ట్రాఫిక్ నియంత్రణకు మోక్షం ఎప్పుడు..?


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

గడివేముల మండలం లోని రైతులు పండించిన వరి పంటలు అయిపోవడంతో, వరి గడ్డిని కోతలు కోసి, రైతులకు పశువుల దానా కోసం గడ్డిని విక్రయిస్తున్నారు. రైతులు వరి గడ్డిని వాహనాల్లో తరలించే క్రమంలో ట్రాక్టర్ల   ట్యాలీ లకు పరిమితికి మించిన పశుగ్రాసం తరలిస్తున్నారు. నిత్యం రద్దీగా తిరిగే గడివేముల ప్రధాన రహదారుల్లో ప్రతిరోజు జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ కి వెళ్లే భారీ వాహనాల వల్ల, పశుగ్రాసం తీసుకుపోయే ట్రాక్టర్ ల వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది.


గడివేముల ప్రధాన రహదారి గుండా నందికొట్కూరు కు, కర్నూల్ కి వెళ్లే బస్సులు కార్లు ద్విచక్ర వాహనాలు గడివేముల పాత బస్టాండ్ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది, అయితే గడివేముల పాత బస్టాండ్ ప్రధాన రహదారి సింగిల్ రోడ్డు కావడంతో ఎదురుగా ఒక వాహనం వస్తే ఒక వాహనం వెళ్లేందుకు వీలు లేకుండా ఉండడంతో అనునిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ట్రాఫిక్ అంతరాయం జరిగిన విషయం ట్రాఫిక్ ను నియంత్రించే అధికారులకు సమాచారం తెలుసుకోవడానికి కూడా గడివేముల మండలంలో ఏర్పాటుచేసిన నీఘునేత్రాలు (సీసీ కెమెరాలు)

పనిచేయకపోవడంతో వాహనదారులు రహదారుల పైనే కాలయాపన చేయవలసిన పరిస్థితి గడివేముల పాత బస్టాండ్ ప్రధానరహదారిపై అనునిత్యం దర్శనమిస్తుంది. ఈ ప్రధాన రహదారిపై ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉన్నతాధికారులు, అనునిత్యం ప్రయాణం చేస్తుంటారు, కేవలం వారు వచ్చినప్పుడు మాత్రమే ట్రాఫిక్ ను అదుపు చేస్తున్నారు తప్ప, మిగతా సమయాలలో  ట్రాఫిక్ ను నియంత్రించే అధికారులు లేకపోవడంతో వాహనదారులు అసహనం వ్యక్త పరుస్తున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: