ఒక టీకాతో అన్ని కరోనా వేరియంట్లకు చెక్..

భారత్ లో పురోగతి


ఒక టీకాతో కరోనాలోని అన్ని వేరియంట్లకు చెక్ పెట్టేలా ఒకే ఒక టీకా అందుబాటులోకి రానున్నది. కరోనా వైరస్‌లోని అన్ని వేరియంట్లకు ఇక ఒకే ఒక్క టీకాతో చెక్ చెప్పొచ్చు. ఈ మేరకు సరికొత్త టీకాను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని కాజీ నజ్రుల్ విశ్వవిద్యాలయం, భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టీకాకు ‘అభిఎస్‌సీవో వ్యాక్’ అని పేరు పెట్టారు. ఇది పెప్టైడ్ వ్యాక్సిన్. కొవిడ్-19కు కారణమయ్యే సార్స్-కోవ్-2తోపాటు ఆ తరగతికి చెందిన ఆరు రకాల వైరస్‌లపై ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. కరోనాలోని అన్ని వైరస్‌లపైనా పనిచేసే ఏకైక టీకా ప్రపంచంలో ఇదొక్కటేనని శాస్త్రవేత్తలు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: