ప్రత్యామ్నాయాలతో ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇస్తున్న రష్యా


తనపై వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు రష్యా తనను తాను సన్నద్దంచేసుకొంటోంది. ఇందు కోసం పలు రకాల చర్యలను ఆ దేశం చేపట్టింది. తాజగా అగ్ర దేశాలకు రష్యా గట్టి కౌంటర్ ఇచ్చింది. యూరోపియన్ దేశాలు, అమెరికా విధిస్తోన్న ఆంక్షలకు చెక్ పెట్టింది. తన దేశీయ మార్కెట్లకు సపోర్టు ఇచ్చుకునేందుకు వడ్డీ రేట్లను భారీగా పెంచింది. ఉక్రెయిన్‌తో జరుపుతోన్న దాడితో తన దేశీయ మార్కెట్లకు సపోర్టు ఇచ్చుకునేందుకు రష్యా పలు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో భాగంగా రష్యా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను సోమవారం 20 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటన చేసింది. పశ్చిమ దేశాల నుంచి వెల్లువెత్తుతోన్న ఆంక్షల నుంచి ఈ విధంగా రష్యా బయటపడుతోంది. భారీగా పడిపోతున్న రూబుల్, పెరుగుతోన్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసేందుకు రష్యా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. అంతేకాక విదేశీ కరెన్సీ రెవెన్యూలను 80 శాతం వరకు అమ్మేయాలని కంపెనీలకు రష్యా సెంట్రల్ బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. రష్యా ఆర్థిక వ్యవస్థలో విదేశాలతో ఉన్న ట్రేడింగ్‌లో భారీ మార్పులు వచ్చాయని ఆ దేశ సెంట్రల్ బ్యాంకు తెలిపింది. పెరుగుతోన్న ద్రవ్యోల్బణ ప్రమాదం నుంచి బయటపడేందుకు, పడుతోన్న కరెన్సీ విలువను కాపాడేందుకు డిపాజిట్ రేట్లను పెంచాల్సినవసరం వచ్చిందని రష్యా సెంట్రల్ బ్యాంకు తెలిపింది. ఇది ఆర్థిక వ్యవస్థలో, ధరలలో స్థిరత్వాన్ని కొనసాగిస్తుందని.. ప్రజల పొదుపులను కాపాడుతుందని ఆ బ్యాంకు తెలిపింది. దేశంలో రూబుల్ లేదా సెక్యూరిటీలను అమ్మేందుకు విదేశీ ఆర్డర్లను అంగీకరించే ట్రేడర్లపై కూడా రష్యన్ సెంట్రల్ బ్యాంకు ఆదేశాలు విధించింది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ.. పలు యూరోపియన్ దేశాలు ఈ దేశంపై ఆంక్షలు విధిస్తున్నాయి. గ్లోబల్ పేమెంట్స్ సిస్టమ్ సిఫ్ట్‌ను వాడేందుకు కొన్ని రష్యన్ బ్యాంకులపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో పాటు రష్యా సెంట్రల్ బ్యాంకుకు విదేశీ రిజర్వులు అందకుండా ఉండేందుకు మరికొన్ని ఆంక్షలు విధించాలని చూస్తున్నాయి. తమ దేశాలలో రష్యా కంపెనీలకు, కుబేరులకు ఉన్న ఆస్తులను జప్తు చేసేందుకు ఉమ్మడి టాస్క్‌‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని అమెరికా, యూరోపియన్ దేశాలు, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా దేశాలు నిర్ణయించాయి. ఆ దేశంపై ఇతర దేశాలు విధిస్తోన్న ఆంక్షల మూలంగా రష్యాకు లిక్విడిటీనే దొరకకుండా పోతుంది. దీంతో రష్యన్ కరెన్సీపై భారీగా దెబ్బపడింది.మరోవైపు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్టు అయిన రష్యన్ స్టాక్స్‌లో సోమవారం భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంటోంది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: