బహుముఖ ప్రజ్ఞాశాలి...బహు భాషా కోవిదుడు
మౌలానా అబుల్ కలాం ఆజాద్
స్వాతంత్ర సమర యెధుడు భారత రత్న మొట్టమొదటి విద్యశాఖ మంత్రి అసమాన విద్యావేత్త గొప్ప పాత్రికేయుడు రాజ నీతిజ్ఞాతకు పర్యాయ పదంగా నిలిచిన మేధో సంపన్నుడు బహుముఖ ప్రజ్ఞాశాలి బహు భాషా కోవిదుడు. ఒక దూరదృష్టి గల మహా పరిపాలకుడు స్థితప్రజ్ఞుడిగా ఆయన చిరకీర్తిని పొందారు. ఆయనే ది గ్రేట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. గాంధీజీ, జవహర్ లాల్ నెహ్రూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని భారత ప్లాటో అని, మౌలానా, మీర్-ఎ-కారవాన్ అని పిలిచేవారు.
నవంబర్ 11, 1888 న సంపన్నమైన గొప్ప కుటుంబంలో జన్మించారు మౌలానా ఒక కవి, తత్వవేత్త, రచయిత, విద్యావేత్త, రాజకీయవేత్త, భారతీయ విద్యా వ్యవస్థ నిర్మాత మరియు భారతీయ సంస్కృతిపై నిపుణుడిగా కీర్తి పొందారు. అరబిక్, పెర్షియన్, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ బాషలలో నిష్ణాత పండితులు మౌలానా ఆజాద్ భారతీయ స్వాతంత్ర్యోద్యమ గొప్ప నాయకుడు. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాల పాటు జైలుశిక్ష అనుభవించారు.
కేంద్ర ప్రభుత్వంలో మొట్టమొదటి విద్యా శాఖమంత్రి అయ్యారు. మరణాంతరం 1992లో అత్యున్నత పౌర పురస్కారమైన భారత్ రత్న పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. ఆయన జన్మించినరోజును "జాతీయ విద్యా దినోత్సవం" గా భారతదేశం అంతటా జరుపుకుంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక సృజనాత్మక మేధావి మాత్రమే కాదు, పాశ్చాత్య విద్యా వ్యవస్థలో ముఖ్యంగా సైన్స్ మరియు టెక్నాలజీలో బాగా ప్రావీణ్యం పొందారు. నాలుగు ముఖ్యమైన లక్ష్యాలను రూపొందించారు:1. విద్య యొక్క ప్రజాస్వామ్యం
2. విద్యా ప్రమాణాల నిర్వహణ
3. విద్యా దృక్పథం యొక్క విస్తరణ
4. పరస్పర అవగాహన ప్రమోషన్
రెండు విద్యా సంస్కరణలను ప్రవేశపెట్టి, వయోజన విద్య వ్యాప్తి మరియు సార్వత్రిక ప్రాధమిక విద్య కోసం దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభించారు యువ తరానికి ఉచిత విద్య మరియు సార్వత్రిక విద్యను కల్పించడం సెకండరి దశ వరకు విద్య ఉచితం మరియు తప్పనిసరి చేశారు నాణ్యమైన విద్య దేశఅభివృద్ధి జాతీయ సమైక్యత సోదరభావం సౌభ్రాతృత్వం మతసామరస్యం కొసం ఆయన ఎప్పుడూ పరితపిస్తూ ఉండేవారు. ఫిబ్రవరి 22, 1958న మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వర్గస్తులైనారు.
రచయిత
హాఫిజ్ షేక్ అజహర్
సెల్ : 9177723322
Post A Comment:
0 comments: