ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి: డీజీపీకి రేవంత్ రెడ్డి డిమాండ్


కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి తెగబడిన ఎమ్మెల్యేపై తక్షణం చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని డిమాండ్ చేస్తున్నట్టు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ పుట్టినరోజు పేరుతో టీఆర్ఎస్ నేతల అరాచకాలకు అడ్డులేకుండా పోయిందని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ సానుభూతి పరులపై పోలీసుల సమక్షంలోనే స్వయంగా ఎమ్మెల్యే దాడి చేయడం అటవిక చర్య అని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి తెగబడిన ఎమ్మెల్యేపై తక్షణం చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని డిమాండ్ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు దాడికి సంబంధించిన వీడియోను కూడ పంచుకున్నారు.  అంతకుముందు, రేవంత్ ట్విట్టర్ లో ఊసరవెల్లి ఫొటో పోస్టు చేసి "జన్మదిన శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: