తెలంగాణకు రాజకీయ పర్యాటకులు వస్తున్నారు


తెలంగాణకు రాజకీయ పర్యాటకులు వస్తున్నారు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ నేత జే.పీ.నడ్డాను ఉద్దేశించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితా సైటైర్లు వేశారు. ఇదిలావుంటే తెలంగాణలో అప్పుడే ఎన్నికల సమయం ఆసన్నమయిందా? అనే విధంగా రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. పాదయాత్రలు, సభలు, పర్యటనలను, ప్రెస్ మీట్లతో అన్ని పార్టీల నేతలు హీట్ పెంచుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ వీరిపై విమర్శలు గుప్పించారు. 

తెలంగాణకు రాజకీయ పర్యాటకులు వస్తున్నారంటూ కవిత ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు చాలా మంది రాజకీయ పర్యాటకులు రాష్ట్రానికి వస్తుంటారని.. రాష్ట్రాని వీరు చేసిందేమీ ఉండదని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ సభ కేవలం రాజకీయాల కోసమేనని విమర్శించారు. రైతులకు వారు ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: