుతో తీర్పు అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని చెప్పారు. ఆయా అంశాల‌ను ప‌రిశీలించిన న్యాయ‌స్థానం కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. దీనిపై తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: