రాజా సింగ్ పై మంత్రి కేటీఆర్ సెటైర్...బీజేపీ నుంచి మరో జోకర్ వచ్చాడు

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తనదైన శైలీలో సెటైర్ వేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలని, బీజేపీకి ఓటు వేయని వారి జాబితా తీస్తామ‌ని, వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తామని వ్యాఖ్యానించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు నేత‌లు మండిప‌డ్డారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా రాజా సింగ్ చేసిన ఆ వ్యాఖ్య‌ల వీడియోను పోస్ట్ చేస్తూ సెటైర్ వేశారు. 'వారు నైతికంగా ఇంత‌కంటే దిగ‌జార‌లేరు అని మీరు అనుకున్న స‌మ‌యంలోనే.. బీజేపీ నుంచి మ‌రో అద్భుతమైన హాస్యనటుడు ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌స్తాడు. మీరు బీజేపీకి ఓటు వేయ‌క‌పోతే మీ ఇళ్ల‌ను యోగి బుల్డోజ‌ర్లతో కూల్చేస్తార‌ని బీజేపీ తెలంగాణ‌ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: