మే 2022

 బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం.... 

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

గడివేముల మండల స్థానిక  ఎంపీడీవో కార్యాలయం నందు సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాణ్యం ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గడివేముల మండలంలో జరుగుతున్నటువంటి  అభివృద్ధి కార్యక్రమాల గురించి వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ


గడివేముల మండలం లోని అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు సరి అయిన పౌష్టిక ఆహారం సరిగా అందడం లేదని తన దృష్టికి వచ్చిందని,జగనన్న గోరుముద్ద లో భాగంగా పిల్లలకు పౌష్టికాహారం తప్పనిసరిగా అందజేయాలని , ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అంగన్వాడి సెంటర్ లను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాననీ అంగన్వాడి సూపర్వైజర్ ను టీచర్లు హెచ్చరించారు. "పొగాకు వ్యతిరేక దినోత్సవం" సందర్భంగా గడివేముల మండల వైద్యాధికారి డాక్టర్ సుజన 

సర్వసభ్య సమావేశానికి హాజరైన అధికారులు, సర్పంచులు, ఎంపీపీల చే  "నేను నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, మరియు పరిచయస్తులు ఎటు వంటి పొగాకు  ఉత్పత్తులను వినియోగించకుండా నేను నా పర్యావరణాన్ని, పొగాకు ఉత్పత్తుల నుండి రక్షిస్తానని ప్రతిజ్ఞ చేయించారు"


అనంతరం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లా ఈ డి శ్రీనివాస్ కుమార్  గారు1988-89 సంవత్సరం నుండి  సాగుచేసుకుంటున్న మంచాలకట్ట గ్రామానికి చెందిన 32 మంది ఎస్సీ మహిళలకు  ఎకరా భూమి కి ప్రభుత్వం నుండి మంజూరైన  సొంత పట్టాలను ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, గడివేముల మండల తాసిల్దార్ నాగమణి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయసింహారెడ్డి , తాసిల్దార్ నాగమణి, గడివేముల మండల జడ్పిటిసి ఆర్ బీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ నాగ మద్దమ్మ, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

తన తాజా  ధప్పా హిందీ ఒరిజిన‌ల్‌ను షో ... 

ప్రారంభించిన....హంగామా ప్లే 

(జానో జాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

హంగామా డిజిటల్ మీడియా  యాజమాన్యంలోని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్‌   అయిన హంగామా ప్లే ఈరోజు తన తాజా హిందీ ఒరిజినల్ షో ధప్పాను ప్రారంభించింది. మోనాలిసా, జేభానుషాలి, అబిగ‌లీ పాండే,  క్రిస్సన్బారెట్టో, విశాల్సింగ్, సనమ్జోహార్, స్మృతిఖన్నా, అభిషేక్కపూర్, సమృద్బావా, దిశాంక్అరోరా, సాక్షిశర్మ, వరుణ్ జెయిన్మ మోహిత్ దుసేజా వంటి టీవీ  చలన చిత్ర నటులు నటించడమే ఈ సంకలనానికి ముఖ్యాంశం. ధప్పాలో ఐదు ప్రత్యేక మైన ప్రేమ కథలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి విచిత్రమైన మలుపులు, కామెడీ,  డ్రామా వంటివి ఉంటాయి. 

ప్రేమ స్వచ్ఛమైనది మరియు శాశ్వత మైనది, కానీ రొమాంస్‌కి సంబంధించిన అన్నికథలు సాఫీగా ఉండవు, ముఖ్యంగా అనుమానాస్పద గ్లేర్స్‌తో వచ్చినవి మరియు తరచుగా రసవత్తరమైనగా సిప్‌లుగా మారుతాయి. అలాంటి ఐదు ప్రేమకథల సమాహార మేధప్పా.ప్రతి ఒక్కరికీ తెలిసిన పట్టణంలో గర్భనిరోధక సాధనాలు కొనడానికి కష్టపడుతున్నజంట అయినా, ఒక ప్రొఫెస‌ర్ త‌న  చిన్నవిద్యార్థితో స్నేహం చేయడం, ఊహించిన దానికంటే కొంచెం ముందుగా గర్భందాల్చిన వధువు లేదా ఇద్దరు స్నేహితులు కుటుంబాలు ముడి వేయడానికి, ఆకస్మిక అంత్యక్రియలు అసలు రాత్రికి ముందు వారి వివాహ రాత్రిని ఆస్వాదించడానికి ప్లాన్చేస్తున్న జంట యొక్క ప్రణాళికకు భంగం కలిగిస్తాయి,


ఈ జంటలు తమ బంధువులు పొరుగు వారి కనుబొమ్మల నుండి తమ సంబంధాన్ని కాపాడు కోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు.వారు సఫలమవుతారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. తమ ప్రేమ జీవితాన్నికాపాడుకోవడానికి ప్రతి అడ్డంకిని వారు ఎలా ఎదుర్కుంటారో తెలుసు కోవడానికి షోను చూడండి.

ఈ కార్యక్రమం గురించి హంగామా డిజిటల్మీడియా సిఓఓ  సిద్ధార్థరాయ్ మాట్లాడుతూ, “ప్రేక్షకులు ఆనందించే మంచి కథలు మరియు ప్రదర్శనలతో వారి ముందుకు రావాలని మేము నమ్ముతున్నాము.కొన్ని సంవత్సరాలుగా, మేము ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న కంటెంట్లైబ్రరీని సృష్టించగలిగాము.స్థానిక, సంబంధిత మరియు వినోద భరితమైన కథలు, కొన్నిసార్లు ఇంటింటికి సందేశాన్నిఅందించి, ప్రభావితం చేస్తాయి.ధప్పా కూడా అలాంటి కథలలో ఒకటే. కామెడీ మరియు రొమాన్స్యొక్క శైలులు ఒక చోట చేర్చినప్పుడు ఎల్లప్పుడూ హృదయంలోఒక చక్కిలి గింతను రేకెత్తిస్తాయి, జ్ఞాపకాలను మరియు ముఖంలో చిరునవ్వును తిరిగితెస్తాయి.ఈసంకలనం తేలికైన కంటెంట్‌తో సమాజంలో జంటలు ఎదుర్కొనే కళం కాల చుట్టూ చర్చను రేకెత్తిస్తుంది. ప్రేక్షకులు ఎంజాయే చేస్తారని ఆశిస్తున్నాం.”

 అంతర్జాతీయ ప్రమాణాలు..అందరికీ అందుబాటులో ఫీజులు

దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్...ఆఫ్ ఫిల్మ్ స్టడీస్  ప్రత్యేకతలు!!

5 వ స్నాతకోత్సవానికి సన్నాహాలు!!


     జాతీయ స్థాయి ఉత్రమ నటి రేవతితో ముప్పై ఏళ్ల క్రితం "అంకురం" రూపొందించి.. రివార్డులతోపాటు... లెక్కకు మిక్కిలి అవార్డులు కొల్లగొట్టిన ప్రముఖ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు తాజాగా మళ్లీ రేవతితోనే "ఇట్లు అమ్మ" రూపొందించి... మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. నిర్మాతకు కనకవర్షం కురిపించిన "ఇట్లు అమ్మ" జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో 76 అవార్డులు గెలుచుకుని.. "సోని లివ్"లో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటూ.. తెలుగు సినిమా సత్తాను మరోసారి సగర్వంగా చాటి చెబుతోంది. మమ్ముట్టి-సుమన్-నగ్మా-మాలాశ్రీలతో "సూర్యపుత్రులు", అరవింద్ సామి-నగ్మాలతో "మౌనం", జగపతిబాబు-హీరాలతో "శ్రీకారం" వంటి రివార్డ్స్ అండ్ అవార్డ్స్ విన్నింగ్ ఫిల్మ్స్ రూపొందించి... దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం కలిగిన విశిష్ట దర్శకులు సి.ఉమామహేశ్వరరావు.... సినిమా లతో బిజీగా ఉంటూనే గత ఐదేళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా "దాదా సాహెబ్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" నిర్వహిస్తున్నారు!!


      దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కళాతపస్వి కె.విశ్వనాధ్ చేతుల మీదుగా మొదలైన "దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్"... అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు వంటి చిత్ర ప్రముఖుల ప్రోత్సాహంతో తెలుగు చిత్రసీమకు గత ఐదేళ్లుగా ఎందరో ప్రతిభావంతుల్ని పరిచయం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో... దిగువ మధ్య తరగతివారికి సైతం అందుబాటులో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లేని లోటును తీర్చుతోంది!!

     "అంతర్జాతీయ ప్రమాణాలు... అందరికీ అందుబాటులో ఫీజులు" అనే సిద్ధాంతంతో ప్రగతిపథంలో దూసుకుపోతున్న "దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" మరికొద్ది రోజుల్లో 5 వ వార్షికోత్సవం జరుపుకోనున్న సందర్భంగా ఫిల్మ్ స్కూల్ సారధి ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ... "యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ"లకు మాత్రమే పరిమితం కాకుండా... ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, ఆడియోగ్రఫి, డిజిటల్ మ్యూజిక్ ప్రొడక్షన్ వంటి సౌండ్ కి సంబంధించిన కోర్సులు సైతం ఉండడం మా ఫిల్మ్ స్కూల్ ప్రత్యేకత. ఇప్పటివరకు మా స్కూల్ లో కోర్సులు చేసినవారంతా... ఇండస్ట్రీలో వివిధ శాఖల్లో విశేషంగా రాణిస్తున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్, రీజినల్ సినిమాలపై సమగ్ర అవగాహన కలిగేలా సిలబస్ డిజైన్ చేశాం. మన దేశంలో ఉన్న బెస్ట్ ఫిల్మ్ స్కూల్స్ అనుసరించే సిలబస్ బాగా స్టడీ చేసి... వాటన్నిటిలో ఉన్న ఉత్తమ అంశాలు మేళవించి...మా ఫిల్మ్ స్కూల్ సిలబస్ రూపొందించాం" అని వివరించారు!!

      ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, నీలకంఠ, ప్రముఖ నటులు నాజర్, రేవతి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధు అంబట్, ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి వంటి నిష్ణాతులు గెస్ట్ ఫ్యాకల్టీగా కలిగిన "దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" ను మన దేశంలోనే నంబర్ 1 ఫిల్మ్ స్కూల్ గా తీర్చిదిద్దాలనే వజ్ర సంకల్పం కలిగిన ఉమామహేశ్వరరావు ఇంకా మాట్లాడుతూ... "ఫిల్మ్ స్కూల్ కు సంబంధించి అల్లు అరవింద్, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతల సలహాలు-సూచనలు, సహాయ సహకారాలు మరువలేనివి. నా తదుపరి చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే అధికారికంగా పూర్తి వివరాలు ప్రకటిస్తాం" అన్నారు!!

      విద్యాధికుడు, విజువల్ ఆర్ట్స్ లో ప్రతిభాశాలి నందన్ బాబు ప్రిన్సిపాల్ గా... ప్రముఖ సినిమాటోగ్రాఫర్ & డైరెక్టర్ మధు మహంకాళి "డీన్"గా.. సినిమాటోగ్రాఫర్ వరప్రసాద్, స్క్రిప్ట్ రైటర్ & డైరెక్టర్ రాము ల నిర్దేశకత్వలో.. అత్యంత నిష్ణాతులైన ఫ్యాకల్టీ కలిగిన దాదా సాహెబ్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ లో చేరి... సినిమా రంగంలో తమ ప్రతిభకు పట్టాభిషేకం చేయించుకోవాలని ఉవ్విళ్ళూరేవారు


7780196227 నంబర్ లో నేరుగా సంప్రదించవచ్చు. 

పూర్తి వివరాల కోసం www.dpsfs.edu.in

వెబ్సైట్ సందర్శించవచ్చు!!


 ఉరి వేసుకొని యువకుడు..... ఆత్మహత్య

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని కరిమద్దెల గ్రామానికి చెందిన మిద్దె వెంకటరమణ  ( 35) తన పంచ తో ఉరి వేసుకొని చనిపోయాడు. వివరాల్లోకి వెళితే వెంకట రమణ  భార్య అయిన మిద్దె మేరమ్మ  తెలిపిన వివరాల మేరకు  తన అన్న వెంకటసుబ్బయ్య పొలంలో పంచాయతీ  విషయంలో మనస్పర్ధలు కలిగి ఉండి  చనిపోవాలనే ఉద్దేశం తో  బుధవారము రాత్రి రెండున్నర గంటల సమయంలో కరిమద్దెల గ్రామంలో ని నాగుల కట్ట దగ్గర తన దగ్గర ఉన్న పంచ తో ఉరేసుకొని చనిపోయాడన్న సమాచారం తెలుసుకున్న గడివేముల ఎస్ ఐ  బీ.టీ. వెంకట సుబ్బయ్య  కేసు నమోదు చేసి పోస్టుమార్టం  నిమిత్తం వెంకటరమణ మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు

 మీ నిర్ణయాలతో సామాన్యులు ఇబ్బంది పడాలా


రాజకీయ నాయకుల నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలని ఆ దేశ క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ ప్రశ్నించాడు. లాహోర్ లోని బంకుల్లో పెట్రోల్ లేదని, ఏటీఎంలలో నగదు లేదని, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నాడు.  ఈ ట్వీట్ ను ప్రధాని హెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లతో పాటు పలువురు రాజకీయ నేతలను ట్యాగ్ చేశాడు. పాకిస్థాన్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకాలం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వ్యవహార తీరును తప్పుపడుతూ విమర్శలు గుప్పించిన హఫీజ్ ఇప్పుడు దేశంలోని దుర్భర పరిస్థితులపై రాజకీయ నేతలను ప్రశ్నిస్తూ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొహమ్మద్ హఫీజ్ పాకిస్థాన్ తరపున మూడు ఫార్మాట్లలో ఆడాడు. అంతేకాదు, పాక్ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 12 వేల పరుగులను చేయడంతో పాటు, 250 వికెట్లు తీశాడు.

 ఫర్టిలైజర్స్,..పెస్టిసైడ్ డీలర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన..

గడివేముల ఎస్ఐ బీ.టీ. వెంకటసుబ్బయ్య


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

 నంద్యాల జిల్లా  గడివేముల మండల పరిధిలోని రైతులకు విక్రయించే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ దుకాణ యజమానులకు డీలర్లకు గడివేముల ఎస్ఐ  బీటీ వెంకటసుబ్బయ్య కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కరిఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న రైతులకు విక్రయించే  విత్తనాలు, నీళ్ల మందులు నాణ్యమైనవి మాత్రమే విక్రయించాలని, నాణ్య రహిత మందులు గానీ,విత్తనాలు, ఎరువుల మందులు విక్రయించరాదని,


ప్రభుత్వంచే ఆమోదముద్ర పొందిన ఎరువుమందులు గాని విత్తనాలు గాని విక్రయించాలని, ఎమ్మార్పీ ధరలు కంటే అధిక ధరలకు రైతులకు విక్రయించిన, నాణ్యతలేని  విత్తనాలు గాని, ఎరువుల మందులు గానీ, విక్రయించిన షాపు యజమానులపై, డీలర్లపై, చట్టపరమైన  కఠిన చర్యలు తీసుకుంటామని గడివేముల ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్య హెచ్చరించారు.


 

 అక్కినేని అఖిల్ భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్'..షుటింగ్ మనాలిలో

(జానో జాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్. స్టైలిష్ స్పై థ్రిల్లర్‌ గా రూపుదిద్దుకుంటున్న 'ఏజెంట్' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మనాలిలో హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని సూపర్వైజ్ చేస్తున్నారు. అఖిల్‌ తో పాటు చిత్రంలోని కీలక నటీనటులు షూటింగ్‌ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన  వర్కింగ్ స్టిల్‌ లో దర్శకుడు సురేందర్ రెడ్డి, డీవోపీ రసూల్ ఎల్లోర్, విజయ్ మాస్టర్‌ సెట్స్ లో కనిపించారు. హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్నారు. అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న విడుదలకు సిద్ధమౌతుంది.


తారాగణం: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి

సాంకేతిక విభాగం ::

దర్శకత్వం: సురేందర్ రెడ్డి

నిర్మాత: రామబ్రహ్మం సుంకర

సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి

బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా

కథ: వక్కంతం వంశీ

సంగీతం: హిప్ హాప్ తమిజా

డీవోపీ : రసూల్ ఎల్లోర్

ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా

స్టంట్స్: విజయ్ మాస్టర్, స్టంట్ శివ

పీఆర్వో: వంశీ-శేఖర్


 ఈ పరిమితితోనే మీ వాహనం పరిగెత్తాలి


వాహనాల వేగంపై కాస్త పరిమితి పెంచుతూ తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు. తాజాగా  గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితిని పెంచుతూ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ కార్యాల‌యం బుధ‌వారం నిర్ణయం తీసుకుంది. ఇప్ప‌టిదాకా జీహెచ్ఎంసీ ప‌రిధిలో అన్ని ర‌కాల వాహ‌నాల వేగ ప‌రిమితి గంట‌కు 40 కిలో మీట‌ర్లుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ వేగాన్ని మించితే ట్రాఫిక్ పోలీసులు జ‌రిమానా విధిస్తున్నారు. అయితే తాజాగా ఈ వేగ ప‌రిమితిని పెంచ‌డంతో పాటుగా ఆయా వాహ‌నాల వేగ ప‌రిమితుల‌ను వేర్వేరుగా నిర్ణ‌యించారు. 

డివైడ‌ర్లు ఉన్న చోట (డ‌బుల్ లేన్‌) కార్లు గంట‌కు 60 కిలో మీట‌ర్ల వేగంతో వెళ్లేందుకు అనుమ‌తించిన పోలీసు శాఖ‌... ఆ ప్రాంతాల్లో బ‌స్సులు, బైకుల స్పీడును మాత్రం గంట‌కు 50 కీలో మీట‌ర్లుగా నిర్ణయించింది. ఇక న‌గ‌ర ప‌రిధిలో డివైడ‌ర్లు లేని చోట కార్ల వేగాన్ని గంట‌కు 50 కీలో మీట‌ర్లు కాగా... బ‌స్సులు, బైకుల వేగం మాత్రం గంట‌కు 40 కీలో మీట‌ర్లుగా ఉంది. ఇక కాల‌నీల్లో అన్ని ర‌కాల వాహ‌నాల వేగం 30 కిలో మీట‌ర్ల‌కు మించ‌రాద‌ని పోలీసు శాఖ ప్ర‌క‌టించింది.

 ఒక కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు పెడితే ఇంతగా చేస్తారా


ఒక కోన‌సీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్ పేరు పెడితే ఇలా చేస్తున్నారని కొందరు ఆందోళన కారులపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.  దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి ప్ర‌భుత్వాలు అన్ని స్కీములు, రోడ్లు, పార్కులు, డ్యాంల‌కు గాంధీ, నెహ్రూల పేర్లు పెట్టినా జ‌నాభాలో 90 శాతం మంది ఉన్న బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు మౌనంగానే ఉన్నాయ‌ని ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు కేవ‌లం ఒక కోన‌సీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్ పేరు పెడితేనే ఎలా వ్య‌తిరేకిస్తున్నారంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ దిశ‌గా చాలా లెక్క‌లే తేలాల్సి ఉన్నాయంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.

కోన‌సీమ జిల్లాలోని అమ‌లాపురం కేంద్రంగా మంగ‌ళ‌వారం చోటుచేసుకున్న అల్ల‌ర్లు ఇప్పుడు తెలుగు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. అమ‌లాపురం అల్ల‌ర్లు మీ ప‌నేనంటూ విప‌క్షాలు ఆరోపిస్తుంటే.. కాదు అవి విప‌క్షాల ప‌నేనంటూ వైసీపీ ప్ర‌తిస్పందిస్తోంది. ఇలాంటి నేప‌థ్యంలో బీఎస్పీ తెలంగాణ క‌న్వీన‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. 

 డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా 11:11 సినిమా..

యూత్‌ఫుల్ సాంగ్ విడుదల చేసిన రామ్ పోతినేని


(జానో జాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా 11:11 సినిమాను రూపొందిస్తున్నారు నిర్మాత గాజుల వీరేష్ (బళ్లారి). కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా రాబోతున్న ఈ సినిమాను టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆర్.కె. నల్లూరి దర్శకత్వం వహిస్తుండగా సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉన్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా టిప్స్ మ్యూజిక్ ద్వారా ఓ యూత్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. హీరో రామ్ చేతుల మీదుగా విడుదల చేసిన ఈ పాట ఏమయ్యిందో మనసైపోయే మాయం అంటూ యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది.

పాటలో హీరోహీరోయిన్లపై షూట్ చేసిన సన్నివేశాలతో పాటు కోటి అందించిన మ్యూజిక్ మేజర్ హైలైట్ అయ్యింది. తన ప్రేయసి ప్రేమ కోసం ప్రియుడు తన ఫీలింగ్స్ బయటపెడుతున్నట్లు ఈ సాంగ్ రాశారు రాకేండు మౌళి. ఈ సాంగ్ విడుదల చేసిన అనంతరం సాంగ్ చాలా బాగా వచ్చిందని తెలిపారు హీరో రామ్. ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెబుతూ సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నారు.  


ఈ 11: 11 చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, దగ్గుబాటి రానా చేతులమీదుగా వదిలిన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్ సినిమా పట్ల ఆసక్తి పెంచేసింది.  హీరో రాజీవ్ సాలూర్- హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్, అందులో అనూహ్యంగా ఎంటరైన ఓ వ్యక్తి, అతన్ని హతమార్చడం అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌‌తో ఈ మూవీ రూపొందింది. అతిత్వరలో ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్. 

నటీనటులు : 

రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్, రోహిత్, కోటి సాలూర్, సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు 

సాంకేతిక వర్గం 

బ్యానర్: టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తికా ఫిలిమ్స్

నిమాటోగ్రఫీ: ఈశ్వర్

ఎడిటర్: రవి మాన్ల

డైలాగ్స్: పవన్ కె అచల

మ్యూజిక్ : మణిశర్మ

ప్రొడ్యూసర్: గాజుల వీరేష్ (బళ్లారి)

లైన్ ప్రొడ్యూసర్: సందీప్ గాలి 

స్టోరీ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్: RK నల్లూరి

పీఆర్వో: సాయి సతీష్, రాంబాబు పర్వతనేని

 ఆగస్టు 5న విడుదల కానున్న దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' 


(జానో జాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

 దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' చిత్రం ఆగస్టు 5న విడుదల కానున్నది. వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ ప్రతిష్టాత్మకంగా అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం 'సీతా రామం'. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా యుద్ధ నేపధ్యంలో  అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

ప్రమోషనల్ కంటెంట్‌ తో ఇప్పటికే భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం విడుదల తేదిని తాజాగా నిర్మాతలు ఖరారు చేశారు. ఆగస్టు 5న 'సీతా రామం' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల చేస్తున్నారు.

మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగల్ 'ఓ సీతా- హే రామా' పాటకు మంచి ఆదరణ లభించింది.  సంగీత ప్రేమికుల మనసులో ఎప్పటిటికీ నిలిచిపోయే స్థానం సంపాదించుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ లవ్లీ మోలోడీ  చార్ట్ బస్టర్ గా నిలిచి ఆల్బమ్ మరిన్ని అంచనాలు పెంచింది.

తెలుగు, తమిళం


, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అడిషనల్ సినిమాటోగ్రఫీని శ్రేయాస్ కృష్ణ అందిస్తున్నారు.

తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, శత్రు, భూమిక చావ్లా, రుక్మిణి విజయ్ కుమార్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: హను రాఘవపూడి

నిర్మాత: అశ్వినీదత్

బ్యానర్: స్వప్న సినిమా

సమర్పణ: వైజయంతీ మూవీస్

ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణ

సంగీతం: విశాల్ చంద్రశేఖర్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు

ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి, ఫైసల్ అలీ ఖాన్

కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గీతా గౌతమ్

పీఆర్వో : వంశీ-శేఖర్

 మల్థీవుల్లో రోహిత్ శర్మ...సతీమణితో కలసి జాలీ టూర్


క్రికెట్ రంగంలో ఉన్న ఒత్తిడి నుంచి కాస్త బయటపడేందుకు భారత క్రికెటర్ రోహిత్ శర్మ ఉపసమనం కోసం విదేశీ యాత్రలకు వెళ్లాడు. రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 14 ఇన్నింగ్స్ లో రోహిత్ 19.14 సగటుతో 268 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో అతని హయ్యెస్ట్ స్కోరు 48 పరుగులు మాత్రమే. అంతేకాదు, ఈ సీజన్ లో రోహిత్ జట్టు ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో నిలిచింది. 

ఈ నేపథ్యంలో ఆ ఫెయిల్యూర్ మూడ్ నుంచి బయటపడేందుకు రోహిత్ తన భార్యతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. ఓ బీచ్ రిసార్ట్ లో తన భార్యతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు... మరిన్ని రోజులు ఇలాంటి ఏకాంతం కావాలని క్యాప్షన్ ఇచ్చాడు. 

మరోవైపు దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. కోహ్లీ, బుమ్రాలతో పాటు రోహిత్ కు కూడా విశ్రాంతిని కల్పించారు. జూన్ చివర్లో ఇంగ్లండ్ తో జరిగే టెస్టు మ్యాచ్ కు రోహిత్ మళ్లీ అందుబాటులోకి రానున్నాడు.

వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ...నామినేషన్ ధాఖలు


రాజ్య‌స‌భ ఎన్నికల్లో భాగంగా ఏపీ కోటాలో త్వ‌ర‌లోనే ఖాళీ కానున్న నాలుగు స్థానాల‌కు వైసీపీ ఎంపిక చేసిన న‌లుగురు అభ్య‌ర్థులు బుధ‌వారం నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు రిట‌ర్నింగ్ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తున్న శాస‌న మండలి ఉప కార్య‌ద‌ర్శి పీవీ సుబ్బారెడ్డికి వైసీపీ అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్లను అంద‌జేశారు. ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ, కారుమూరి నాగేశ్వ‌ర‌రాలు వెంట రాగా వైసీపీ అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. 

ఇదిలావుంటే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డిని మ‌రోమారు రాజ్య‌స‌భ‌కు పంపేందుకు నిర్ణ‌యించిన వైసీపీ మిగిలిన మూడు స్థానాల‌కు బీద మ‌స్తాన్ రావు, నిరంజ‌న్ రెడ్డి, ఆర్.కృష్ణ‌య్య‌ల‌ను ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే.  

 'మేజ‌ర్' చిత్రం ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అవుతుంది

 శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌ 


 'మేజ‌ర్' చిత్రం ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అవుతుందని ఆ చిత్ర సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల అన్నారు.ఇదిలావుంటేఅడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది.26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో  ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‌మేజ‌ర్‌`కు సంగీతం స‌మ‌కూర్చిన  శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల మీడియాతో ప‌లు విష‌యాలు పంచుకున్నారు. -అడ‌వి శేష్‌తో నా జ‌ర్నీ చాలా క్రేజీగా అనిపిస్తుంది. కిస్‌, క‌ర్ణ సినిమాల‌కు ప‌నిచేశాను. త‌ర్వాత క్ష‌ణం చేశాను. అప్ప‌టినుంచి గూఢ‌చారి, ఎవ‌రు, ఇప్పుడు మేజ‌ర్ సినిమా చేశాను. చిన్న బడ్జెట్‌, పెద్ద బడ్జెట్ అనే సినిమాలు నేను చూడ‌ను. మంచి కంటెంట్ చ‌క్క‌టి బాణీలు ఇవ్వ‌గ‌లనా అనేది చూస్తాను. డిజెటిల్లు వంటి సినిమా చేశాక మేజ‌ర్ అనే సినిమా చేయ‌డం గొప్ప‌గా భావిస్తున్నా.నేను చిన్న‌త‌నంనుంచి సినిమాలు పెద్ద‌గా చూడ‌ను. కానీ సంగీతం, పాట‌లు బాగా ఫాలో అవుతాను. ఘంట‌సాల గారి పాట‌లు అంటే మ‌రీ ఇష్టం.మేజ‌ర్ సినిమా అనేది మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందింది. బ‌యోపిక్‌. అందులో ల‌వ్‌స్టోరీ, పాట‌లు, నేప‌థ్య సంగీతం అన్నీ వున్నాయి. అంద‌రికీ అవి న‌చ్చుతాయి. ఇప్ప‌టికే పాట‌లు హిట్ అయ్యాయి.- నేను మ‌హేష్‌బాబుగారిని ట్రైల‌ర్ లాంఛ్‌ లోనే క‌లిశాను. త‌ర్వాత కుద‌ర‌లేదు.నేను థ్రిల్ల‌ర్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు సంగీతం అందించాను. మాస్‌, కామెడీ సినిమాల‌కూ ప‌నిచేయాల‌నుంది. క్ష‌ణం త‌ర్వాత గ‌రుఢ‌వేగ‌, గూఢ‌చారి ఎవ‌రు, సినిమాలు అలా చేసిన‌వే. మేజ‌ర్ సినిమాలో డ్రామా వుంది. యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ మూవ్‌మెంట్‌, ల‌వ్‌స్టోరీతోపాటు చాలా ఎమోష‌న్స్ వున్నాయి. ఇవి ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అవుతాయి. అవే సినిమాకు హైలైట్ అవుతాయి.


1990 నాటి క‌థ కాబ‌ట్టి నేను అప్ప‌టి సంగీతం బాగా రావ‌డానికి కృషి చేశాను. నా కెరీర్ తొలినాళ్ళ‌లోనే బ‌యోపిక్ చేయ‌డం హ్యాపీగా ఫీల‌వుతున్నాను.- పాట‌ల‌కు అనుగుణంగా ట్యూన్స్ వుంటాయి. అలా వుంటేనే ఆ మూడ్‌లోకి తీసుకెళ్ళ‌గ‌లం. తెలుగు కంటే హిందీ భాషకు ట్యూన్ ట్రిక్కీగా అనిపిస్తుంది. ఈ ట్యూన్ దీనికి స‌రిపోయిందా లేదా అని ఆలోచించి మ‌రీ ఇవ్వాల్సి వుంటుంది. `హృద‌య‌మా అనే పాట‌ను ర‌మేష్ రాశారు. అలాగే కృష్ణ‌కాంత్‌, రాజీవ్ భ‌ర‌ద్వాజ పాట‌లు రాశారు.- సింగ‌ర్స్ ఎంపిక అనేది మ్యూజిక్ ద‌ర్శ‌కుడే చూసుకుంటారు. ఒక్కోసారి ద‌ర్శ‌కుడు కూడా సూచిస్తాడు కూడా.- ద‌ర్శ‌కుడు నాకు క‌థ చెప్ప‌గానే చాలా ఎగ్జైట్‌మెంట్ వ‌చ్చింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం అన‌గానే అప్ప‌టో జ‌రిగిన సంఘ‌ట‌న‌, ఆయ‌న ఫొటో నా క‌ళ్ళ‌ముందు క‌నిపించింది. అలాంటి సినిమాకు ప‌నిచేయ‌డం గ‌ర్వంగానూ వుంది.- నేను ఇప్ప‌టివ‌ర‌కు చేసిన సంగీతం మంచి ఆద‌ర‌ణ పొందాయి. అలాగే నేను ఏ సినిమా చేసినా ఫుల్ సినిమా చేస్తాను. ఇద్ద‌రు ముగ్గురు సంగీత ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌డం అనేది నాకు న‌చ్చ‌దు. ఒక‌వేళ అలా చేస్తే మిక్సింగ్ సౌండ్‌లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.  - పాట‌లు కంటే బ్యాక్‌గ్రౌండ్ క‌ష్ట‌మ‌నేది అంద‌రూ అంటుంటారు. నాకు ప‌ర్స‌న‌ల్ గా సాంగ్ చేయ‌డం ఇష్టం. బ్యాక్ గ్రౌండ్ చేయ‌డం అంటే కిక్ ఇచ్చిన‌ట్లుంది. నేను ఎక్కువ‌గా సినిమాలు చూడ‌ను. కానీ 1990 నుంచి పాట‌లు, సంగీతం అంటే బాగా ఇష్ట‌ప‌డ‌తాను. - ఎప్ప‌టిక‌ప్పుడు మ్యూజిక్‌ప‌రంగా అప్‌డేట్ అవుతాను. సంగీతానికి లిరిక్ అనేది చాలా ఇంపార్టెంట్‌. సౌండ్ అనేది చాలా కీల‌కం. పాట‌కు స‌రిప‌డా సౌండ్ త‌గిన‌ట్లే వుండాలి. అది చూసుకుంటాను. - ద‌ర్శ‌కుడు చాలా కూల్‌గా వుంటాడు. కానీ టేకింగ్‌లో త‌న స‌త్తా చూపిస్తాడు. స‌బ్జెక్ట్ డీల్ చేయ‌డంలో ఆయ‌న గ్రేట్‌. - కొత్త  సినిమాలు.న‌రేష్  చిత్రం ఇట్లు మారేడుమ‌ల్లి ప్ర‌జానీకం., క్ష‌ణం ద‌ర్శ‌కుడితో మ‌రో సినిమా. గూఢ‌చారి2, తెలిసిన వాళ్ళు, ఎవ‌రు అనే క‌న్న‌డ సినిమా చేస్తున్నాను అని తెలిపారు. : శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌ 

అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది.26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో  ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‌మేజ‌ర్‌`కు సంగీతం స‌మ‌కూర్చిన  శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల మీడియాతో ప‌లు విష‌యాలు పంచుకున్నారు. అడ‌వి శేష్‌తో నా జ‌ర్నీ చాలా క్రేజీగా అనిపిస్తుంది. కిస్‌, క‌ర్ణ సినిమాల‌కు ప‌నిచేశాను. త‌ర్వాత క్ష‌ణం చేశాను. అప్ప‌టినుంచి గూఢ‌చారి, ఎవ‌రు, ఇప్పుడు మేజ‌ర్ సినిమా చేశాను.-చిన్న బడ్జెట్‌, పెద్ద బడ్జెట్ అనే సినిమాలు నేను చూడ‌ను. మంచి కంటెంట్ చ‌క్క‌టి బాణీలు ఇవ్వ‌గ‌లనా అనేది చూస్తాను. డిజెటిల్లు వంటి సినిమా చేశాక మేజ‌ర్ అనే సినిమా చేయ‌డం గొప్ప‌గా భావిస్తున్నా.- నేను చిన్న‌త‌నంనుంచి సినిమాలు పెద్ద‌గా చూడ‌ను. కానీ సంగీతం, పాట‌లు బాగా ఫాలో అవుతాను. ఘంట‌సాల గారి పాట‌లు అంటే మ‌రీ ఇష్టం.- మేజ‌ర్ సినిమా అనేది మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందింది. బ‌యోపిక్‌. అందులో ల‌వ్‌స్టోరీ, పాట‌లు, నేప‌థ్య సంగీతం అన్నీ వున్నాయి. అంద‌రికీ అవి న‌చ్చుతాయి. ఇప్ప‌టికే పాట‌లు హిట్ అయ్యాయి.- నేను మ‌హేష్‌బాబుగారిని ట్రైల‌ర్ లాంఛ్‌ లోనే క‌లిశాను. త‌ర్వాత కుద‌ర‌లేదు.- నేను థ్రిల్ల‌ర్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు సంగీతం అందించాను. మాస్‌, కామెడీ సినిమాల‌కూ ప‌నిచేయాల‌నుంది. క్ష‌ణం త‌ర్వాత గ‌రుఢ‌వేగ‌, గూఢ‌చారి ఎవ‌రు, సినిమాలు అలా చేసిన‌వే.- మేజ‌ర్ సినిమాలో డ్రామా వుంది. యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ మూవ్‌మెంట్‌, ల‌వ్‌స్టోరీతోపాటు చాలా ఎమోష‌న్స్ వున్నాయి. ఇవి ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అవుతాయి. అవే సినిమాకు హైలైట్ అవుతాయి.

1990 నాటి క‌థ కాబ‌ట్టి నేను అప్ప‌టి సంగీతం బాగా రావ‌డానికి కృషి చేశాను. నా కెరీర్ తొలినాళ్ళ‌లోనే బ‌యోపిక్ చేయ‌డం హ్యాపీగా ఫీల‌వుతున్నాను.- పాట‌ల‌కు అనుగుణంగా ట్యూన్స్ వుంటాయి. అలా వుంటేనే ఆ మూడ్‌లోకి తీసుకెళ్ళ‌గ‌లం. తెలుగు కంటే హిందీ భాషకు ట్యూన్ ట్రిక్కీగా అనిపిస్తుంది. ఈ ట్యూన్ దీనికి స‌రిపోయిందా లేదా అని ఆలోచించి మ‌రీ ఇవ్వాల్సి వుంటుంది. `హృద‌య‌మా అనే పాట‌ను ర‌మేష్ రాశారు. అలాగే కృష్ణ‌కాంత్‌, రాజీవ్ భ‌ర‌ద్వాజ పాట‌లు రాశారు.- సింగ‌ర్స్ ఎంపిక అనేది మ్యూజిక్ ద‌ర్శ‌కుడే చూసుకుంటారు. ఒక్కోసారి ద‌ర్శ‌కుడు కూడా సూచిస్తాడు కూడా.- ద‌ర్శ‌కుడు నాకు క‌థ చెప్ప‌గానే చాలా ఎగ్జైట్‌మెంట్ వ‌చ్చింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం అన‌గానే అప్ప‌టో జ‌రిగిన సంఘ‌ట‌న‌, ఆయ‌న ఫొటో నా క‌ళ్ళ‌ముందు క‌నిపించింది. అలాంటి సినిమాకు ప‌నిచేయ‌డం గ‌ర్వంగానూ వుంది.- నేను ఇప్ప‌టివ‌ర‌కు చేసిన సంగీతం మంచి ఆద‌ర‌ణ పొందాయి. అలాగే నేను ఏ సినిమా చేసినా ఫుల్ సినిమా చేస్తాను. ఇద్ద‌రు ముగ్గురు సంగీత ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌డం అనేది నాకు న‌చ్చ‌దు. ఒక‌వేళ అలా చేస్తే మిక్సింగ్ సౌండ్‌లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.  - పాట‌లు కంటే బ్యాక్‌గ్రౌండ్ క‌ష్ట‌మ‌నేది అంద‌రూ అంటుంటారు. నాకు ప‌ర్స‌న‌ల్ గా సాంగ్ చేయ‌డం ఇష్టం. బ్యాక్ గ్రౌండ్ చేయ‌డం అంటే కిక్ ఇచ్చిన‌ట్లుంది. నేను ఎక్కువ‌గా సినిమాలు చూడ‌ను. కానీ 1990 నుంచి పాట‌లు, సంగీతం అంటే బాగా ఇష్ట‌ప‌డ‌తాను. - ఎప్ప‌టిక‌ప్పుడు మ్యూజిక్‌ప‌రంగా అప్‌డేట్ అవుతాను. సంగీతానికి లిరిక్ అనేది చాలా ఇంపార్టెంట్‌. సౌండ్ అనేది చాలా కీల‌కం. పాట‌కు స‌రిప‌డా సౌండ్ త‌గిన‌ట్లే వుండాలి. అది చూసుకుంటాను. - ద‌ర్శ‌కుడు చాలా కూల్‌గా వుంటాడు. కానీ టేకింగ్‌లో త‌న స‌త్తా చూపిస్తాడు. స‌బ్జెక్ట్ డీల్ చేయ‌డంలో ఆయ‌న గ్రేట్‌. - కొత్త  సినిమాలు.న‌రేష్  చిత్రం ఇట్లు మారేడుమ‌ల్లి ప్ర‌జానీకం., క్ష‌ణం ద‌ర్శ‌కుడితో మ‌రో సినిమా. గూఢ‌చారి2, తెలిసిన వాళ్ళు, ఎవ‌రు అనే క‌న్న‌డ సినిమా చేస్తున్నాను అని తెలిపారు.

 పాన్ ఇండియా మూవీగా ‘విక్రాంత్ రోణ’

 


(జానో జాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

విక్రాంత్ రోణ చిత్రాన్ని క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో  పాన్ ఇండియా మూవీగా విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సినిమా కంటెంట్‌ను కూడా అలాగే ఐదు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ క్ర‌మంలో సోమ‌వారం ఈ సాంగ్ క‌న్న‌డ వెర్ష‌న్ రిలీజైంది. హిందీ వెర్ష‌న్ మంగ‌ళ‌వారం విడుద‌ల కాగా.. బుధ‌వారం తెలుగు వెర్ష‌న్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఇక త‌మిళ‌, మ‌ల‌యాళ వెర్ష‌న్ సాంగ్ వ‌రుస‌గా విడుద‌లవుతున్నాయి.

శాండిల్‌వుడ్‌ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ త్రీడీ మూవీ `విక్రాంత్ రోణ‌`. ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన ‘విక్రాంత్ రోణ‌’ చిత్రాన్ని అనుప్‌ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని జూలై 28న విడుద‌ల చేస్తున్నారు. బుధవారం ఈ చిత్రం నుంచి రా రా రాక్కమ్మా.. అనే పక్కా మాస్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో గ‌దాంగ్ రాక్క‌మ్మా పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. జాక్వ‌లైన్‌ న‌ర్తించిన ఈ సాంగ్‌ను విక్రాంత్ రోణ మూవీ ఆల్బ‌మ్‌ నుంచి తొలి సాంగ్‌గా విడుద‌ల చేశారు.

త్రీడీ మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన విక్రాంత్ రోణ టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచే క్ర‌మంలో సినిమా నుంచి ‘రా రా రాక్కమ్మా’ అనే ఫుట్ ట్యాపింగ్ సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇందులో గ‌దాంగ్ రాక్క‌మ్మ పాత్ర‌ధారిగా బాలీవుడ్ స్టార్ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ మెస్మ‌రైజ్ చేస్తుంది. మంగ్లీ, న‌కాష్ అజీజ్ పాడిన ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాశారు.  సాంగ్ చూస్తే ఓ పార్టీ సాంగ్ అని తెలుస్తోంది. కిచ్చా సుదీప్‌, జాక్వ‌లైన్ ఈ పాట‌లో చేసిన డాన్స్‌, పాట బీట్ వింటే రేపు సిల్వ‌ర్ స్క్రీన్‌పై సినిమా సంద‌డి చేయ‌టం ప‌క్కా అని తెలుస్తోంది.

ఈ సంద‌ర్భంగా జాక్వ‌లైన్ మాట్లాడుతూ ‘‘రాక్కమ్మా ఓ డిఫ‌రెంట్ సాంగ్. పాట చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఎంతో ఎంజాయ్ చేశాను. మంచి ట్యూన్‌కు చ‌క్క‌టి లిరిక్స్ కుదిరాయి. దాన్ని అద్భుతమైన డాన్స్ సాంగ్‌గా చిత్రీక‌రించారు. పాన్ ఇండియా లెవ‌ల్లో మాస్ ఆడియెన్స్‌కు న‌చ్చే సాంగ్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ సాంగ్‌లో హుక్ స్టెప్‌ను ఎవ‌రైనా ఒక‌సారైనా వేయాల‌ని భావిస్తారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 28న రిలీజ్ అవుతున్న త్రీడీ చిత్రం విక్రాంత్ రోణ. కిచ్చా సుదీప్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాను అనూప్ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌, నిరూప్ భండారి, నీతా అశోక్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

జాన్‌ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన 'విక్రాంత్ రోణ‌' చిత్రానికి అలంకార్‌ పాండియన్‌ సహ నిర్మాత. బి.అజనీష్‌ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి విలియమ్‌ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు. శివకుమార్‌.జె ప్రొడక్షన్‌ డిజైననర్‌గా వ్యవహరించారు.

 "పెన్సిల్ పరిశ్రమ" తో ప్రగతిపథంలో పయనిస్తూ

వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతూ

అభినందలందుకుంటున్న....రాజమహేంద్రవరం మహిళ "వందన"


      తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలచిందన్నట్లు... బుద్ధిగా 'బి.పి.టి' (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరఫీ) చేసి డాక్టర్ అవ్వాలనుకున్న ఆ అమ్మాయి... తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ భారాన్ని భుజాలపై వేసుకుని... చిరుద్యోగిగా మారాల్సి వచ్చింది. పెళ్లయి... పిల్లలు పుట్టాక- వాళ్ల ఆలనా పాలనా అలక్ష్యం చేయడం ఇష్టం లేక సొంతంగా ఉపాధి కల్పించుకోవాలనే ఉక్కు సంకల్పంతో... అంచెలంచెలుగా ఎదిగి... ఇప్పుడు తనే మూడొందల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తూ... అత్యంత ఆదర్శప్రాయంగా తన జీవితాన్ని మలచుకుంటోంది. రాజమండ్రికి చెందిన ఆ ధీర మహిళ పేరు "వందన".

     బి.పి.టి రెండో సంవత్సరంలో ఉండగా... కొన్ని ప్రత్యేక కారణాల వలన... తన చదువుకు ఫుల్ స్టాప్ పెట్టిన వందన జాబులో జాయినయ్యింది. అయితే... సొంతంగా ఏదైనా చేయాలనే తపన వందనను కుదురుగా ఉండనీయలేదు. "పిల్లలు పుట్టాక... ఎప్పుడైనా వాళ్లకి ఒంట్లో నలతగా ఉన్నా సరే ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చిన రోజు మనసు మనసులో ఉండేది కాదు. నామీద నాకే కోపం, జాలి కలుగుతుండేది. అందుకే సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుని ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఒకటి రెండు వ్యాపారాలు చేశాక... ఫైనల్ గా "పెన్సిల్ ఇండస్ట్రీ" ప్రారంభించానని చెబుతున్న వందన ఇప్పుడు కొన్ని వందల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. పెన్సిల్ తయారీలో తనే శిక్షణ ఇచ్చి... తయారైన పెన్సిల్స్ తనే కొనుగోలు చేస్తోంది. కేవలం లక్షా యాభైవేల పెట్టుబడితో... ఇంట్లోనే కూర్చుని "జీరో రిస్క్"తో నెలకు పాతిక నుంచి యాభై వేలు సంపాదించేలా వందలాది కురుంబాలను తీర్చిదిద్దుతున్న  వందనను అభినందించకుండా ఎవరూ ఉండలేరు!!


     తన తండ్రి పేరు "రాఘవ" (బర్ల రాఘవరావు)కు తన శ్రీవారి పేరు "శ్రీకాంత్" (కొల్లి శ్రీకాంత్)లోని "శ్రీ"ని జోడించి... "శ్రీరాఘవ ఎంట్రప్రెజస్" పేరుతో "పెన్సిల్ ఇండస్ట్రీ" నిర్వహిస్తున్న వందన... తన గెలుపు బాటలో... తన శ్రీవారితోపాటు... తన తల్లి-అన్నయ్యల సహాయ సహకారాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెబుతుంది. సొంతంగా తమ కాళ్ల మీద నిలబడాలనుకునేవారు... వందనను 7989751220

నంబర్ లో నేరుగా సంప్రదించవచ్చు!!

 ప్రజల నిలదీస్తారన్న భయంతోనే-విజయశాంతి


రాష్ట్రంలో ఉంటే ఎక్కడకు వెళ్లినా జనం నిలదీస్తారనే ఆందోళనతో జాతీయ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రం బయట తిరగడం మొదలుపెట్టారని కేసీఆర్ పై బీజేపీ నాయకులు విజయశాంతి విమర్శలు గుప్పించారు. తనను ఛీకొడుతున్న తెలంగాణ ప్రజల నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ సమ్మర్ వెకేషన్ గా ఈ ఊళ్లు తిరిగే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప మరొకటి కాదని అన్నారు. 

ఫెడరల్ ఫ్రంట్ అంటూ జాతీయ రాజకీయాల పేరిట తెలంగాణ సీఎం కేసీఆర్ ఆడుతున్న డ్రామాలు చూస్తుంటే... ప్రజల్ని మోసగించడానికి ఆయన ఏ స్థాయికైనా వెళ్లేందుకు సిద్ధపడతారని పదేపదే స్పష్టమవుతోందని ఆమె అన్నారు. సారు నాటకాలను 2009 నుంచి జనం చూస్తూనే ఉన్నారని... నాటి ఎన్నికల్లో టీడీపీ, సీపీఐలతో కూడిన మహాకూటమికి జై కొట్టిన కేసీఆర్... బ్యాలెట్ బాక్సులు తెరవకముందే పంజాబ్ లోని లుథియానాలో జరిగిన భారీ ర్యాలీలో ఎన్డీయేకి సై అన్నారని విమర్శించారు. 

2014లో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ జపం చేసి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తానంటూ వారిని ఊరించి, చివరకు ఝలక్ ఇచ్చారని విజయశాంతి దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, తాను సీఎం అయ్యాక కూడా తనకు అలవాటైన కప్పదాటుడు వ్యవహారాలు, ఇచ్చిన మాట తప్పడం, చేసిన వాగ్దానాలను మర్చిపోవడం వంటి చర్యలతో గత ఏడేళ్ల పైచిలుకు పాలనాకాలంలో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, బీజేపీ విజయాల నేపథ్యంలో పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయిన కేసీఆర్ గారికి.. కమలదళం తన పాలనకు చరమగీతం పాడుతుందనే భయం పట్టుకుందని అన్నారు. 

దేశంలో ప్రాణాలు కోల్పోయిన రైతులు, జవాన్ల కుటుంబాలకు సాయం చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ... కేసీఆర్ సీఎం అయ్యాక గత ఏడేళ్ల కాలంలో ఒక్క తెలంగాణలోనే 7 వేలకు పైగా రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని... వీరందరినీ గాలికొదిలేసి దేశాన్ని ఉద్ధరిస్తానంటూ తిరగడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. గత ఏడేళ్లలో దేశం మొత్తం మీద కూడా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి మరణాలు ఎన్నో జరిగాయని.. వారి కుటుంబాలను కేసీఆర్ ఆదుకుంటారా? అని అడిగారు. తనను ఎన్నుకున్న రాష్ట్రానికే న్యాయం చేయని వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు.

 యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు


కశ్మీర్ వేర్పాటువాది యాసిన మాలిక్ కు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చి తీర్పు ఇచ్చింది. కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ కు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు జీవిత ఖైదును విధించింది. ఉగ్రవాదులకు, సంఘ విద్రోహ శక్తులకు నిధులు అందించారనే కేసులో శిక్షను ఖరారు చేసింది. యాసిన్ మాలిక్ కు ఉరిశిక్ష విధించాలని కోర్టును ఎన్ఐఏ కోరింది. ఇదే సమయంలో శిక్షను విధించేటట్టయితే జీవిత ఖైదును విధించాలని డిఫెన్స్ లాయర్లు కోర్టును విన్నవించారు. ఇరుపక్షాల వాదలను విన్న కోర్టు... ఈరోజు శిక్షను వెలువరించింది. యాసిన్ కు జీవిత ఖైదును విధించింది. 

మరోవైపు యాసిన్ మాలిక్ కు ఈరోజు శిక్షను ఖరారు చేస్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి శ్రీనగర్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విద్రోహశక్తులు అరాచకాలకు తెగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ఇంటర్నెట్ ను కట్ చేశారు.

 ప్రజలు  తన ఇష్టానుసారం మతాన్ని అవలంబించే  స్వేచ్ఛ ఉంది

ఐ.ఎం.అహ్మద్ స్పష్టీకరణ

(జానో జాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)

భారత రాజ్యాంగం ప్రకారం దేశంలోని అన్ని మతాలు సమానమేనని, ఏమతమూ ఇతర మతంపై ప్రాధాన్యత కలిగి లేదని ప్రజలు  తన ఇష్టానుసారం మతాన్ని అవలంబించే  స్వేచ్ఛ కల్పించబడిందని సొసైటీ ఆఫ్ ఇంటలెక్చువల్స్ వాయిస్, విశాఖపట్నం అధ్యక్షుడు,ప్రముఖ న్యాయవాది ఐఎం అహ్మద్ అన్నారు. విశాఖలో ప్రముఖ వ్యక్తిత్వ నిపుణుడు సిరాజ్ ఆధ్వర్యంలో  ప్రాధమిక హక్కులు, మతస్వేచ్ఛ, ప్రజాప్రయోజన వాజ్యాలపై ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సును  ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎం అహ్మద్ మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం ప్రాధమిక హక్కులని పేర్కొన్నారు.ప్రాధమిక హక్కులకు ఎవ్వరూ భంగం కల్పించినా నేరమేనన్నారు.సదస్సులో రాష్ట్రం నలు మూలల నుండి  హాజరైన దాదాపు రెండువందల మందికి ఇండియన్ పీనల్ కోడ్ పై అవగాహన కల్పించి రాజ్యాగం కల్పించిన హక్కులు అందరికీ సమానమేనని తెలిపారు.


నిర్వాహకులు  సిరాజ్ వ్యక్తిత్వ వికాసం,బహిరంగ ప్రసంగాలు,నైతిక విలువలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఐఎం అహ్మద్  చేస్తున్న  న్యాయపోరాటాలు,ఆహార కల్తీ,పండ్లలో  రసాయనాలు కలపడం,కాలుష్యం  పై  న్యాయ పోరాటాలను బ్రదర్  సిరాజ్  ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో మౌలానా ముతీవర్ రెహ్మాన్,అబ్దుల్ షేక్,ఇబ్రహీం, యాసీన్,ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఆశలు గల్లంతు చేసిన పరిస్థితులు..క్రిప్టో కరెన్సీ తలకిందులు


గత రెండు వారాలుగా లునా వాల్యూ భారీగా పడిపోతూ ఉంది. టెర్రా సిస్టర్ కాయిన్ అయిన లునాకి స్టేబుల్ కాయిన్‌గా పేరు ఉండేది. కానీ ఇప్పుడు దీని వాల్యూ జీరో వద్ద ట్రేడవుతోంది. లునాలో ఉన్న 1.6 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు... ప్రస్తుతం 2,200 డాలర్లకు ఎలా పడిపోయాయో చాంగ్‌పెంగ్ జావో వివరించారు. ప్రస్తుతం లునా 18.6 శాతం నష్టంలో 0.0001416 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ వాల్యూను తీసుకుంటే.. బినాన్స్ నిర్వహిస్తోన్న 15 మిలియన్ లునా టోకెన్ల ప్రస్తుత మార్కెట్ ధర వద్ద లెక్కిస్తే 2,214 డాలర్లుగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే క్రిప్టో ఎక్స్చేంజ్ బినాన్స్ వ్యవస్థాపకుడు, బిలీనియర్ చాంగ్‌పెంగ్ జావో తాను మళ్లీ పేదవాడిని అయిపోయానంటూ ప్రకటించుకున్నారు. లునా వాల్యూ భారీగా క్రాష్ కావడంతో ఈ క్రిప్టో కరెన్సీలో తన ఎక్స్చేంజ్ పెట్టుబడులు 1.6 బిలియన్ డాలర్ల నుంచి 2,200 డాలర్లకు పడిపోయాయని చెప్పారు. నెల వ్యవధిలోనే ఈ పెట్టుబడులు ఈ మేర తగ్గిపోయాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయినా బినాన్స్‌ 15 మిలియన్ లునా టోకెన్లను నిర్వహిస్తుందని జావో వెల్లడించారు.

ప్రస్తుతం లునా క్రిప్టోకరెన్సీ వాల్యూ జీరోకి క్రాష్ అయిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఇన్వెస్టర్ల సంపద గల్లంతైంది. లునా కుప్పకూలడం వల్ల బినాన్స్ ఫౌండర్ బిలియన్ డాలర్లకు పైగా కోల్పోయారు. ఈ నష్టంతో ఆయన మళ్లీ తనకు తాను పేదవాడిగా మారినట్టు ట్వీట్ చేశారు. పూర్ అగైన్ అనే క్యాప్షన్‌తో ఫార్చ్యూన్‌లో ఓ ఆర్టికల్‌ను ఉట్టంకిస్తూ ట్వీట్ చేశారు.

 ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో

త్రిభాషా చిత్రం లవ్వాట టైటిల్ ఆవిష్కరణ!!

(జానో జాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

      యువ ప్రతిభాశాలి ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న వినూత్న ప్రేమకథాచిత్రం "లవ్వాట". నిడిగంటి సాయి రాజేష్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1 గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్. వెంకటేశ్వర్లు-బొట్టా శంకర్రావు-వెంకటగిరి శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. "రావణలంక" ఫేమ్ క్రిష్ బండిపల్లి హీరో. మీరా కన్నన్, దీక్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రంలో సీనియర్ నటులు బెనర్జీ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు!!

      జూన్ 22 నుంచి, శ్రీకాకుళం, మిర్యాలగూడ, హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో అత్యంత కోలాహలంగా జరిగింది. కాన్సెప్ట్ కు తగిన మంచి టైటిల్ సూచించమంటూ సోషల్ మీడియాలో నిర్వహించిన కాంటెస్ట్ లో విజేతగా నిలిచిన మానే రామారావు "లవ్వాట" టైటిల్ లోగో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో బెనర్జీ, సంతోషం పత్రికాధినేత సురేష్ కొండేటి, మూసా అలీఖాన్, ధీరజ అప్పాజీ, "రుద్రాక్షపురం" నిర్మాత కొండ్రాసి ఉపేందర్ లతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు!!


      "లవ్వాట"లో తానొక కీలక పాత్ర పోషిస్తున్నానని, దర్శకుడిగా గాంధీకి ఉజ్వల భవిష్యత్ ఉందని బెనర్జీ పేర్కొన్నారు. సురేష్ కొండేటి-మూసా అలీఖాన్ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. "లవ్వాట" చిత్రంతో నిర్మాతలుగా పరిచయమవుతున్నందుకు నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు!!

     హీరో క్రిష్ బండిపల్లి మాట్లాడుతూ... గాంధీ చెప్పిన కథ వింటే నేనే కాదు... ఎంత పెద్ద యువ హీరో అయినా టక్కున ఓకే చెబుతారు. సబ్జెక్ట్ విని స్పెల్ బౌండ్ అయిపోయాను" అన్నారు. "లవ్వాట"లో హీరోయిన్స్ గా నటించే అవకాశం రావడం పట్ల హీరోయిన్లు మీరా, దీక్ష సంతోషం వ్యక్తం చేశారు!!

     చిత్ర దర్శకుడు ఆర్.కె.గాంధీ మాట్లాడుతూ... "నా ఫస్ట్ ఫిల్మ్ "ప్రేమభిక్ష" విడుదల కాకుండానే... నా మూడో చిత్రం "లవ్వాట" ప్రి-ప్రొడక్షన్ పూర్తి చేసుకుని టైటిల్ లాంచ్ జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. నా మొదటి, రెండవ చిత్రాలు "ప్రేమభిక్ష, రుద్రాక్షపురం" పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రేమ పట్ల నేటితరం దృక్పథం ఎలా ఉన్నదో వినోదాత్మకంగా వివరిస్తూ సాగే చిత్రమిది. తెలుగుతోపాటు తమిళ-కన్నడ భాషల్లో రూపొందిస్తున్నాం. ఈ అవకాశమిచ్చిన నిర్మాతలకు, ప్రోత్సహిస్తున్న మిత్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు" అన్నారు!!

     థ్రిల్లర్ మంజు, ఢిల్లీ మురళి, అప్పాజీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఫైట్స్: థ్రిల్లర్ మంజు-బాజి, ఛాయాగ్రహణం: ఎమ్.నాగేంద్ర, సంగీతం: జి.కె, ఎడిటింగ్: మల్లి,  నిర్మాతలు: ఎన్. వెంకటేశ్వర్లు- బొట్టా శంకర్రావు -వెంకటగిరి శ్రీనివాస్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఆర్.కె.గాంధీ!!

 బంగారం కోసం బాబాను నమ్మాడు...సర్వంకోల్పోయాడు


సులువుగా సొమ్ము..అనతికాలంలో కోటీశ్వరుడు ఇలా ప్రతి సామాన్యుడు చేసే ఆలోచన. కానీ ఎంచుకొనే మార్గాలే సరైనవిగా కావడంలేదు. అలాంటి ఘటనే ఇది. దొంగబాబాల గురించి దిన పత్రికలు, వార్తా చానెళ్లలో ఎన్ని కథనాలు వస్తున్నా.. ప్రజల్లో చైతన్యం రావడం లేదు. డబ్బు, బంగారం మీద ఆశతో ఫేక్ బాబాలను నమ్మి మోసపోతున్నారు. తాజాగా పూజ గదిలో బంగారం వెలికి తీస్తామంటూ దొంగ బాబాలు చెప్పిన మాటలు నమ్మి ఓ వ్యక్తి పూర్తిగా మోసపోయాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఇద్దరు ఫేక్ బాబాలను అరెస్టు చేసి వారి నుంచి రూ.15 వేల నగదు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాకు చెందిన మతం చందు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎర్నాళ్ల సంజీవ్ అలియాస్ సంజయ్ బాబాలుగా అవతారమెత్తారు. ఈ క్రమంలోనే అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. ఏప్రిల్ 11న ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ మాచర్ల రాజు వద్దకు వచ్చి బాబాలుగా పరిచయం చేసుకున్న వారు.. మీ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెడితే అంతా శుభం కలుగుతుందని చెప్పుకొచ్చారు. దీంతో అందుకు అంగీకరించిన అతడు.. ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టారు.

ఈ క్రమంలోనే ఇంట్లో పూజ గది మూసి ఉండడంతో వారు ఆరా తీశారు. తన సోదరుడి కుమారుడు చనిపోవడానికి పూజలు చేయడం లేదని సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు. దీంతో ఇంట్లో దెయ్యం ఉందని, అమావాస్య రోజు పూజ చేయాలని, లేకుంటే మరో మరణం సంభవిస్తుందని వారు భయపెట్టారు. ఈ క్రమంలోనే రూ.3 వేలు తీసుకుని వెళ్లిపోయారు. అనంతరం వారం తర్వాత బాబాలను కలిసి పూజ చేయాలని కోరగా అందుకు వారు రూ.35 వేలు తీసుకుని పూజలు చేసి వెళ్లిపోయారు.

ఈ క్రమంలోనే పది రోజుల తర్వాత ఆబాబాలు మళ్లీ వచ్చి మీ ఇంట్లో పూజ గదిలో రూ.4 కోట్ల విలువైన బంగారం ఉందని నమ్మించారు. వారి మాటలు నమ్మిన అతడు బంగారం వెలికి తీయాలని కోరాడు. ఈ క్రమంలోనే అందుకు సిద్దిపేటలో రూ.1.80 లక్షలు విలువ చేసే పూజా సామగ్రి కొనాల్సి ఉంటుందని చెప్పారు. అతడిని పూజాసామాగ్రి షాపునకు తీసుకెళ్లి రూ.30 వేల సామగ్రి రాజుకు ఇచ్చి పంపించారు. ఆ తరువాత కమిషన్‌గా దుకాణదారుడు బాబాలకు రూ.1.5 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత వివిధ పూజల పేరుతో రూ.7.5 లక్షలు వసూలు చేశారు. అన్ని పూజలు చేశామని.. కొన్ని రోజుల తర్వాత పూజ గది తెరిచి చూడాలని చెప్పి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే రోజులు గడుస్తున్నా బంగారం కనిపించకపోవటంతో రాజు కుటుంబం మోసపోయామని గ్రహించారు. దీంతో ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టారు. ఆదివారం నకిలీ బాబాలు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అవార్డు సాధించిన..

నంద్యాలకు చెందిన నూర్ బాషా

పలువురు ప్రముఖుల ప్రశంస


(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, బయోటెక్నాలజీ విభాగంలో ఫుల్ టైమ్ రిసెర్చ్ స్కాలర్ అయిన నంద్యాల పట్టణ టెక్కె పోలీస్ లైన్ మస్జిద్ మవుజ్జన్ నజీర్ హుసేన్ కుమారుడు షేక్ నూర్ బాషా కు బయోటెక్నాలజీ లో పి.హెచ్.డి, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అవార్డు లభించింది. క్యాన్సర్ విరుగుడు డ్రగ్ తయారిలో నూర్ బాషా చేసిన పరిశోధన "Expression and Purification of Recombinant L- Asparaginase Type II and the Development of Pegylected L- Asparaginase for Treatment of Acute Lymphoblastic Lukemia " కు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆమోదించి డాక్టరెట్ ప్రదానం చేసింది. నూర్ బాషా తన సిద్ధాంత వ్యాసాన్ని డాక్టర్ మురళి కే.ఆర్. తుమ్మూరు పర్యవేక్షణలో సమర్పించారు. పేద మైనార్టీ కుటుంబానికి చెందిన డా.నూర్ బాషా నంద్యాలలోని ఖలీల్ సిద్ధీఖీ ఎయిడెడ్ హైస్కూలులో ఉర్దూ మీడియంలో పదవి తరగతి, కర్నూలు మైనారిటీ బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఉర్దూ మీడియంలో, నంద్యాల నేషనల్ డిగ్రీ కళాశాలలో బి.ఎస్.సి, పీజి కళాశాలలో ఎం.ఎస్.సి బయోటెక్నాలజీ డిస్టింక్షన్ లో పూర్తి చేసారు. పేద కుటుంబమైన, జన్యురిత్య నాలుగు అడుగుల ఎత్తే అయిన ఏమాత్రం నిరాశ చెందక ఆత్మస్థైర్యం కోల్పోకుండా విద్యలో ఉన్నత స్ధానలు అధిరోహించాడు. ప్రస్తుతం హైదరాబాదులోని విర్కో బయోటిక్స్ లో పరిశోధన రంగంలో పని చేస్తున్నాడు. ఈ సందర్భంగా డా.నూర్ బాషా మాట్లాడుతూ పట్టుదల ఉంటే , సాధించే గమ్యం చేరువ అవుతుందన్నారు. ఎందరో పేద పిల్లలను ప్రోత్సహించె జమాతె ఇస్లామి హింద్ నంద్యాల అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ స్వయానా తన చిన్నాన్న అని, ప్రతి మలుపులో ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించేవారన్నారు. నంద్యాల వాసికి డాక్టరేట్ రావడం పట్ల పలువురు ప్రశంసించారు.

 బాబు నుంచి కింది స్థాయి నేతల పరిస్థితి అంతా అలాగే


ఓటమి తెచ్చిన ఫ్రస్ట్రేషన్ వల్ల చంద్రబాబు నుంచి వారి పార్టీలో  కింది స్థాయి నేతల వరకు అందరి మెంటల్ కండిషన్ దిగజారిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడు చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ''అయ్యన్న మెంటల్ కండిషన్ ఆందోళనకరంగా మారింది. మెదడుకి, నాలుకకు మధ్య ‘హుందాతనం’ అనే లింకు తెగిపోయి పిచ్చి కూతలు కూస్తున్నాడు. వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో బెడ్ సిద్ధం చేయక తప్పేలా లేదు. ఓటమి తెచ్చిన ఫ్రస్ట్రేషన్ వల్ల బాబు నుంచి కింది వరకు అందరి పరిస్థితి ఇలాగే తయారైంది'' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

ఏపీ సీఎం జ‌గ‌న్ దావోస్ లో పర్య‌టిస్తోన్న నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు చేస్తోన్న విమ‌ర్శ‌ల‌కు విజ‌య‌సాయిరెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. ''దావోస్ వెళ్లి బాబు ఏం చేశాడో, ఏం తీసుకొచ్చాడో ఇన్నాళ్లు ఎవరూ పట్టించుకోలేదు. పాత వీడియోలు చూస్తే రాష్ట్రం పరువు తీసొచ్చాడని మాత్రం అర్థమవుతోంది. తన పాలనలో నేరాలే జరగలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. 2016-19 మధ్య రాష్ట్రంలో 1,44,703 నేరాలు నమోదైనట్టు ఎన్‌సీఆర్బీ వెల్లడించింది'' అని ఆయ‌న పేర్కొన్నారు. 

 శ్రీలంక ప్రజలపై ధరల బాదుడు...లీటర్ పెట్రోల్  రూ.420కి


శ్రీలంకలోని పరిస్థితులతో ఉన్నత వర్గాల నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ అల్లాడిపోతున్నారు. అక్కడి ప్రజలు అధిక ధరలను భారంగా మోయాల్సి వస్తోంది. తాజాగా తీవ్ర ఆర్థిక‌, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న‌ శ్రీలంకలో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు మ‌రింత పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 24.3 శాతం పెరగగా, డీజిల్ ధర 38.4 శాతం పెరిగింది. లీటర్ పెట్రోల్ ధ‌ర‌ రూ.82 పెరిగి, రూ.420కి చేరింది. అలాగే, లీట‌రు డీజిల్ ధ‌ర‌ రూ.111 పెరిగి, రూ.400కు చేరింది. ఈ మేర‌కు సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్ నేటి నుంచే ఈ ధ‌ర‌లు పెంచింది. 

మ‌రోవైపు, ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అనుబంధ సంస్థ లంకా ఐఓసీ కూడా చమురు ధరలను పెంచింది. ర‌వాణా ఛార్జీల‌పై భారం మ‌రింత ప‌డుతుండ‌డంతో అన్ని ర‌కాల వ‌స్తువులు, స‌రుకుల ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. 

ఆటో డ్రైవ‌ర్లు ఇప్ప‌టికే కిలో మీటరుకు ప్రయాణికుడి వద్ద దాదాపు రూ.90 తీసుకుంటున్నారు. శ్రీ‌లంక‌లో ప్ర‌జ‌లు పెట్రోల్‌, డీజిల్, వంటగ్యాస్ తో పాటు ఇతర నిత్యావసరాల కోసం భారీగా క్యూ క‌ట్టాల్సి వ‌స్తోంది. మ‌రోవైపు శ్రీ‌లంక‌లో విద్యుత్‌ కోతలు, ఆహార పదార్థాల కొరత ప్రజ‌ల‌ను వేధిస్తున్నాయి.