బుల్డోజర్ టైరు పేలి...ఇద్దరు మరణం


ఛత్తీస్ ఘడ్ లో ధారుణం చోటు చేసుకొంది. బుల్డోజర్ టైరుకు గాలి పడుతున్న సమయంలో... అది పేలడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాయ్ పూర్ లోని సిల్తారా ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ వర్క్ షాప్ లో టైరుకు గాలి పడుతున్న సమయంలో ఒక వ్యక్తి టైరుపై కూర్చొని ఉన్నాడు. మరోవ్యక్తి టైరు వద్దకు వచ్చాడు.

టైరులో ప్రెజర్ ఎంతుందనే విషయాన్ని వీరు చెక్ చేస్తున్నారు. ఈ సమయంలోనే టైరు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో వీరు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మృతులిద్దరూ మధ్యప్రదేశ్ కు చెందిన వారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: