ఆ దేశాలలో ఎఫ్ఐఆర్ బ్యాన్


కువైట్, మలేషియా, ఖతార్ లలో ఎఫ్ఐఆర్ చిత్రాన్ని బ్యాన్ చేశారు. తమిళ హీరో విష్ణు విశాల్ నటించిన తాజా చిత్రం 'ఎఫ్ఐఆర్'. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మూడు దేశాలు షాకిచ్చాయి. కువైట్, మలేషియా, ఖతార్ లలో ఈ చిత్రాన్ని బ్యాన్ చేశారు. ఈ విషయాన్ని విష్ణు విశాల్ స్వయంగా వెల్లడించారు. సినిమాలోని ప్రధాన కంటెంట్ కారణంగా... సెన్సార్ ను ఈ సినిమా క్లియర్ చేయలేకపోయినట్టు సమాచారం. ఈ చిత్రంలో మంజిమా మోహన్, రైజా విల్సన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గౌరవ్ నారాయణన్, రెబా మోనికా జాన్ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమాలో విష్ణు విశాల్ మోస్ట్ వాంటెడ్ ముస్లిం యువకుడిగా నటించగా.. గౌతమ్ మీన్ పోలీసు అధికారిగా నటించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: