గ్రూప్ 1,2,3 అభ్యర్థులకు ఎమ్.పి.జె ఆధ్వర్యంలో,,

నోటు పుస్తకాలు పంపిణీ


(జానో జాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

స్ధానిక ఖమ్మం రిక్కా బజార్ స్కూల్ లో తెలంగాణ ప్రభుత్వం, మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో గ్రూప్ 1,2,3  అభ్యర్ధులకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగు తున్నది. ఈ శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎం.పి.జె) జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిమ్ ఆధ్వర్యంలో, జిల్లా కార్యవర్గ సభ్యులు నోటు పుస్తకాలు, పెన్నులు పంచారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం.ఏ. మహమూది మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని అందరూ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎం.పి.జె., సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ సాధిక్ అహ్మద్, విద్యార్థులతో మాట్లాడుతూ, సమయపాలన, నైపుణ్యంతో పరీక్షలకు సిద్ధమవ్వాలని తెలిపారు. ఎక్కువ గంటలు కష్టపడి చదివి, కల నెరవేర్చుకోవాలని అభిలషించారు. జిల్లా ఎం.పి.జె అధ్యక్షులు ఖాసిమ్ మాట్లాడుతూ  క్రమశిక్షణ తో పరీక్షలకు సిద్ధమైతే అభ్యర్థులు ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తారని తెలిపారు. అంతేగాక ఎక్కువ మంది అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణకు హాజరయ్యే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు గఫార్, కార్యదర్శులు సతీష్, రజబాలి, కోశాధికారి హకీమ్, మీడియా సెక్రటరీ చక్రవర్తి, సభ్యులు పాషా, రహీమ్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: