గ్రామాలను అభివృద్ధి చేయడమే.. ప్రభుత్వ లక్ష్యం

ఎంపీడీవో విజయ సింహారెడ్డి 

మాట్లాడుతున్న గడివేముల ఎంపీడీవో విజయ సింహారెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండలంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎంపీడీవో విజయ సింహా రెడ్డి మాట్లాడుతూ....ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై  జగనన్న స్వచ్ఛ సంకల్పం పై జెసి గారు వారం రోజుల నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా ప్రతి మండలంలోని గ్రామాలను  అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో జగనన్న ప్రతి గ్రామంలోని ప్రజలను అందరిని గ్రామాభివృద్ధికి సహాయపడే విధంగా భాగస్వామ్యం చేయాలని, గ్రామాలలో లో  ఉండే ప్రజలందరినీ  భాగస్వామ్యం చేయాలని జగనన్న స్వచ్ఛ సంకల్పం ఏర్పాటు చేయడం జరిగిందని,


స్వచ్ఛ సంకల్పం  మండలంలో ప్రతి గ్రామంలో ఉండే తడి చెత్త మరియు పొడి చెత్త వీటన్నిటిని సేకరించడం ద్వారా సామాన్య ప్రజలకు అందుబాటులోకి సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి దోహదపడాలని, తద్వారా ప్రతి  గ్రామంలో ఆదాయం  సమకూర్చుకొని గ్రామాభివృద్ధి ఏర్పాటు చేసేందుకు  కృషి చేయాలనే ఉదేశంతో ఇప్పటివరకు గడివేముల మండలం లోని 16 గ్రామాలలో పారిశుద్ధ్య కేంద్రాలను అన్నింటిని పూర్తిచేశామని, వాటిలో లో గని గ్రామంలో, కరిమద్దెల గ్రామంలో చిన్నపాటి కారణాల వల్ల ఏర్పాటు చేయడం  ఆలస్యమైందని, త్వరలో వీటిని కూడా పూర్తి చేస్తామని, మిగతా గ్రామాలలో అన్నిటిలో కూడా పారిశుద్ధ్య యంత్రాంగం పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య లోపం లేకుండా ఉండేందుకు పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ డాట్స్, మరియు గ్రీన్ అంబాసిడర్స్ ప్రజలలో చైతన్య పరిచి తడి చెత్త మరియు పొడి చెత్త గ్రామపంచాయతీ వారి వాహనాలకు తరలించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని గడివేముల మండల గ్రామ ప్రజలకు ఎంపీడీవో విజయ సింహా రెడ్డి తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: