విలన్ గా విక్రమ్...మహేశ్ బాబు చిత్రంతో ఎంట్రీ


పేరుగాంచిన సినిమా హీరోలు సైతం ఇటీవల విలన్ గా ఎంట్రీ ఇవ్వడం ఓ ట్రెండ్ గా మారుతోంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో విలన్స్ గా కోలీవుడ్ స్టార్స్ కనిపిస్తున్నారు. అరవింద్ స్వామి ... విజయ్ సేతుపతి .. సముద్రఖని .. అర్జున్ వంటి వారు ఇక్కడ పవర్ఫుల్ ప్రతినాయకులుగా తమ హవాను కొనసాగిస్తున్నారు. ఆ జాబితాలో హీరో విక్రమ్ కూడా చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ఒక కీలకమైన పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ శోభనను తీసుకున్నారని అంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం హీరో విక్రమ్ ను సంప్రదిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ పాత్రకి ఆయన అయితేనే బాగుంటాడనే ఉద్దేశంతో ఆయనను ఒప్పించడానికి త్రివిక్రమ్ ట్రై చేస్తున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది. త్రివిక్రమ్ - మహేశ్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా ఇది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: