కరీముల్లా ఇస్లాంవాద కవిత్వం

-------------------------

మైనం వంతెన


బోనులోకి

మెలమెల్లగా నా దేశం

అప్పటి ఊర్లూ లేవు

మాట్లాడే నోర్లూ లేవు

తడిగుండెల తన్మయత్వాలసలే లేవు

బందీలుగా తప్ప

స్వేచ్ఛా కపోతాలుగా మనమున్నామా?

పీనుగుల గుట్టలపై

ఫాసిజం బాయ్నెట్ పాతి

దేశభక్తి పాఠాలు చెప్పే

దేశద్రోహుల జమానా యిది

వాగ్దానాల మైనం వంతెనపై

మైమరచి నడుస్తున్న జనం

కరోనా వెంటిలేటర్పై

ఊపిరి పీలుస్తున్న జాతి

నకిలీ వైద్యునికి నజరానా సింహాసనం

మతతత్వ సిలబస్

మనోహరంగా విన్పిస్తుంటే

మరో మహా ఊచకోతకు

సైరన్ మోగుతున్నట్లుంది

వ్యాధి తెల్సు

వ్యాధి కారకాలు తెల్సు

మనువు చెక్కిన

పురా పంజరంలోకి

చడీచప్పుడు లేకుండా

నెట్టబడుతున్న యువత

మంత్రగాళ్లకు తప్ప

మనుషులకు మనుగడ లేదిక్కడ

నమో జపంలో

సర్వం సమర్పయామి

పొద్దు గుంకి దారి తప్పి

ఆకాశం గుబురు పొదల్లో దూరి

జీవనదుల్ని వెతికే కలహంసలమై

లౌకిక రహదారుల వెంట మనం

అవ్యక్తంగానో,అశరీరంగానో

నిప్పుల్ని తొక్కుకుంటూ

విస్తరిస్తున్న మాతం గీతం

రచయిత-కవి కరీముల్లా

వినుకొండ..గుంటూరు జిల్లా

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: