నాపై ట్రోల్ చేయిస్తోంది ఆ ఇద్దరు హీరోలే: మోహన్ బాబు


తనపై సామాజిక మధ్యమాల్లో ట్రోల్ అవుతున్న వీడియోల వెనక ఆ ఇద్దరు హీరోలు ఉన్నారంటే సినీనటుడు మోహన్ బాబు విమర్శలు గుప్పించారు. తనపై సామాజిక మాధ్య‌మాల్లో వ‌స్తోన్న ట్రోలింగ్ ప‌ట్ల సినీ న‌టుడు మోహ‌న్ బాబు స్పందించారు. తాజాగా, ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... ట్రోలింగ్‌, మీమ్స్‌ చూసి చాలా బాధపడుతున్నాన‌ని చెప్పారు. అటువంటి వాటిని ప‌ట్టించుకోవాల్సిన‌ అవసరం లేక‌పోయిన‌ప్ప‌టికీ మనిషిగా ఆత్మాభిమానం ఉంటుంది కాబ‌ట్టి కొన్ని విషయాల్లో బాధపడక తప్పదని చెప్పుకొచ్చారు. వ్యంగ్య ధోరణి కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని ఆయ‌న తెలిపారు. తాను మామూలుగా అయితే వాటిని చూడనని, అయితే ఎవరన్నా పంపిస్తేనే చూస్తానని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు హీరోల‌పై ఆయ‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆ ఇద్ద‌రు హీరోల పేరు మాత్రం చెప్ప‌లేదు. ఆ ఇద్దరు హీరోలు 50-100 మందిని అపాయింట్‌ చేసుకుని ప్రతి ఒక్కరినీ ట్రోల్‌ చేయిస్తున్నారని ఆరోపించారు. ఆ హీరోలు ఎవరో త‌న‌కు తెలుసని అన్నారు. తాత్కాలికంగా వారు బాగుంటున్న‌ప్ప‌టికీ, ఏదో ఒక రోజు వారు శిక్ష అనుభవిస్తారని ఆయ‌న అన్నారు. ఎదుటివారిని బాధ‌పెట్టేలా మీమ్స్ ఉండ‌కూద‌ని చెప్పారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: