చర్చలకు సిద్దమే కానీ..కండిషన్ అప్లయ్: రష్యా ప్రకటన
యుద్దం చేస్తూనే రుష్యా చర్చల ప్రస్తావన తీసుకొస్తోంది. తాజాగా ఉక్రెయిన్‌పైకి దండెత్తి వచ్చిన రష్యా రెండో రోజుకే రాజీ మంతనాలు మొదలెట్టేసింది. గురువారం ఉదయం నుంచి ఉక్రెయిన్‌పైకి బాంబులతో విచుకుపడ్డ రష్యా.. రెండో రోజు అయిన శుక్రవారమే చర్చలకు తాము సిద్ధమంటూ చెప్పడం మొదలుపెట్టింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం రష్యా విదేశాంగ శాఖ మంత్రి ఓ కీలక ప్రకటన చేశారు. తాజాగా నేరుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయమే శుక్రవారం మరో కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఉక్రెయిన్‌తో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నట్లుగా రష్యా అధ్యక్ష భవనం ప్రకటించింది. అయితే ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడాల్సి ఉంటుందని కండీషన్ పెట్టింది. ఈ కండీషన్‌కు ఓకే అయితే ఉక్రెయిన్‌తో చర్చలకు తమ బృందాన్ని మిన్స్క్కు పంపుతామని కూడా పుతిన్ కార్యాలయం వెల్లడించింది. మధ్యాహ్నం విడుదలైన రష్యా విదేశాంగ శాఖ మంత్రి ప్రకటనకు ఉక్రెయిన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అదే మాదిరిగా ఇప్పుడు రష్యా అధ్యక్ష భవనం ప్రకటనకు కూడా ఉక్రెయిన్ నుంచి స్పందనవచ్చే అవకాశమే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Home
Unlabelled
చర్చలకు సిద్దమే కానీ..కండిషన్ అప్లయ్: రష్యా ప్రకటన
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: