తెలంగాణా బిల్లు పాసైన తీరును ప్రశ్నించడమంటే...

తెలంగాణా ఏర్పాటును అభిశంసిచడమే

మోడి వ్యాఖ్యలు తెలంగాణా ప్రజలను బాదించాయి

తెలంగాణా ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

కాంగ్రెస్ నేత జి.నిరంజన్ విమర్శ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కాంగ్రెస్ పార్టీ పై ఉన్న అక్కస్సు , ద్వేషంతో, ప్రధాని మోడీ నేడు తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ తీరును అభిశంస్తూ , చులకన చేస్తూ రాజ్యసభ లో మాట్లాడిన తీరు తెలంగాణా ప్రజలను హృదయాలను కలిచి వేసిందని టీ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ విమర్శించారు. మోడీ తెలంగాణా ప్రజల పోరాటాన్ని, బలిదానాలను తనకు పట్టనట్టు అవహేళన చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వము డిసెంబరు 9, 2009 ననే తెలంగాణా ప్రక్రియ పై ప్రకటన చేసిన విషయం మోడీ కి తెలియదా? జస్టిస్ శ్రీ కమిషన్ ను నియమించి అన్ని పక్షాలతో సుధీర్గ చర్చలు జరిపిన విషయం తెలియదా? కేంద్ర హోమ్ మంత్రి అఖిల పక్షాల సమావేశాలు పిలిచి సమాలోచనలు జరిపిన సంగతి మరిచారా? ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిల్లీ ఆంధ్ర భవన్ లో దీక్షకు కూర్చున్న విషయము తెలియదా ? అప్పటి ప్రతిపక్ష నాయకులు సుష్మా స్వరాజ్ తెలంగాణా బిల్లుకు మద్దతు తెలుప లేదా. తెలంగాణా ప్రకటన తరువాత చర్చల పేరిట సుమారు నాలుగున్నర సంవత్సరాల కాలయాపనను భరించలేక విధ్యార్తులు ఆత్మ హత్యలు చేసుకుని పిట్టలా చని పోతుంటే శ్రీమతి సోనియా గాంధీ ఇక భరించలేక స్థిర నిశ్చయముతో తెలంగాణా ఏర్పాటుకు బిల్లు పాసు చేయించి తెలంగాణా ప్రజల చిరకాల వాంచను నెరవేర్చి, విద్యార్థుల ఆత్మహత్యల ను అరికడితే హర్షించేది పోయి ద్వేషం తో విమర్శలు చేస్తారా. తెలంగాణా బిల్లును తీవ్రముగా వ్యతిరేకించిన వారు కాంగ్రెస్ వారే, అయినా శ్రీమతి సోనియా గాంధీ గారు పార్టీకి నష్టము జరుగుతదని తెలిసినా తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చి ఆత్మ హత్యలను నివారించారు. తెలంగాణా ఏర్పడి 8 ఏళ్లు అయినా నిలువెత్తు ద్వేషము తో తెలంగాణా బిల్లు ఆమోదించిన తీరును మోడీ ప్రశ్నిస్తున్నాడంటే ఆయనకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఇష్టము లేదని, తెలంగాణా విద్యార్థి యువకుల ఆత్మ హత్యలు ఆగడము రుచించడం లేదనిపిస్తుంది. మోడీ అనవసరముగా గెలికి తెలంగాణా ప్రజలను మానసికముగా గాయపర్చడము ఎంతవరకు సబబో రాష్ట్ర బి.జె.పి నాయకులు బండి సంజయ్ తదితరులు తేల్చి చెప్పాలి. తెలంగాణా బిల్లు పాస్ అయిన తీరును ప్రశ్నించడమంటే, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించడమే? మోడి వెంటనే తెలంగాణా ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. అని జి.నిరంజన్ డిమాండ్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: