అలా ట్రోల్ చేస్తే చట్టబద్దమైన చర్యలు...పరువు నష్టందావా


నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడిపై లేనిపోనివి ట్రోల్ చేస్తే అట్టివారిపై చట్టపరమైన చర్యలు, పరువునష్టందావావేస్తామని  ఏవీఏం సంస్థ వెల్లడించింది. ఇటీవల తెలుగు చిత్రసీమకు సంబంధించి అనేక పరిణామాలు జరిగాయి. ఏపీలో సినిమా టికెట్లు-థియేటర్ల అంశం, సీఎం జగన్ తో టాలీవుడ్ పెద్దల భేటీ మీడియా దృష్టిని ఆకర్షించాయి. అంతేకాదు, మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సన్ ఆఫ్ ఇండియా చిత్రం కూడా ఇటీవలే రిలీజైంది. ఈ అంశాల నేపథ్యంలో, తమను సోషల్ మీడియాలో మితిమీరి ట్రోల్ చేస్తున్నారంటూ అగ్రనటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు ఆరోపిస్తున్నారు. మోహన్ బాబు, మంచు విష్ణుల తరఫున వారి కుటుంబానికి చెందిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ సంస్థ ట్రోలింగ్ చేసేవాళ్లకు ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. తీరు మార్చుకోకుంటే లీగల్ నోటీసులు పంపుతామని, రూ.10 కోట్ల మేర పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు  ఏవీఏ ఎంటర్టయిన్ మెంట్/24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ సీఓఓ శేషు కుమార్ ఓ ప్రకటన చేశారు. ఆయన దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు, మంచు విష్ణులకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పటికీ ట్రోలర్స్ స్పందించకపోతే క్రిమినల్ కేసులు, భారీ మొత్తంలో పరువునష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: