పుతిన్ వైఖరికి వ్యతిరేకంగా స్వదేశంలోనే నిరసనలు


రష్యా దేశాధినేతపై ఆదేశంలోని పౌరులే నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొద‌లెట్టిన ర‌ష్యాకు ఇంటా బ‌య‌టా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్‌పై మిలిట‌రీ ఆప‌రేష‌న్ అంటూ ఏకంగా యుద్ధాన్నే మొద‌లెట్టేసిన ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ వైఖ‌రికి నిర‌స‌న‌గా ర‌ష్యాలో గురువారమే పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. తాజాగా ఢిల్లీలోని ర‌ష్యా రాయ‌బార కార్యాల‌యం వ‌ద్ద కూడా నిరస‌న చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధ మొద‌లెట్ట‌గానే..ఆ దేశానికి చెందిన అన్నిదేశాల్లోని రాయ‌బార కార్యాల‌యాల వ‌ద్ద గ‌ట్టి భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ర‌ష్యా రాయ‌బార కార్యాల‌యం వ‌ద్ద కూడా భ‌ద్ర‌త‌ను కట్టుదిట్టం చేశారు. అయితే శుక్ర‌వారం సాయంత్రం ఓ యువ జంట ఆ భ‌ద్ర‌తా వ‌ల‌యాన్ని దాటుకుని ఢిల్లీలోని ర‌ష్యా రాయ‌బార కార్యాల‌యం వ‌ద్దకు ఉక్రెయిన్ జెండా ప‌ట్టుకుని ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. దీంతో షాక్ తిన్న పోలీసులు ఆ జంట‌ను అరెస్ట్ చేసి అక్క‌డి నుంచి త‌ర‌లించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: