ప్రముఖ సింగర్ దీప్ సిద్దూ మరణంపై...అతడి ప్రేయసి రీనా రాయ్ భావోద్వేగం


కళ్లుముందు కావాల్సిన వారు పోతే ఆ బాధ ఎంతగా ఉంటుందో తెలుసు. ఇక ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మరణిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి ఘటనయే ఇది. హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్, ఎర్రకోట హింస కేసులో నిందితుడు దీప్ సిద్ధూ మరణించిన సంగతి తెలిసిందే. అతడు డ్రైవ్ చేస్తున్న స్కార్పియో కారు వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే దీప్ సిద్ధూ మరణించగా.. అదే కార్ లో పక్క సీట్ లో కూర్చున్న అతడి ప్రేయసి రీనా రాయ్ బతికి బయటపడింది. తాజాగా ఆమె స్పందించింది. దీప్ సిద్ధూ మృతిని తట్టుకోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘నా మనసు ముక్కలైపోయింది. నేను లోలోపలే చచ్చిపోతున్నాను. జీవితంలో ఎప్పుడూ వదిలి వెళ్లనూ అన్నావు.. నీ ప్రాణ ప్రేయసి కోసం తిరిగి వచ్చెయ్. నా ఆత్మ, నా జాను, నా గుండె చప్పుడువు నీవు. ఐ లవ్ యూ. నేను ఆసుపత్రి బెడ్ మీద ఉన్నప్పుడు.. నువ్వొచ్చి నా చెవిలో ఏదో చెబుతున్నట్టు అనిపించింది. ఇద్దరం కలిసి భవిష్యత్ పై ఎన్నెన్ని ఆలోచనలు చేశాం.. ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాం. ఇంతలో ఇలా వదిలేసి వెళ్లిపోయావు. ఐ లవ్ మై జాన్..  నువ్వెప్పుడూ నాతోనే ఉంటావని నాకు తెలుసు. సోల్ మేట్స్ ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు. నేను నిన్ను కలుస్తా’’  అంటూ రీనా రాయ్ పోస్ట్ పెట్టింది. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: