భారీ బడ్జెట్ దిశగా రామ్ చిత్రం...ఆయన కేరీర్ లో ఇదే తొలి చిత్రమా


చిన్న బడ్జెట్ హీరోలు కూడా ఇపుడు భారీ బడ్జెట్ వ్యయం దిశగా అడుగులేస్తున్నారు. తాజాగా రామ్ హీరోగా 'ది వారియర్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా రామ్ కనిపించనున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించారు. ఇంతవరకూ రామ్ సినిమాలన్నీ కూడా 30 కోట్ల బడ్జెట్లోనే పూర్తయ్యాయట. ఈ సినిమా కోసం మాత్రం 75 కోట్ల వరకూ ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది.

రామ్ సినిమా కోసం ఈ  స్థాయిలో ఖర్చు పెట్టడం ఇదే మొదటిసారి అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో రామ్ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. ఈ సినిమా నుంచి వచ్చిన 'బుల్లెట్' సాంగ్ జనంలోకి బాగానే వెళ్లింది .. భారీ స్థాయిలోనే వ్యూస్ తెచ్చుకుంది. రేపు సాయంత్రం 5:31 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.  

తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను జులై 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా తరువాత బోయపాటితో రామ్ చేయనున్న సినిమా బడ్జెట్ మరింత పెరిగిందనేది తాజా సమాచారం. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతుందని అంటున్నారు. రామ్ కెరియర్లో తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: